Begin typing your search above and press return to search.

94906 17346.. ప్రతి ఒక్కరు సేవ్ చేసుకోవాల్సిన నెంబర్ ఇది

అవును.. 94906 17346 నెంబరు ప్రతి ఒక్కరు తమ మొబైల్ ఫోన్ లో సేవ్ చేసుకోవాల్సిందే

By:  Tupaki Desk   |   28 Dec 2023 12:30 PM GMT
94906 17346.. ప్రతి ఒక్కరు సేవ్ చేసుకోవాల్సిన నెంబర్ ఇది
X

అవును.. 94906 17346 నెంబరు ప్రతి ఒక్కరు తమ మొబైల్ ఫోన్ లో సేవ్ చేసుకోవాల్సిందే. మరి.. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ఉండే వారైతే.. ఈ నెంబరుతో పని తరచూ పడే అవకాశం ఉంది. ట్యాక్సీ.. క్యాబ్.. ఆటో డ్రైవర్లు ఎవరైనా సరే.. యాప్ ద్వారా రైడ్ బుక్ చేసిన తర్వాత.. రైడ్ క్యాన్సిల్చేసినా.. అదనపు ఛార్జీలువసూలు చేసినా.. రైడ్ కు నో చెప్పినా నేరమే అన్న విషయాన్ని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

పలు సందర్భాల్లో రైడ్ ను నిరాకరిస్తూ డ్రైవర్లు క్యాన్సిల్ చేయటం తెలిసిందే. అయితే.. అలా చేయటం సేవా లోపం కిందనే వస్తుందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అందుకే.. యాప్ లో ఆటో.. క్యాబ్.. ట్యాక్సీని బుక్ చేసిన తర్వాత రైడ్ కు నో చెబితే.. తమకు కంప్లైంట్ చేయొచ్చని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇందుకోసం 94906 17346 నెంబరుకు వాట్సాప్ లో కంప్లైంట్ చేస్తే చర్యలు పక్కా అని స్పష్టం చేస్తున్నారు. రైడ్ రద్దు చేసినట్లు గుర్తిస్తే వాహనం నెంబరు.. సమయం.. ప్రదేశం తదితర వివరాలతో 94906 17346కు కంప్లైంట్ చేస్తే.. మోటారు వాహనాల చట్టం ఉల్లంఘన కింద రూ.500 ఫైన్ వేస్తామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

డిసెంబరు 31 రాత్రి వాహనాల్నినడిపే వరకు మరిన్ని జిగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఆ రోజు రాత్ర వేళ ఔటర్ రింగ్ రోడ్డు మీదకు అనుమతి ఇవ్వరు. మరి.. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లే వారి పరిస్థితి ఏమిటి? అంటే మాత్రం.. వారి టికెట్ ను చూపిస్తే మాత్రం.. వారికి అనుమతిని ఇస్తారు. అంతేకాదు.. డిసెంబరు 31రాత్రి 11గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు శిల్పాలేవుట్.. గచ్చిబౌలి.. బయోడైవర్సిటీ.. షేక్ పేట.. మైండ్ స్పేస్.. రోడ్ నం.45.. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి.. సైబరర్ టవర్స్.. ఫోరంమాల్.. జేఎన్ టీయూ.. ఖైత్లాపూర్.. బాలానగర్ వంతెనల్ని మూసి వేయనున్నారు. సో.. ఈ విషయాన్ని గుర్తించి డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉంది.

డిసెంబరు 31 రాత్రి 8 గంటల నుంచి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్ని నిర్వహిస్తారు. పట్టుబడితే మొదటిసారికి రూ.10వేలు ఫైన్.. ఆర్నెల్లు జైలు. ఎక్కువసార్లు పట్టుబడితే మాత్రం రూ.15వేలు లేదంటేరెండేళ్లు జైలు.. డ్రైవింగ్ లైసెన్సును రద్దు చేయటానికి రికమెండ్ చేస్తారు. ధ్రువపత్రాలు లేకుండా ప్రయాణిస్తే వాహనాల్ని స్వాధీనం చేసుకుంటారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా.. మైనర్లు వాహనాల్ని నడిపినా యజమానులతో పాటు వాహనాన్ని నడిపిన వారి మీదా కలిపి చర్యలు ఉంటాయని స్పష్టంచేస్తున్నారు. సో.. జర జాగ్రత్తగా ఉండటం మంచిది.