Begin typing your search above and press return to search.

స్టార్ హీరోపై చెప్పులు విసిరిన జనం... పోలీసులు లాఠీఛార్జ్!

వివరాళ్లోకి వెళ్తే... బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన చిత్రం "బడేమియా ఛోటేమియా".

By:  Tupaki Desk   |   27 Feb 2024 1:17 PM GMT
స్టార్ హీరోపై చెప్పులు విసిరిన జనం... పోలీసులు లాఠీఛార్జ్!
X

తమ అభిమాన హీరోలు జనాల్లోకి వస్తే వారి వారి ఫ్యాన్స్ ఈలలు, కేకలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించేస్తుంటారు. ప్రధానంగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలాంటి సన్నివేశాలు కనిపిస్తుంటాయి. అయితే తాజాగా బాలీవుడ్ కి చెందిన ఒక స్టార్ హీరో, మరో హీరోతో కలిసి తన సినిమాని ప్రమోట్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా జనాల్లోకి రావడంతో ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.

వివరాళ్లోకి వెళ్తే... బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన చిత్రం "బడేమియా ఛోటేమియా". ఈ సినిమాలో వీరితో పాటు జాన్వీ కపూర్, మానుషి చిల్లర్, ఫృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక సినిమాని వాసు భగ్నానీ నిర్మించగా.. అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కించారు. అన్ని హంగులూ ముస్తాబు చేసుకుని సమ్మర్ స్పెషల్ గా ఈ సినిమా ఏప్రిల్ 10 న విడుదల కానుంది.

ఈ సమయంలో ప్రమోషన్స్ పై దృష్టి పెట్టింది ఈ మూవీ టీం. ఇందులో భాగంగా అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ లు వివిద సిటీల్లో పర్యటిస్తూ.. అభిమానులను ఎంటర్ టైన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా లఖ్ నవూ లో ప్రమోషనల్ ఈవెంట్ ను భారీగానే ప్లాన్ చేశారు. దీనికోసం ఓల్డ్ లఖ్ నవూ లోని హిస్టారికల్ ఘంటాగర్ చౌక్ వద్ద ప్లేస్ ఫిక్స్ చేశారు. దీంతో... ఈ స్టార్ ధ్వయాన్ని చుసేందుకు అభిమానులు, జనాలూ భారీగా తరలివచ్చారు.

ఇలా భారీ ఎత్తున జనాలు తరలిరావడంతో ఆ ప్రదేశంలో గందరగోళ పరిస్థితి నెలకోంది. ఈ సమయంలోనే అక్షయ్ కు చేదు అనుభవం ఎదురైంది. ఇందులో భాగంగా కొంతమంది ఆకతాయిలు.. అక్షయ్ కుమార్ పైకి చెప్పులు విసిరారు.. అనంతర, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. ఇదే సమయంలో అసభ్య పదజాలాన్ని వాడారని తెలుస్తుంది. దీంతో... పోలీసులు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా లాఠీ చార్జ్ చేశారు! ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది!

అక్షయ్ కు ఇదే ఫస్ట్ టైం కాదు..!:

అవును... బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కు ఇలాంటి చేదు అనుభవం ఎదురవ్వడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఆయనకు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి! ఇందులో భాగంగా... ఆయన ప్రధాన పాత్రలో నటించిన ఫృథ్వీరాజ్ సినిమా సమయంలోనూ తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ క్రమమోనే చంఢీగఢ్ లో ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు.

మరోపక్క వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అక్షయ్ కుమార్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అక్షయ్ ను చాంద్ నీ చౌక్ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలని భారతీయ జనతా పార్టీ భావిస్తుందంటూ కథనాలొస్తున్న సంగతి తెలిసిందే!