Begin typing your search above and press return to search.

"వివేకం" సినిమాపై హైకోర్టును ఆశ్రయించిన దస్తగిరి!

ఈ సమయంలో వివేకా జీవిత చరిత్రతో తెరకెక్కినట్లు చెబుతున్న "వివేకం" సినిమా పై తాజాగా దస్తగిరి స్పందించారు. ఇందులో భాగంగా... హైకోర్టును ఆశ్రయించారు

By:  Tupaki Desk   |   1 April 2024 12:49 PM GMT
వివేకం సినిమాపై హైకోర్టును ఆశ్రయించిన దస్తగిరి!
X

వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఏపీ రాజకీయాల్లో ఒక సంచలనం అనే సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వంలో ఈయన హత్య జరిగినప్పటి నుంచి నేటి వరకూ ఈ కేసు వార్తల్లో నానుతూనే ఉంది! ఇక ఎన్నికలు సమీపిస్తుండటంతో మరింత వైరల్ గా మారింది. ఈ సమయంలో వివేకా జీవిత చరిత్రతో తెరకెక్కినట్లు చెబుతున్న "వివేకం" సినిమా పై తాజాగా దస్తగిరి స్పందించారు. ఇందులో భాగంగా... హైకోర్టును ఆశ్రయించారు.

అవును... వైఎస్ వివేకానందరెడ్డి బయోపిక్ గా తెరకిక్కినట్లు చెబుతున్న "వివేకం" సినిమా యూట్యూబ్ లో విడుదలై సంచలన సృష్టిస్తోంది! విడుదలైన తొలిరోజే లక్షల్లో వ్యూస్ సాధించిందని చెబుతున్నారు. ఆ సంగతి అలా ఉంటే... ఈ సినిమాపై వివేకా హత్యకేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి అభ్యంతరం వ్యక్తం చేశారు. తన స్టేట్ మెంట్ ఆధారంగా తీసిన సినిమాలో తన పేరు ఉండటంపై హైకోర్టును ఆశ్రయించారు.

సుమారు ఐదేళ్ల క్రితం జరిగిన మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య నేపథ్యంలో తెరకెక్కిన తాజా చిత్రం "వివేకం" రాజకీయవర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోన్న వేళ.. ఈ హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న దస్తగిరి, ఈ కేసులో అప్రూవర్ గా మారి ఇప్పుడు ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నట్లు చెబుతున్న దస్తగిరి ఈ సినిమా ప్రదర్శనతో పాటు, సోషల్ మీడియాలో సర్క్యులేషన్ ని నిలిపివేయాలని కోరుతూ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు.

ఇందులో భాగంగా... కేసు సీబీఐ కోర్టులో ఉన్నందున, సబ్ జుడీస్ లో ఉన్నందున సినిమా ప్రదర్శనను ఆపాలని అన్నారు. ఇదే సమయంలో... ఈ కేసులో చంద్రబాబు, లోకేష్ లను ప్రతివాదులుగా చేర్చారు. టీడీపీకి చెందిన సోషల్ మీడియా వింగ్ ఐటీడీపీ ద్వారా ఈ సినిమాని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారని.. సీబీఐ విచారణ ఇంకా కొనసాగుతున్నందున ఇది తన ప్రతిష్టను దెబ్బతీస్తుందని దస్తగిరి చెబుతున్నారు!

ఇదే సమయంలో... రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల అభ్యర్థిగా పోటీ చేస్తున్నందున ఈ సినిమా ప్రదర్శన ఎన్నికల్లో ఆయన అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన తరుపు న్యాయవాది జాడా శ్రావణ్ కుమార్ తెలిపారు. ఇది దస్తగిరి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన తప్ప మరొకటి కాదని అన్నారు. ఇదే సమయంలో ఈ సినిమాని నిలిపివేయాలని ఆదేశించాలని ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించారు.