Begin typing your search above and press return to search.

పురంధేశ్వరికి బీజేపీ సీనియర్ షాక్ ఇస్తారా...?

విశాఖ ఎంపీగా లోక్ సభ నుంచి పోటీ పడాలనుకున్న సీనియర్ నేత రాజ్యసభ మాజీ ఎంపీ జీవీఎల్ నర సింహారావుకు టికెట్ దక్కలేదు

By:  Tupaki Desk   |   16 April 2024 10:31 AM GMT
పురంధేశ్వరికి  బీజేపీ సీనియర్ షాక్ ఇస్తారా...?
X

ఏపీ బీజెపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి సీనియర్లను పక్కన పెట్టి వారికి టికెట్లు దక్కకుండా చేసింది అన్న బాధతో బీజేపీలో ఒక వర్గం ఉందంటున్నారు. విశాఖ ఎంపీగా లోక్ సభ నుంచి పోటీ పడాలనుకున్న సీనియర్ నేత రాజ్యసభ మాజీ ఎంపీ జీవీఎల్ నర సింహారావుకు టికెట్ దక్కలేదు. ఎక్కడో కడపలో ఉన్న సీఎం రమేష్ ని తెచ్చి అనకాపల్లి ఎంపీ సీటు ఇచ్చారు.

దాంతో జీవీఎల్ వర్గం మండిపోతోంది అంటున్నారు. ఇక జీవీఎల్ కి టికెట్ రాకుండా చేశారు అంటూ విశాఖ లోక్ సభ పరిధిలో పోస్టర్లు ఫ్లెక్సీలు కూడా వెలిసాయి. అవన్నీ జీవీఎల్ అనుకూల వర్గాలు ప్రచారం చేస్తున్నాయని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే మరో ఇరవై నాలుగు గంటలలో నామినేషన్ల పర్వానికి తెర లేస్తూండగా జీవీఎల్ ఇంకా విశాఖ సీటు మీద ఆశలు వదులుకోలేదు అని అంటున్నారు.

ఆయన తన వంతుగా ప్రయత్నాలు చేస్తుకుంటూ వస్తున్నారు అని అంటున్నారు. ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు అని అంటున్నారు. ఈ విధంగా తనకు సీటు వచ్చేందుకు వీలున్న మార్గాలని ఆయన అన్వేషిస్తున్నారు అని అంటున్నారు. ఈ మేరకు ఆయన బీజేపీకి చెందిన ఉత్తరాది నేతలతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.

అదే విధంగా ఏపీలో సీనియర్లకు జరుగుతున్న అన్యాయం గురించి ఆయన వివరించే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. బీజేపీకి బలమున్న విశాఖ ఎంపీ సీటు ఇవ్వకపోవడం ఏంటి అని ఆయన బీజేపీ పెద్దల దృష్టికి తెస్తున్నట్లుగా చెబుతున్నారు. జీవీఎల్ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఆయన ఉత్తరాది నేతలతో చర్చించడం ద్వారా బీజేపీకి విశాఖ సీటు దక్కేలా ఒత్తిడి తీవ్ర స్థాయిలోనే చేస్తున్నారు అంటున్నారు. ఏపీలో చూస్తే కొన్ని బీజేపీ సీట్లలో మార్పుల మీద ఇటీవల బీజేపీ నేతలు కూటమి నేతలతో మంతనాలు జరిపారు. ఈ ప్రతిపాదనలను వారు కేంద్ర పార్టీ ముందుకు తీసుకువస్తున్నారు. పనిలో పనిగా విశాఖ సీటు మార్పు విషయం కూడా అక్కడే ప్రస్తావించి తనకు అనుకూలం చేసుకోవడానికి జీవీఎల్ చూస్తున్నారు అని అంటున్నారు.

అదే విధంగా చూస్తే ఇటీవల కొందరు బీజేపీ నేతలు జీవీఎల్ కి మద్దతుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వద్దకు వెళ్ళి మరీ రాయబారం చేసిన సంగతిని గుర్తు చేస్తున్నారు. అలాగే స్థానికంగా ఉన్న జన జాగరణ సమితి జీవీఎల్ కి టికెట్ ఇవ్వాలంటూ నిరసన కార్యక్రమాలు విశాఖ అంతటా నిర్వహిస్తోంది.

ఇక జీవీఎల్ విషయం చూస్తే ఆయన విశాఖ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు. ఆయన టీడీపీ కూటమి ప్రచారానికి రావడం లేదు అని అంటున్నారు. టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా ఉన్న భరత్ కి మద్దతుగా జీవీఎల్ ప్రచారం చేయడం లేదు అని అంటున్నారు. అంతే కాదు ఆయన అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నారు అని తెలుస్తోంది. ఎక్కువ సమయం ఆయన ఢిల్లీలోనే ఉంటున్నారని అంటున్నారు.

మరో వైపు చూస్తే తనకు ఎంపీ టికెట్ రాకుండా చేశారు అన్న ఆగ్రహంతో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు. అలాగే బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పట్ల కూడా గుర్రుగా ఉంటున్నారని ప్రచారం అయితే సాగుతోంది. ఇవన్నీ పక్కన పెడితే నర్సాపురం ఎంపీ సీటు బీజేపీ నుంచి తీసుకుని టీడీపీలో చేరిన రఘురామ కృష్ణంరాజుకు ఇవ్వాలని చంద్రబాబు చూస్తున్నారు అని ప్రచారం సాగుతోంది

అదే జరిగితే విశాఖ ఎంపీ సీటు కూడా బీజేపీకి దక్కేలా జీవీఎల్ చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయని అంటున్నారు. జీవీఎల్ పట్టు వదలని విక్రమార్కుడిగా చేస్తున్న ఈ ప్రయత్నాలలో ఆయనకు టికెట్ దక్కితే మాత్రం అనకాపల్లిలో బీజేపీ ఎంపీ అభ్యర్ధిని మారుస్తారు అని అంటున్నారు. మొత్తానికి జీవీఎల్ చాలా సైలెంట్ గా ఉంటూ తనదైన శైలిలో షాకులు ఇచ్చేలా ఉన్నారని మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. చూడాలి మరి దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో.