Begin typing your search above and press return to search.

దావూద్ ఇబ్రహీం ఆరోగ్యంపై అనుచరుడు కీలక ప్రకటన!

మరోపక్క దావూద్ చనిపోయాడని కూడా సోషల్ మీడియాలో పోస్ట్‌ లు వైరల్ గా మారుతున్నాయి.

By:  Tupaki Desk   |   19 Dec 2023 6:58 AM GMT
దావూద్  ఇబ్రహీం ఆరోగ్యంపై అనుచరుడు కీలక ప్రకటన!
X

రెండు రోజులుగా అండర్‌ వరల్డ్‌ డాన్‌, 1993 ముంబయి బాంబు పేలుళ్ల సూత్రధారి దావూద్‌ ఇబ్రహీం వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అతడిపై విష ప్రయోగం జరిగిందని, ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారనే ప్రచారం జరిగింది. మరోపక్క దావూద్ చనిపోయాడని కూడా సోషల్ మీడియాలో పోస్ట్‌ లు వైరల్ గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో దావూద్ ప్రధాన అనుచరుడు చోటా షకీల్ స్పందించాడు.

అవును... రెండు రోజులుగా అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మరోసారి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాకిస్థాన్ లో తలదాచుకుంటున్నట్లు చెబుతున్న అతడి ఆరోగ్యంపై రకరకాల కథనాలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ సమయంలో అతడి ప్రధాన అనుచరుడు చోటా షకీల్ స్పందించాడని తెలుస్తుంది. ఇందులో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశాడని.. దావూద్ ప్రాణాలతో ఉన్నారని, చాలా ఆరోగ్యంగా ఉన్నారని ప్రకటించాడని అంటున్నారు.

ఈ విషయాలపై స్పందిస్తూ... "దావూద్ ఇబ్రహీం బతికే ఉన్నారు.. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు.. అతనిపై విషప్రయోగం జరిగిందని, ఆస్పత్రిలో ఉన్నారనే వదంతులు చూసి షాకయ్యారు.. నిన్ననే ఆయన్ను కలిశాను.. దావూద్ బాయ్ 1000శాతం ఫిట్ గా ఉన్నారు" అని చోటా షకీల్ ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో చెప్పినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

కాగా... అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మరోసారి ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయిన సంగతి తెలిసిందే. 1993 ముంబై వరుస పేలుళ్ల సూత్రధారి దావూద్‌ ఇబ్రహీం ప్రస్తుత 67 ఏళ్ల వయసులో ఉన్నారని తెలుస్తుంది. ఈ సమయంలో అతడి ఆరోగ్యానికి సంబంధించిన వార్తలు హల్ చల్ చేశాయి.

అయితే, దావూద్‌ చాలా ఏళ్లుగా కుటుంబంతో పాకిస్తాన్‌ లోనే నివసిస్తున్నారని.. అతను కరాచీలోనే ఉంటున్నట్టు పక్కా ఆధారాలున్నాయని భారత్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో భారత్‌ తో పాటు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కూడా 2003 లోనే దావూద్‌ ను మోస్ట్‌ వాంటెడ్‌ అంతర్జాతీయ క్రిమినల్ గా ప్రకటించింది.