Begin typing your search above and press return to search.

అన్న గారింటి ఆడపడుచు కోసం క్రాస్ ఓటింగ్ !?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి లోక్ సభకు పోటీ చేస్తున్నారు. ఆమె ఈసారి రాజమండ్రీ నుంచి బరిలో ఉన్నారు

By:  Tupaki Desk   |   15 May 2024 12:48 PM GMT
అన్న గారింటి ఆడపడుచు కోసం క్రాస్ ఓటింగ్ !?
X

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి లోక్ సభకు పోటీ చేస్తున్నారు. ఆమె ఈసారి రాజమండ్రీ నుంచి బరిలో ఉన్నారు. టీడీపీ బీజేపీ జనసేన కూటమి తరఫున ఆమె నిలబడ్డారు. రాజమండ్రి చూస్తే గడచిన నాలుగు ఎన్నికల్లో రెండు సార్లు కాంగ్రెస్, ఒకసారి టీడీపీ ఒకసారి వైసీపీని గెలిపించింది.

ఈసారి వైసీపీ బీసీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ గూడూరు శ్రీనివాస్ కి టికెట్ ఇచ్చింది. ఆయన శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వారు. బీసీలు శెట్టిబలిజలు ఇక్కడ ఎక్కువ. ఇది సామాజిక సమీకరణల దృష్ట్యా కరెక్ట్. కానీ రాజకీయంగా చూస్తే టీడీపీ కూటమికి బలమున్న సీటు ఇది. కాపులు ప్లస్ కమ్మలు కలవడమే కాదు బీసీ ఓటు బ్యాంక్ ని కూడా కూటమి తిప్పుకుంది అని అంటున్నారు.

దాంతో పాటు గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారు అన్న స్లోగన్ తో పురంధేశ్వరి ప్రచారం సాగింది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇక్కడ సభకు వచ్చి ప్రచారం చేసి వెళ్లారు. దాంతో బీజేపీ టీడీపీ కూటమి బలం ఇంకా పెరిగింది. మరో వైపు చూస్తే అంగబలం అర్ధబలం రెండూ దండీగా టీడీపీ కూటమికి ఉన్నాయి.

పోలింగ్ వేళ సరళి చూస్తే కొంత ఎడ్జ్ కూటమికే ఉందని వార్తలు అయితే ప్రచారంలో ఉన్నాయి. పురంధేశ్వరి గెలుపు కోసం క్రాస్ ఓటింగ్ కూడా జరిగింది అని అంటున్నారు. వైసీపీ నుంచి కూడా జరిగింది అని ప్రచారం సాగుతోంది. అంటే వైసీపీలో ఉన్న కొంత అసంతృప్తితో పాటు టీడీపీ కూటమి నుంచి వచ్చిన ఆకర్షణల వల్ల రెండు ఓట్లు అన్న విధానం అమలు చేశారు అని చెబుతున్నారు. దాంతో ఎంపీకి ఒక ఓటు ఎమ్మెల్యేలు మరో ఓటు అన్నది బలంగా సాగినట్లుగా ప్రచారం చేస్తున్నారు.

ఈ పరిణామాల నేపధ్యం నుంచి చూసినపుడు పురంధేశ్వరి కి ఎటూ టీడీపీ కూటమి నుంచి దక్కాల్సిన ఓట్లు దక్కుతాయని దానికి అదనంగా క్రాస్ ఓటింగ్ ప్రత్యర్థి పార్టీ నుంచి జరిగింది అని అంటున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో ఆమె గెలుపు సాధ్యమే అని ఒక రకంగా చెబుతున్న నేపధ్యం ఉంది.

అన్న గారి ఇంటి ఆడపడుచు అన్న సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయింది అని అంటున్నారు. పురంధేశ్వరిని గెలిపించుకుంటే ఆమె కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వంలో కచ్చితంగా మంత్రిగా ఉంటారు కాబట్టి అభివృద్ధి చేసుకోవచ్చు అన్న ఆలోచనలతో కూడా ఆ వైపు గా ఓటు మళ్ళిందని తటస్థులు ఇతర వర్గాల నుంచి కూడా సానుకూలత కనిపించిందని అంటున్నారు.

మొత్తం మీద చూస్తే ఫలితాలు వచ్చిన తరువాత ఏమి తేలుతుందో తెలియదు కానీ ఇప్పటికే ఒక పర్యాయం కేంద్ర మంత్రిగా రెండుసార్లు ఎంపీగా పనిచేసిన పురంధేశ్వరి బిగ్ షాట్ గానే రాజమండ్రి బరిలో నిలిచారు. పైపెచ్చు ఎన్టీయార్ కుమార్తె కావడం కూటమి బలంగా ఉండడం అన్ని రకాలైన సామాజిక రాజకీయ సమీకరణలు తోడు కావడంతో విజయం సాధిస్తారు అని లెక్క అయితే వేసుకుంటున్నారుట.