Begin typing your search above and press return to search.

చిక్కుల్లో బేబీ మూవీ.. హైదరాబాద్ సీపీ సీరియస్..!

ఈ మూవీపై తాజాగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సీరియస్ అయ్యారు.

By:  Tupaki Desk   |   14 Sep 2023 1:35 PM GMT
చిక్కుల్లో బేబీ మూవీ..  హైదరాబాద్ సీపీ సీరియస్..!
X

ఈ మధ్యకాలంలో విడుదలై బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించిన సినిమాల్లో బేబీ ఒకటి. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీసును షేక్ చేసింది. ఈ మూవీతో హీరో లు ఆనంద్ దేవర కొండ, విరాజ్, హీరోయిన్ వైష్ణవి చైతన్య, కు మంచి ప్రశంసలు దగ్గాయి. ఈ కాలంలో యువత ఎలా ఉంటున్నారు అనే విషయాలను ఈ మూవీలో చూపించారు. ఓ బస్తీకి చెందిన అమ్మాయి, ఒక్కసారి పాష్ కాలేజీకి వెళ్లిన తర్వాత ఎలా మారింది అనే పాయింట్ ని ట్రయాంగిల్ కి కనెక్ట్ చూపించారు. దీంతో, యూత్ కి బాగా కనెక్ట్ అయిపోయింది.

అయితే, ఈ మూవీ ప్రస్తుతం చిక్కుల్లో పడింది. నిజానికి ఏదైనా మూవీ విడుదలయ్యే సమయంలోనో, లేక, ట్రైలర్,టీజర్ లో ఏదైనా అభ్యంతరాలు ఉంటే చిక్కులు వచ్చే అవకాశం ఉంది. కానీ, బేబీ మూవీ మాత్రం విడుదలై, సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న తర్వాత దీనికి చిక్కులు రావడం విశేషం. ఈ మూవీపై తాజాగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సీరియస్ అయ్యారు.

ఈ మూవీలో కొన్ని డ్రగ్స్ ని ప్రొత్సహించేలా సన్నివేశాలు ఉన్నాయని ఆయన అన్నారు. ప్రెష్ లింగ్ అపార్ట్ మెంట్ లో రీసెంట్ గా రైడ్ నిర్వహించామని, అక్కడ బేబీ మూవీలో లాంటి సన్నివేశాలు కనిపించాయని ఆయన అన్నారు. ఆ మూవీని చూసి నిందితులు కూడా అదే ఫాలో అవుతున్నారని, అదేవిధంగా పార్టీ చేసుకున్నారని కమిషనర్ అన్నారు. సినిమాలో అలాంటి సీన్లు పెట్టినప్పుడు, కింద కనీసం ఒక నోట్ కూడా వేయలేదని ఆయన మండిపడ్డారు. తాము హెచ్చరించిన తర్వాత మాత్రమే నోట్ వేశారని గుర్తు చేశారు.

ఇలాంటి సీన్లతో, ప్రజలను ప్రభావం చేసినందుకు బేబీ మూవీకి తాము నోటీసులు జారీ చేస్తామని కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఇక నుంచి తాము ప్రతి సినిమాపై నిఘా పెడతామని, అభ్యంతకర సన్నివేశాలు ఊరుకోమని ఆయన స్ఫష్టం చేశారు.

ఇక, బేబీ మూవీ జులై లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. ఈ మూవీతో ఆయన పాపులారిటీ బాగా పెరిగిపోయింది. మరి, ఈ నోటీసులపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.