ఒక్క రెజ్యూమె! సోషల్ మీడియాను షేక్ చేసిందిలా..
ఈ వినూత్న రెజ్యూమెను ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేయగానే అది వెంటనే వైరల్‌గా మారింది. దీనిపై రకరకాల కామెంట్లు వెల్లువెత్తాయి.
By: Tupaki Desk | 11 July 2025 4:00 AM ISTఉద్యోగం కోసం ప్రయత్నించే ప్రతి అభ్యర్థి తన రెజ్యూమె ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటాడు. రిక్రూటర్ల దృష్టిని ఆకర్షించి, తమ నైపుణ్యాలను హైలైట్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అయితే, ఇటీవల ఒక అభ్యర్థి రూపొందించిన రెజ్యూమె సోషల్ మీడియాలో అందరినీ ఆశ్చర్యపరిచింది. అది సాధారణ రెజ్యూమెలా కాకుండా ఎంతో వినూత్నంగా ఉండడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది.
కంటతడి పెట్టించే కాంపోజిషన్!
ఈ యువకుడి రెజ్యూమెలో కేవలం పేరు, ఫోటో, కెరీర్ ఆబ్జెక్టివ్ మాత్రమే ఉన్నాయి. కానీ, అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, రెజ్యూమె చివరలో పెద్ద అక్షరాలతో, "నా స్కిల్స్‌ను అన్‌లాక్ చేయాలంటే నన్ను నియమించుకోండి!" (Hire me to unlock my skills) అనే డైలాగ్ ఉంచాడు. ఇది చూసిన చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యంతో పాటు సరదా వ్యాఖ్యలు కూడా చేశారు.
నెటిజన్ల స్పందన!
ఈ వినూత్న రెజ్యూమెను ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేయగానే అది వెంటనే వైరల్‌గా మారింది. దీనిపై రకరకాల కామెంట్లు వెల్లువెత్తాయి. "ఇదెంతో పసిగట్టిన ఐడియా. 0.01% రిక్రూటర్లు నిజంగా ఒప్పించబడవచ్చు!. "ఇంటర్వ్యూకి మాత్రం పిలుస్తాను కానీ ఉద్యోగం ఇవ్వడం కష్టమే!" అని ఇంకొందరు అన్నారు. "ఇదేమైనా తెలివైన ప్రయత్నమా? లేక కాస్త అతిగా పిచ్చిపనిలా ఉందా?" అని ఇంకొందరు కామెంట్ చేశార.
- వైరల్ కావాలనే ప్రయత్నమా?
అసలు ఈ అభ్యర్థి నిజంగా ఉద్యోగం కోసమే ఇలా చేశాడా? లేక నేటి సోషల్ మీడియా యుగంలో 'వైరల్' కావాలనే ఉద్దేశంతోనే ఈ వినూత్న రెజ్యూమెను తయారు చేశాడా? అనేదే ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఏదేమైనా ఈ రెజ్యూమె యువతలో ముఖ్యంగా ఉద్యోగాన్వేషణలో ఉన్నవారిలో పెద్ద చర్చకు దారితీసింది. జాబ్ హంటింగ్ అనేది కేవలం సంప్రదాయబద్ధంగా కాకుండా క్రియేటివ్‌గా కూడా చేయవచ్చని ఈ అభ్యర్థి నిరూపించాడని చెప్పాలి.
- ఈ రకమైన ప్రయోగాలు కొంతమందికి నచ్చవచ్చు, మరికొందరికి మాత్రం ఇది ప్రొఫెషనలిజానికి తూట్లు పొడిచినట్టు అనిపించవచ్చు. ఏది ఏమైనా ఈ రెజ్యూమె ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా చెబుతోంది.. ఈ యుగంలో శక్తి కంటెంట్‌లో ఉంది. మొదటి ఇంప్రెషన్ గనుక బలంగా ఉంటే, తదుపరి అవకాశం ఖాయం!
