Begin typing your search above and press return to search.

ఎలక్షన్ ఎఫెక్ట్ కాదు... హెలికాప్టర్‌ నుంచి కరెన్సీ నోట్ల వర్షం!

అవును... చెక్‌ రిపబ్లిక్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌, టీవీ హోస్ట్‌ కమిల్ బార్టోషేక్ తన ఫాలోవర్స్ కోసం కీలక నిర్ణయం తీసుకున్నాడు

By:  Tupaki Desk   |   27 Oct 2023 4:30 AM GMT
ఎలక్షన్ ఎఫెక్ట్ కాదు... హెలికాప్టర్‌ నుంచి కరెన్సీ నోట్ల వర్షం!
X

ఎవరి వెర్రి వారికి ఆనందం అని అనుకోవాలో.. లేక, ఇది కూడా సోషల్ మీడియా ప్రచారంలో భాగం అని భావించాలో.. అదీగాక ఇదొక అరుదైన సంఘటన అని సరిపెట్టుకోవాలో తెలియదు కానీ... తాజాగా ఒక ఇన్ ఫ్లూయెన్సర్ తన ఫ్యాన్స్ కు ఒక టెస్ట్ పెట్టాడు.. దాని ప్రకారం అతడు చెప్పిన ప్లేస్ కి వస్తే అక్కడ నోట్ల వర్షం కురుస్తుందని తెలిపాడు. అనుకున్నట్లుగానే వర్షం కురిపించాడు!

అవును... చెక్‌ రిపబ్లిక్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌, టీవీ హోస్ట్‌ కమిల్ బార్టోషేక్ తన ఫాలోవర్స్ కోసం కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇందులో భాగంగా ఏకంగా 10 లక్షల డాలర్లను వారి కోసం హెలికాప్టర్‌ నుంచి జార విడిచే కార్యక్రమానికి తెరలేపాడు. "ప్రపంచంలోనే ఫస్ట్ టైం డాలర్స్ రైన్" అంటూ ముందుగానే ప్రకటించి మరీ తన ఫ్యాన్స్‌ ను అబ్బుర పరిచాడు.

వివరాళ్లోకి వెళ్తే... కజ్మా అనే మారుపేరుతో చెక్‌ రిపబ్లిక్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌, టీవీ హోస్ట్‌ బార్టోస్జెక్ సోషల్‌ మీడియాలో బాగా పాపులర్‌! ఈ సందర్భంగా తాను నటించిన సినిమా "వన్‌ మాన్‌ షో: ది మూవీ"లో పొందుపరిచిన ఒక కోడ్‌ ను ఛేదించాలని ఒక పోటీని ప్రకటించాడు. అయితే, దీన్ని ఎవరూ పరిష్కరించలేకపోయారు. అయినప్పటికీ ఎవరూ నిరాశ చెందొద్దని సూచించిన బర్టోస్జెక్.. ఫ్యాన్స్ కు మరొ ఆప్షన్ ఇచ్చాడు.

అందులో భాగంగా... ఈ ప్రోగ్రాం కింద సైన్‌ చేసిన వారిందరికీ ఈ ప్రైజ్‌ మనినీ గిఫ్ట్‌ గా ఇవ్వాలని నిర్ణయించాడు. ఇలా మరో ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రకటించాడు. దీని ప్రకారం ఆదివారం ఉదయం ఆరు గంటలకు డబ్బును పలానా చోట డబ్బులు పడేస్తాడనే ఎన్‌ క్రిప్టెడ్ సమాచారంతో వారికి ఈ-మెయిల్‌ పంపించాడు. దీంతో ఈ విషయాన్ని చాలా మంది సీరియస్ గా తీసుకున్నారు.

అన్నట్టుగా సేం ప్లేస్‌ కి వెళ్లి నిర్ణీత సమయంలో తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇందులో భాగంగా హెలికాప్టర్‌ నుంచి డాలర్ల వర్షం కురిపించాడు. అయితే అప్పటికే ఇతడు పంపిన ఈ-మెయిల్ లోని ఎన్ క్రిప్టెడ్ సమాచారన్ని డీకోడ్ చేసిన నెటిజన్లు సరిగ్గా ఆ సమయానికి ఎగ్జాట్ లొకేషన్ లో కాచుకుని ఉన్నారు.

చెప్పినట్లుగానే కురిసిన డబ్బుల వర్షంలో అతడి ఫాలోవర్స్ తడిచి ముద్దయ్యారు. ఈ సందర్భంగా ఈ డబ్బులను దక్కించుకునేందుకు సంచులతో ఎగబడ్డారు. లైసానాడ్ లాబెం పట్టణానికి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అనంతరం ఈ వీడియోను కజ్మా తన అధికారిక ఇన్‌ స్టాగ్రాం ఖాతాలో షేర్ చేశాడు. "ప్రపంచంలో తొలిసారి నిజమైన డబ్బు వర్షం" అని తెలిపాడు.

అనంతరం... ఈ సంఘటనవల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని.. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తన పోస్ట్‌ లో వెల్లడించాడు. ప్రస్తుతం ఈ వీడియో అక్కడ హాట్ టాపిక్ కాగా.. నెట్టింట వైరల్ అవుతుంది! మీరూ ఓ లుక్కేయండి...!