Begin typing your search above and press return to search.

పాక్ పై సెంచరీ తర్వాత "తగ్గేదే లే" మ్యానరిజం...వార్నర్ "యాక్షన్" వైరల్!

అవును... వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓపెనర్లు డెవిడ్ వార్నర్, మార్ష్ వీర విహారం చేస్తున్నారు

By:  Tupaki Desk   |   20 Oct 2023 11:10 AM GMT
పాక్ పై సెంచరీ తర్వాత తగ్గేదే లే మ్యానరిజం...వార్నర్ యాక్షన్ వైరల్!
X

ఒడిదుడుకులతో టోర్నీ ఆరంభించిన ఆస్ట్రేలియాకు అత్యంత కీలకమైన మ్యాచ్... భారత్ చేతిలో చవిచూసిన ఓటమికి ఇది ట్రీట్ మెంట్ అని పాకిస్థాన్ ఫ్యాన్స్ భావిస్తున్న సమయం... ఈ టైం లో ఆస్ట్రేలియా – పాకిస్థాన్ లు తలబడ్డాయి. అత్యంత హాట్ టాపిక్ గా మారిన ఈ మ్యాచ్ లో తొలుత ఆస్ట్రేలియా బ్యాంటింగ్ కు దిగింది. ఈ సందర్భంగా పరుగుల ఆకలితో ఉన్న ఆస్ట్రేలియా బ్యాటర్స్ లో ఓపెనర్లు ఇద్దరూ సెంచరీలు చేశారు.

అవును... వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓపెనర్లు డెవిడ్ వార్నర్, మార్ష్ వీర విహారం చేస్తున్నారు. ఇద్దరూ సెంచరీలతొ కదం తొక్కారు. పాక్ బౌలర్లను ఊచకోత కోశారు. వీరిలో తొలుత వార్నర్ 82 బంతుల్లో సెంచరీ చేయగా... ఆ తర్వాత బంతికే మిచెల్ మార్ష్ ఫోర్ కొట్టి సెంచరీ పూర్తి చేశాడు. దీంతో... ఆ స్ట్రేలియా 32 ఓవర్లలో వికెట్ కోల్పోక్లుండా 231 పరుగులు చేసింది.

ఆస్ట్రేలియా ఓపెనర్ల దాటికి పాక్ బౌలర్లు విలవిల్లాడిపోతున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... సెంచరీ చేసిన అనంతరం డేవిడ్ వార్నర్ ... పుష్ప సినిమాలో "తగ్గేదే లే" అనే ఐకానిక్ యాక్షన్ చేసి చూపించాడు. గెడ్డ కింద చెయ్యి పెట్టి... తగ్గేదేలే అన్నట్లుగా చేశాడు. దీంతో.. ఒక్కసారి స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. ఇప్పుడు ఈ బైట్ వైరల్ గా మారుతుంది.

అయితే.. పుష్ప సినిమాలో "శ్రీవల్లీ" పాటకు స్టేడియంలో కూడా డేవిడ్ వార్నర్ డాన్స్ వేస్తూ కనిపించాడు. వార్నర్ గ్రౌండ్ లో ఉండగా ఆ పాట ప్లే అయితే... కెమెరా కళ్లు, వేళ మంది ప్రేక్షకుల కళ్లు అతనివైపే తిరిగిపోతాయి. అలా తిరిగిన కళ్లను డిజప్పాయిట్ చేయకుండా.. వార్నర్ ఒక భుజం డౌన్ చేసి... కాళ్లు కదుపుతూ... శ్రీవళ్లీ... అంటూ లిప్ ఇస్తూ స్టేప్ వేస్తాడు. దీంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా హోరెత్తిపోద్ది!

ఈ క్రమంలోనే తాజాగా పాకిస్థాన్ తో జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ లో సెంచరీ అనంతరం గెడ్డం కింద చెయ్యిపెట్టిన వార్నర్.. తగ్గేదేలే అన్నట్లుగా యాక్ట్ చేసి చూపించాడు. వార్నరా.. మజాకా!