Begin typing your search above and press return to search.

రొమాన్స్ స్కాం.. 4.5 లక్షల డాలర్లు కోల్పోయిన భారతీయ మహిళ!

అవును.. ఫిలడెల్ఫియాకు చెందిన టెక్ ప్రొఫెషనల్ తాజాగా ఒక క్రిప్టో కరెన్సీలో 4,50,000 డాలర్లు కోల్పోవడం జరిగింది!

By:  Tupaki Desk   |   26 Feb 2024 5:37 PM GMT
రొమాన్స్  స్కాం.. 4.5 లక్షల డాలర్లు కోల్పోయిన భారతీయ మహిళ!
X

“మోసాలు పలు రకాలు.. అప్రమత్తంగా ఉండకపోతే కట్టుబట్టలు కూడా మిగలనివ్వరు జనాలు”.. ప్రస్తుతం ఈ టైపు లైన్స్ ప్రపంచ వ్యాప్తంగా రెగ్యులర్ గా వినిపిస్తున్నాయి. టెక్ ప్రపంచం పెరిగిపోయిన తర్వాత ఆన్ లైన్ మోసాలు తమ పరిధిని విస్తరించుకుంటున్నాయనే చెప్పాలి. ఈ క్రమంలో తాజాగా క్రిప్టోకరెన్సీ రొమాన్స్ స్కాం ఒకటి తెరపైకి వచ్చింది. ఇందులో ఒక భారతీయ మహిళ సుమారు నాలుగున్నర లక్షల డాలర్లు పోగొట్టుకుంది!

అవును.. ఫిలడెల్ఫియాకు చెందిన టెక్ ప్రొఫెషనల్ తాజాగా ఒక క్రిప్టో కరెన్సీలో 4,50,000 డాలర్లు కోల్పోవడం జరిగింది! దీనీ సాధారణంగా... "పిగ్ బచ్చరింగ్" అని పిలుస్తారు. ఈ సమస్యపై గూగుల్ చేస్తే... ఎన్నో విషాద గాథలు తెరపైకి వస్తుంటాయి! ఈ సమయంలో తాజాగా ఈ మోసం భారిన పడిన ఒక భారతీయ మహిళ కథేమిటనేది ఇప్పుడు చూద్దాం...!

శ్రేయా దయ్య (37) అనే మహిళ డేటింగ్ యాప్ "హింజ్‌" లో ఒక వ్యక్తితో పరిచయం ఏర్పరచుకుంది! ఇందులో భాగంగా జనవరి 2023న అన్సెల్ ని కలుసుకుంది. ఈ సమయంలో తనను తాను ఫిలడెల్ఫియాలో ఉన్న ఫ్రెంచ్ వైన్ వ్యాపారిగా శ్రేయాకు పరిచయం చేసుకున్నాడు. ఈ క్రమంలో అతితక్కువ సమయంలోనే ఈ యాప్ సంభాషణ కాస్తా వాట్సాప్‌ చాట్ వరకూ వెళ్లింది.

అక్కడ నుంచి సెల్ఫీలు ఇచ్చిపుచ్చుకోవడం.. అదికాస్త మరింత ముదిరి వీడియో కాల్ స్ చేసుకోవడం వరకూ వెళ్లింది వ్యవహారం. ఈ సమయంలో ఒకరోజు ఫేస్ టు ఫేస్ కలుసుకుందామని శ్రేయా ప్రపోజ్ చేయగా... ఆ ప్లాన్ ను అన్సెల్ వాయిదా వేశాడు. అయినప్పటికీ ఆమెకు ఎటువంటి అనుమానం కలగలేదు. ఇలా మాట్లాడుకుంటున్న వారి మాటల మధ్యలో... ఆమె రిటైర్మెంట్ ప్లాన్స్ గురించి అడిగాడు అన్సెల్.

ఈ సమయంలో తాను త్వరగానే రిటైర్ అవుతున్నట్లు తెలపగా.. అతను ఒక సరికొత్త సలహాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా క్రిప్టో ట్రేడింగ్ యాప్‌ ను డౌన్‌ లోడ్ చేసుకోమని.. దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెబుతూ ఒక లింక్‌ ను పంపాడు. పైగా అది చట్టబద్ధమైనదిగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నాడు.

దీంతో యూఎస్ ఆధారిత ఎక్స్ఛేంజ్ కాయిన్‌ బేస్‌ లో తన పొదుపులో ఉన్న కొంతభాగాన్ని క్రిప్టోకరెన్సీగా మార్చింది శ్రేయ. ఈ సమయలో అన్సెల్ పంపిన ఫేక్ యాప్ ఆమె ప్రాఫిట్ రిటన్స్ ని విత్ డ్రా చేయడానికి అనుమతి ఇచ్చింది. దీంతో పూర్తినమ్మకం కలిగిందో ఏమో కానీ... ఆమె మరింతగా పెట్టుబడి పెట్టడం ప్రారంభించింది.

ఈ క్రమంలో శ్రేయా.. మార్చి నాటికి సుమారు 4,50,000 డాలర్లు పెట్టుబడిగా పెట్టింది. ఈ సమయంలో ప్రస్తుతం ఉన్న అమౌంట్ ని చెక్ చేసుకుంటే ఆ మొత్తం రెట్టింపు అయినట్లు చూపిస్తుంది కానీ... విత్ డ్రా మాత్రం అవ్వడం లేదు. పైగా ఆ ప్రయత్నం చేస్తే.. అది మరింత టాక్స్ ను డిమాండ్ చేస్తుంది. అప్పుడు కానీ శ్రేయాకు అనుమానం రాలేదు.

దీంతో వెంటనే లండన్ లో ఉన తన సోదరుడిని సహాయం కోరింది. ఈ సమయంలో అన్సెల్ అనే వ్యక్తి వివరాలు పంపమని అడగగా... ఆ ఫోటోలు, వీడియో జర్మన్ ఫిట్ నెస్ ఇన్ ఫ్లుయెన్సర్ కి చెందినవని అతడు కనుగొన్నాడు. దీంతో... అదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాయ అని అప్పటికి గ్రహించిన శ్రేయ... డబ్బు మొత్తం పోవడంతో లబోదిబోమంటుందని తెలుస్తుంది.

దీంతో ఈ విషయాలపై స్పందించిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బి.ఐ.) ఈ క్రిప్టోకరెన్సీ స్కాంలో ఇప్పటివరకూ సుమారు 40,000 మందికి పైగా ప్రజానికం సుమారు 3.5 బిలియన్ డాలర్ల సొమ్మును కోల్పోయారని తెలిపింది. ఇప్పుడు ఈ విషయం వైరల్ అవుతుండగా... క్రిప్టో కరెన్సీ మోసాలపట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను నొక్కి చెబుతుంది.