Begin typing your search above and press return to search.

డీప్ ఫేక్.. ఈ భూతానికి అడ్డుకట్ట వేయలేరా?

ఈ మధ్యకాలంలో ఎక్కువగా డిప్ ఫేక్ అనే మాట చాలామంది అమ్మాయిలను కూడా కంగారు పెట్టే విధంగా మారిపోయింది.

By:  Tupaki Desk   |   16 Nov 2023 11:30 PM GMT
డీప్ ఫేక్.. ఈ భూతానికి అడ్డుకట్ట వేయలేరా?
X

ఒకవైపు టెక్నాలజీ పెరిగిపోతుంది అని, దేశం అభివృద్ధి చెందుతుంది అని సంతోష పడేలోపు మరొకవైపు అదే టెక్నాలజీతో ఎన్నో చేడు పరిణామాలు చోటు చేసుకున్న వైనం షాక్ కు గురి చేస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కూడా టెక్నాలజీతో ఏదో ఒక చెడు మార్గాలు అయితే క్రియేట్ అవుతూనే ఉన్నాయి. ఇక దీన్ని అరికట్టుకునేందుకు చాలా రకాలుగా సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా జరిగే చెడు పనులు జరిగిపోతున్నాయి.

ఈ మధ్యకాలంలో ఎక్కువగా డిప్ ఫేక్ అనే మాట చాలామంది అమ్మాయిలను కూడా కంగారు పెట్టే విధంగా మారిపోయింది. కేవలం ఒక హీరోయిన్ మాత్రమే కాకుండా దీని వలన ఇబ్బంది పడిన సాధారణ మహిళలు కూడా ఉన్నారు. గతంలో మార్ఫింగ్ ఫోటోలు కుప్పలు కుప్పలుగా ఇంటర్నెట్ ప్రపంచంలో కనిపిస్తూ ఉండేవి. కొంతమంది సెలబ్రిటీలు సైతం గతంలో ఈ విషయంపై గట్టిగానే స్పందించారు.

ఇక ఇప్పుడు మార్ఫింగ్ వీడియోలు AI టెక్నాలజీతో మరింత ఎక్కువగా పుట్టుకొస్తున్నాయి. హీరోయిన్స్ ఫేస్ లను మార్ఫింగ్ చేసి 70% నిజం అనేలా అసభ్యకరంగా వీడియోలను క్రియేట్ చేస్తున్నారు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వాలు ఎంత సీరియస్ గా ఈ విషయంలో చర్యలు తీసుకున్నప్పటికీ మళ్లీ పునరావృతం కాకుండా ఉంటుందా? అనేది అంత నమ్మకం గా ఎవరూ చెప్పలేరు.

అయితే ఈ ఘటనలు ఆగాలంటే ప్రత్యేకంగా ప్రతి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ గైడ్ లైన్స్ ను మార్చాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా వీటిపై ఆంక్షలు విధించాలి అనే రూల్స్ తీసుకురావాలి. అంతే కాకుండా మార్ఫింగ్ వీడియోలు చాలా ఈజీగా క్రియేట్ చేసే సాఫ్ట్ వేర్ లు చాలా ఈజీగా ఇంటర్నెట్ ప్రపంచంలో అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి. కాబట్టి ప్రతి సాఫ్ట్ వేర్ లకు అలాంటి వెబ్సైట్లకు కూడా లైసెన్స్ లను చట్టపరంగా తీసుకు రావాల్సిన అవసరం ఉంది.

హీరోయిన్స్ మార్ఫింగ్ వీడియోలు అంటే కేవలం ఇటీవల మాత్రమే రాలేదు. గతంలో కూడా ఈ తరహా కంటే దారుణమైన వీడియోలు సోషల్ మీడియా వరల్డ్ లో వైరల్ అయ్యాయి. కానీ ఆ విషయంలో ఎవరూ కూడా బయటకు చెప్పడానికి ధైర్యం చేయలేదు కాబట్టి దీనిపై ప్రత్యేకమైన గవర్నమెంట్ సైబర్ సెక్యూరిటీ టీమ్ లు ప్రత్యేకమైన దృష్టి సాధించాల్సిన అవసరం ఉంది.