Begin typing your search above and press return to search.

రష్మిక డీప్‌ ఫేక్ వీడియో క్రియేటర్ ఏపీలో అరెస్ట్!!

ఈ క్రమంలో తాజాగా ఆ వీడియో క్రికేట్ చేసిన వ్యక్తిని పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిందితుడు ఏపీకి చెందిన వ్యక్తి అని తెలుస్తుంది! మరింత సమాచారం తెలియాల్సి ఉంది!

By:  Tupaki Desk   |   20 Jan 2024 11:14 AM GMT
రష్మిక డీప్‌  ఫేక్  వీడియో క్రియేటర్  ఏపీలో అరెస్ట్!!
X

ఇటీవల కాలంలో డీప్ ఫేక్ వీడియోల రచ్చ మామూలుగా లేదన్న సంగతి తెలిసిందే. ఈ పేరు చెబితేనే కొందరు సెలబ్రెటీలు వణికిపోతుంటే.. మరికొంతమంది అంతెత్తున లేస్తున్నారు. నాడు రష్మిక తో మొదలైన ఈ వీడియోల వైరస్.. అనంతరం పలువురు హీరోయిన్ లను వెంటాడింది. ఈ క్రమంలో తాజాగా సచిన్ ను తాకింది. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా రష్మిక డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేసిన వ్యక్తి అరెస్ట్ అయ్యాడని తెలుస్తుంది.

అవును... నటి రష్మిక మందాన డీప్‌ ఫేక్ వీడియో గతేడాది నవంబర్‌ లో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఈ ఘటనపై పలువురు సెలబ్రిటీలు రష్మికకు మద్దతుగా నిలిచి ఇలాంటి వీడియోలు చేసేవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. అందరికంటే ముందుగా బిగ్ బీ అమితాబ్ ఈ విషయంపై ఫైర్ అయ్యారు. దీంతో ఈ వ్యవహారంపై ఖండనలు పెరిగాయి!

దీంతో... ఈ వ్యవహారన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇటువంటి పనులను ఉపేక్షించేది లేదని గట్టిగానే చెప్పింది. ఇదే సమయంలో రష్మిక మందాన డీప్ ఫేక్ వీడియో కేసును ఢిల్లీ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆ వీడియో క్రికేట్ చేసిన వ్యక్తిని పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిందితుడు ఏపీకి చెందిన వ్యక్తి అని తెలుస్తుంది! మరింత సమాచారం తెలియాల్సి ఉంది!

కాగా... పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందాన డీప్ నెక్‌ తో ఉన్న బ్లాక్ డ్రెస్‌ లో.. లిప్ట్‌ లోకి వెళ్తున్నట్లు ఉన్న ఒక వీడియో గతేడాది నవంబర్‌ లో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వీడియోలో రష్మిక బాగా ఎక్స్‌ పోజ్ చేస్తున్నట్లు కనిపించింది! అయితే అది ఫేక్ వీడియో అని కొద్ది సమయంలోనే నెట్టింట పొక్కింది. ఈ విషయాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుంది.

ఈ సమయంలో ఆ వీడియోకి సంబందించిన ఒరిజినల్ వీడియో జరా పటేల్ అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ ది అని తెలియడంతో డీప్‌ ఫేక్ టెక్నాలజీ గురించి తీవ్ర చర్చ నడిచింది. ఈ సమయంలో పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఈ క్రమమోలోనే ఈ డీప్‌ ఫేక్‌ కి పాల్పడ్డ వ్యక్తిని ఏపీలోనే అరెస్ట్ చేశారని తెలుస్తుంది!!