Begin typing your search above and press return to search.

సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్... సీపీ సీరియస్ వార్నింగ్!

ఇందులో భాగంగా స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు, స్టార్ హీరోయిన్లతో పాటు పలువురు సినీ ప్రముఖుల పేర్లు ప్రధానంగా వినిపించాయి.

By:  Tupaki Desk   |   13 Dec 2023 11:36 AM GMT
సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్... సీపీ సీరియస్  వార్నింగ్!
X

ఇటీవల కాలంలో డ్రగ్స్ కి సంబంధించిన వార్తల్లో హైదరాబాద్ కూడా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఒకానొక సమయంలో హైదరాబాద్ లో పట్టుబడుతున్న డ్రగ్స్ కేసుల్లో టాలీవుడ్ స్టార్స్ పేర్లు తెరపైకి రావడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు, స్టార్ హీరోయిన్లతో పాటు పలువురు సినీ ప్రముఖుల పేర్లు ప్రధానంగా వినిపించాయి. ఈ సమయంలో హైదరాబాద్ కొత్త సీపీ సీరియస్ కామెంట్స్ చేశారు.

అవును.. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ప్రధానంగా డ్రగ్స్ అనేది అతిపెద్ద సమస్యగా ఉందనే మాటలు, కథనాలు తరచూ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో గ్రేటర్ హైదరాబాద్ లో కొత్త సీపీలను ప్రకటించగా హైదరాబాద్ సీపీగా నియమితులైన కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తాజాగా బాధ్యతలు స్వీకరించారు. రోడ్ నెంబర్ 12లోని కమాండ్ కంట్రోల్ సెంట్రల్ లోబాధ్యతలు స్వీకరించిన ఆయన... అనంతరం తొలిసారి తాజాగా తొలిసారి హైదరబాద్ సీపీ హోదాలో మీడియాతో మాట్లాడారు.

ఇలా హైదరాబాద్ సీపీ హోదాలో మీడియాతో మాట్లాడిన కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి... ప్రధానంగా హైదరాబాద్ ని డ్రగ్స్ రహిత నగరంగా నిలబెడతామని తెలిపారు. దీంతో డ్రగ్స్ విషయంతో పాటు తదనుగుణంగా టాలీవుడ్ లో గతంలో జరిగిన విషయాలు తెరపైకి వచ్చాయి. ఈ సమయంలో తన శక్తి సామర్థ్యాలు నమ్మి సీపీగా బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన ఆయన... ముఖ్యంగా డ్రగ్స్ విషయం గురించి మాట్లాడుతూ సినీ పరిశ్రమని కూడా హెచ్చరించారు!

ఇందులో భాగంగా... డ్రగ్స్ ఎక్కడైతే ఎక్కువగా వాడకం జరుగుతుందని తెలుస్తుందో.. ఆ స్థలాలైన పబ్స్, హైఎండ్ బార్స్ & రెస్టారెంట్లు, ఫాం హౌస్ లు, తర్వాత తన దృష్టిలోకి వచ్చిన సినీ ఫీల్డ్ లో కూడా విరివిగా అలవాటు ఉందని తెలుస్తుందని అన్నారు. ఇలాంటి విషయాలపై కఠినమైన శిక్షలు ఉంటాయని, వీటిపై ఉక్కుపాదం మోపబోతున్నామని అన్నారు.

ఇదే సమయంలో ఇప్పటికే హైదరాబాద్ లో డ్రగ్స్ వ్యవహారం పాతుకుపోకుండా ఇప్పటికే చాలా జాగ్రత్తలు తీసుకున్నారని.. ఈ సమయంలో పూర్తిగా కూకటివేళ్లతో సహా పెకలించమని ముఖ్యమంత్రి ఆలోచన అని.. దాని ప్రకారం తాము నడుచుకుంటామని హైదరబాద్ సీపీ తెలిపారు. ఇదే సమయంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ పై కూడా సీపీ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా ఎవరైతే చట్టాలను గౌరవిస్తారో వారికే ఫ్రెండ్లీ పోలిసింగ్ అని అన్నారు. ఉదాహరణకు ట్రాఫిక్ సిగ్నల్స్ ఉల్లంగణ వంటివి పిల్లాటల్లో భాగంగా చేసినా.. వాటికి చలానా ఉంటుంది కానీ.. ఎవరైతే ఉద్దేశ పూర్వకంగా డ్రగ్స్ మొదలైన నేరాలకు పాల్పడతారో వారి విషయంలో మాత్రం అత్యంత కఠినంగా ఉంటామని అన్నారు. దీంతో... డ్రగ్స్ విషయం లో హైదరాబాద్ కొత్త సీపీ టూమచ్ సీరియస్ గా ఉన్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి!