Begin typing your search above and press return to search.

పో*ర్న్ వీడియోలు చూస్తున్నారా?... ఈ అలర్ట్ మీకోసమే!

అక్కడ నుంచి రాష్ట్రాల్లోని క్రైమ్ బ్యూరోలకు సమాచారం పంపిణీ చేయబడుతోంది. దీంతో వారిని గుర్తించి పోక్సో చట్టం కింద అరెస్ట్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   8 Jun 2025 10:28 AM IST
పో*ర్న్  వీడియోలు చూస్తున్నారా?... ఈ అలర్ట్  మీకోసమే!
X

ల్యాప్ ట్యాప్ ఉంది, చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది ఓ మూలన కూర్చుని అశ్లీల వీడియోలు చూసినా ఎవరూ గమనించరు అనుకుంటే పొరపాటే. సైబర్ టిప్ సమాచారంతో ఐపీ అడ్రస్ ల ఆధారంగా అలాంటి వారిని గుర్తించిన పోలీసులు ఎఫ్.ఐ.ఆర్. లు నమోదు చేస్తున్నారు. ఈ సందర్భంగా అశ్లీల కంటెంట్ చూడటం, పంచుకోవడం నేరమని పోలీసులు ఎక్స్ ద్వారా హెచ్చరించారు.

అవును... హైదరాబాద్ పోలీసులు చిన్నారుల అశ్లీల వీడియోలను వీక్షించేవారిపై నిఘా పెట్టారు. ఇలాంటి వీడియోలు చూసేవారిని, షేర్ చేసేవారిని హోంల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్, నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ ప్లోయిటెడ్ చిల్డ్రన్ (ఎన్.సీ.ఎం.ఈ.సీ) పోర్న్ చూసేవారి ఐపీ అడ్రస్ లు సేకరించి భారత కేంద్ర హోంశాఖకు అందజేస్తున్నాయి.

అక్కడ నుంచి రాష్ట్రాల్లోని క్రైమ్ బ్యూరోలకు సమాచారం పంపిణీ చేయబడుతోంది. దీంతో వారిని గుర్తించి పోక్సో చట్టం కింద అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో గత ఏడాది ఆగస్టు నుంచి హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 520 పోక్సో కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకొవచ్చని అంటున్నారు. దీనిపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సమయంలో రంగంలోకి దిగిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీ.జీ.సీ.ఎస్.బీ) రంగంలోకి దిగింది. ఈ సమయంలో అమెరికాలో సైబర్ టిప్ లైన్ అందించిన సమాచారంతో ఐపీ అడ్రస్, ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ అడ్రస్, సోషల్ మీడియా అకౌంట్స్ ఆధారంగా రాష్ట్రంలోని 10 మందిపై ఎఫ్.ఐ.ఆర్. లు నమోదు చేసినట్లు తెలుస్తోంది!

కాగా ఈ సమయంలో హైదరాబాద్ పోలీసులు తమ ఎక్స్ ఖాతా ద్వారా ప్రజలకు ముఖ్యమైన సందేశాన్నిచ్చారు. ఇందులో భాగంగా.. అశ్లీల చిత్రాలను చూడటం, షేర్ చేయడం నేరం. చైల్డ్ పోర్నోగ్రఫీని చూసేవారిపై నిఘా ఉంటుంది.. ఇలాంటి చెడు వ్యసనాలకు బానిస కావొద్దు.. చిక్కుల్లో పడోద్దు" అని తెలిపింది.