Begin typing your search above and press return to search.

ఈ రాత్రి సాఫీగా గడిస్తే చాలు !

తీరం దాటడం అన్నది పెద్ద ప్రస్థానం గానే చూడాలి ఒక భారీ తుఫాన్ సముద్రం నుంచి ఒడ్డుకు వచ్చినపుడు దాని ప్రభావం మరింతగా పెరుగుతుంది. ఇప్పటిదాకా వీచిన గాలులు కానీ వాన కానీ ఇంకా పెరుగుతాయి.

By:  Satya P   |   28 Oct 2025 5:24 PM IST
ఈ రాత్రి సాఫీగా గడిస్తే చాలు !
X

ప్రకృతితో ఎవరూ పోటీ పడలేరు. ప్రకృతి చెలగాట ఆడితే తట్టుకోవడం ఎవరి తరమూ కాదు, అయితే వీలైనంతవరకూ ఉన్న అత్యాధునిక సదుపాయాలతో ప్రాణ రక్షణ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సమర్ధంగా వ్యవస్థలను ఉపయోగించుకోవడం ద్వారా ప్రకృతి పెట్టే పరీక్షలను చాలా వరకూ తట్టుకుని నిలబడగలం. ఇది గతంలో రుజువు అయింది. ఇపుడు కూడా అదే పని మీద ఏపీ ప్రభుత్వం ఉది. మొత్తానికి మొత్తం ప్రభుత్వం మొంధా తుఫాన్ విషయంలో తీసుకోవాల్సిన చర్యలు తీసుకుని పూర్తి అప్రమత్తతతో ఉంది.

పెరిగిన తీవ్రత :

ఇక చూస్తే మొంథా తుఫాను ఏపీ వైపు అందునా కోస్తా జిల్లాల వైపు పెద్ద ఎత్తున దూసుకుని వస్తోంది. చాలా వేగంగా తన గమనాన్ని సాగిస్తోంది గంటకు పదిహేను నుంచి పదిహేడు కిలోమీటర్లకు పెంచింది. మంగళవారం ఉదయం నుంచే మొంథా తుఫాన్ తీవ్రత పెరిగింది. అది స్పష్టంగా కనిపిస్తోంది. ఆగకుండా అదే పనిగా కోస్తా జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అవి అతి భారీ వర్షాలుగా కూడా పరిణామం చెందుతున్నాయి.

తీరం దాటడం :

ఇక మొంథా తుఫాన్ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తన భీకర గర్జన చేసుకుంటూ దూకుడు చేస్తోంది. ఇది కాస్తా వేగంగా కదులుతూ తీవ్ర తుపాన్ గా మారిపోయింది. ఇక ఒక కాలు మచిలీపట్నం మీద పెట్టింది. మరో కాలు విశాఖ పట్నం మీద పెట్టింది. ఈ మధ్యలో ఉన్న కాకినాడలో తీరం దాటేందుకు మొంథా తుఫాన్ చూస్తోంది. ఇప్పటిదాకా చూస్తే కనుక దిశ మార్చుకోకుండా అనుకున్న తీరుగానే గమ్యం వైపుగా వస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే ఏపీలో కాకినాడ వద్ద ఈ రాత్రికి మొంథా తుఫాన్ తీరం తాకుతుంది అని అంటున్నారు. దాంతో మంగళవారం రాత్రి మీదనే అందరి దృష్టి ఉంది.

అదే పెద్ద టెన్షన్ గా :

తీరం దాటడం అన్నది పెద్ద ప్రస్థానం గానే చూడాలి ఒక భారీ తుఫాన్ సముద్రం నుంచి ఒడ్డుకు వచ్చినపుడు దాని ప్రభావం మరింతగా పెరుగుతుంది. ఇప్పటిదాకా వీచిన గాలులు కానీ వాన కానీ ఇంకా పెరుగుతాయి. తీరం దాటే సమయం మీదనే అంతా ఫోకస్ పెడతారు ఇపుడు చూస్తే మచిలీపట్నంకు 70 కిలో మీటర్లు దూరంలో తీవ్ర తుపాను కేంద్రీకృతం అయి ఉంది. ఇది కాకినాడకు 150 కిలోమీటర్లకు విశాఖకు 250 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఇక మోంతా తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు చాలా బలంగా వీస్తాయని చెబుతున్నారు. దాంతో ప్రభుత్వ యంత్రాంగం అంతా పూర్తిగా అప్రమత్తంగా ఉంది.

మరో రెండు రోజుల పాటు :

మరో వైపు చూస్తే మొంథా తుపాన్ ప్రభావం మరో రెండు రోజుల పాటు ఉంటుంది అని అంటున్నారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. మరి కొన్ని చోట్ల చూస్తే కనుక అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. అందువల్ల జనాలు అంతా కూడా తమ ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలు చేస్తోంది. అంతే కాదు ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా క్రిష్ణా గోదావరి జిల్లాల మధ్యలో ఉండే అవకాశాలు ఉన్నాయి. అలా చూస్తే కనుక తుపాన్ ప్రభావిత జిల్లాల్లోని రోడ్లపై ఆంక్షలు కూడా విధించారు. ఇక జాతీయ రహదారుల మీద మొత్తం భారీ వాహనాలతో పాటు అన్ని రకాల ప్రయాణాల మీద కూడా ఆంక్షలు విధించారు.వాటిని ఎక్కడికక్కడ నిలుపు చేయాల్సిందే అని సూచిస్తున్నారు.