Begin typing your search above and press return to search.

సముద్రంలో పదిరోజులు గడిపిన క్రిమినల్స్... ఎలా పట్టుబడ్డారంటే...?

వివరాళ్లోకి వెళ్తే... ఈ ముగ్గురు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ శ్రీలంక నుంచి అక్రమంగా పుదుచ్చేరిలోకి వచ్చారు.

By:  Tupaki Desk   |   30 Aug 2023 5:24 AM GMT
సముద్రంలో పదిరోజులు గడిపిన క్రిమినల్స్... ఎలా పట్టుబడ్డారంటే...?
X

శ్రీలంక నుంచి పుదుచ్చేరికి సముద్రమార్గంలో అక్రమంగా ప్రవేశించాలనుకుని ప్రయత్నించారు ముగ్గురు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్. ఈ సందర్భంగా పోలీసులకు చిక్కిన ఈ ముగ్గురూ... శ్రీలంక నుంచి ఎలా వచ్చిందీ క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా కీలక విషయాలు వెల్లడయ్యాయని తెలుస్తోంది.

అవును... కసన్ కుమార్, రంగప్రసాద్, అమిల్ నువాన్ అనే ముగ్గురు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ శ్రీలంక నుంచి అక్రమంగా పుదుచ్చేరిలోకి వచ్చారు. వీరికి తమిళనాడులో ఒకరు, బెంగళూరులో మరొకరు ఆశ్రయం కల్పించేవారు. ఈ గ్యాప్ లో వారిని కూడా పట్టుకున్నారు బెంగళూరు సీసీబీ పోలీసులు.

వివరాళ్లోకి వెళ్తే... ఈ ముగ్గురు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ శ్రీలంక నుంచి అక్రమంగా పుదుచ్చేరిలోకి వచ్చారు. అయితే ఆ సమయంలో బంగాళాఖాతం ఒడ్డున భద్రతా బలగాలు కాపలా కాస్తున్నట్లు సమాచారం అందుకున్నారంట నిందితులు. దీంతో... భయాందోళనకు గురై పుదుచ్చేరి సమీపంలో ఓడలో సుమారు పది రోజులపాటు సంచరించారని.. అనంతరం ఆఖరికి ఒడ్డుకు చేరుకున్నట్లు బెంగళూరు సీసీబీ వర్గాలు తెలిపాయని తెలుస్తుంది.

అయితే అంతకు ముందు ఒకసారి బెంగుళూరు వచ్చిన ఈ ముగ్గురు నేరస్తులకూ ఆశ్రయం కల్పించిన బెంగళూరులోని జక్కూరుకు చెందిన పరమేష్ ను బెంగళూరు సీసీబీ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. ఇదేసమయంలో ఈ ముగ్గురూ విచారణలో వెల్లడించిన సమాచారంతో తమిళనాడులోని చెన్నైలో ఈ నేరగాళ్లకు ఆర్థిక సహకారం అందించిన అన్బళగన్‌ లు పట్టుకున్నారు.

అనంతరం ఈ నిందితులను తమిళనాడు, పుదుచ్చేరికి తీసుకుని వెళ్లిన బెంగళూరు పోలీసులు వారిని అక్కడికక్కదే విచారణ చేశారు. ఆ తర్వాత శ్రీలంక నుంచి పుదుచ్చేరికి, పుదుచ్చెరి నుంచి బెంగళూరుకు దొంగతనంగా ఎలా ప్రయాణించింది సవివరంగా వివరించారని తెలిసింది.

ఈ క్రమంలో... నిందితులు శ్రీలంక మీదుగా రామేశ్వరం, తర్వాత పుదుచ్చేరికి వచ్చి.. అనంతరం తరువాత సేలం మీదుగా బెంగళూరు చేరుకున్నారని సీసీబీ పోలీసు అధికారులు తెలిపారు.

అయితే వేసుకున్న ప్లాన్ ప్రకారం అయితే... నిందితులు పదిరోజుల ముందే పుదుచ్చేరి రావాల్సి ఉంది. అయితే ఆ రోజు నేవీ, కోస్ట్ గార్డ్ లు అప్రమత్తమత్తంగా ఉన్నాయన్న విషయం తెలుసుకున్న నిందితులు పుదుచ్చేరి ఒడ్డుకు చేరుకోకుండా మధ్యలోనే తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో సముద్రంలో పదిరోజులు గడిపారు.. అనంతరం పట్టుబడ్డారు!