Begin typing your search above and press return to search.

పాక్ నుంచి పరార్... దావూద్ ఎక్కడికి పారిపోయాడంటే..?

అవును... పాక్ పై ప్రతీకార దాడులకు దిగిన భారత్ బోర్డర్ లోనే కాకుండా నేరుగా ఆ దేశం గుండెలపైనే తన్నుతుందనే చర్చ బలంగా వినిపించింది.

By:  Tupaki Desk   |   10 May 2025 3:59 AM
పాక్  నుంచి పరార్... దావూద్  ఎక్కడికి పారిపోయాడంటే..?
X

ఆపరేషన్ సిందూర్ అనంతర పరిణామాల్లో భారతదేశ మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆచూకి ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. ముంబై ప్రజలకు చీకటి రోజులు మిగిల్చిన దావూద్.. భయపడి పారిపోయాడు! ఈ సమయంలో భారత్ కు అన్యాయం చేసే వారందరికీ ఫ్రీ అకామిడేషన్ ఇచ్చే పాక్ కి చేరాడు! ఎన్నో ఏళ్లుగా కరాచీ అతడి కేరాఫ్!

అయితే... చీకట్లో కూర్చొని దొంగదెబ్బ తీసి పారిపోవడం ఉగ్రవాదులకు, అండర్ వరల్డ్ కు అలవాటే కావడంతో అతడు పాకిస్థాన్ ప్రభుత్వ రక్షణలో కరాచీలోనే ఉంటున్నాడనేది జగమెరిగిన సత్యం అంటారు! అయితే... ఇటీవల భారత్, కరాచీ పోర్టుతో పాటు ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండి వంటి కీలక ప్రాంతాల్లో డ్రోన్లతో దీపావళి చేసిందని చెబుతున్నారు.

దీంతో... దావూద్ అండ్ కో లో వణుకు దడ మొదలయ్యాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంతకాలం భారత్ నుంచి రక్షణగా తనకు పాక్ కంచుకోట అని భావించిన దావూద్ కి తాజా పేలుళ్ల చప్పుళ్లు వెన్నులో వణుకు పుట్టించాయని చెబుతున్నారు. దీంతో చోటా షకీల్, మున్నా జింగడా వంటి నమ్మకమైన అనుచరులతో పాక్ నుంచి పారిపోయినట్లు చెబుతున్నారు.

అవును... పాక్ పై ప్రతీకార దాడులకు దిగిన భారత్ బోర్డర్ లోనే కాకుండా నేరుగా ఆ దేశం గుండెలపైనే తన్నుతుందనే చర్చ బలంగా వినిపించింది. ఇందులో భాగంగా... కరాచీతో సహా కీలక ప్రాంతాలను భారత డ్రోన్లు పలకరించాయని చెబుతున్నారు. ఈ సమయంలోనే రాత్రి చీకటిలో దావూద్ కాన్వాయ్ కరాచీ వీధుల్లో వేగంగా దూసుకుపోయిందని నివేదికలు అందుతున్నాయి.

ఇలా భారత సైన్యం దెబ్బకు మరోసారి ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని పాక్ నుంచి పలాయనం చిత్తగించిన దావూద్ ఇబ్రహీం.. దుబాయ్ వైపు వెళ్తున్నాడని.. సౌదీలో తలదాచుకునే అవకాశాలున్నాయని.. కువైట్ వెళ్లినా ఆశ్చరం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి! ఇదే సమయంలో.. థాయిలాండ్, మలేషియాలో తలదాచుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

అయితే... దావూద్ పాకిస్థాన్ నుంచి అర్ధరాత్రి హుటాహుటిన బయలుదేరి తన కాన్వాయ్ తో యెమన్ పారిపోయాడని పలువురు కచ్చితంగా చెబుతున్నారు! యెమన్ లో దావూద్ కు సౌకర్యవంతమైన, రక్షణతో కూడిన ఆశ్రయం దొరికే అవకాశం ఉండటంతో ఆ దేశాన్ని ఎంచుకున్నాడని అంటున్నారు. కాగా పశ్చిమాసియాలోని ఒక దేశం అయిన యెమెన్... అరేబియా సముద్రానికి, సౌదీ అరేబియాకు మధ్యలో ఉంటుంది.