Begin typing your search above and press return to search.

బాబు మీద గౌర‌వంతో ఆగుతున్నాం: కామ్రెడ్ల కీల‌క వ్యాఖ్య‌లు

తాజాగా విజ‌య‌వాడ‌లో సీపీఐ నాయ‌కులు భేటీ అయ్యారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సీపీఐ, సీపీఎంలు పొత్తు పెట్టుకుని ముందుకు సాగాల‌ని నిర్న‌యించుకున్న విష‌యం తెలిసిందే.

By:  Tupaki Desk   |   28 Feb 2024 8:37 AM GMT
బాబు మీద గౌర‌వంతో ఆగుతున్నాం:  కామ్రెడ్ల కీల‌క వ్యాఖ్య‌లు
X

"చంద్ర‌బాబు మీద మాకు గౌర‌వం ఉంది. అందుకే ఏమీ అన‌డం లేదు. మేం ఇబ్బందులు పడుతున్నాం. కానీ, వైసీపీ లేకుండా పోవాల‌న్న ఏకైక ల‌క్ష్యంతో ఉన్నాం కాబ‌ట్టే కొన్ని కొన్ని విష‌యాలు బ‌య‌ట‌కు చెప్ప లేక పోతున్నాం" అని సీపీఐ కీల‌క నాయ‌కులు వ్యాఖ్యానించారు. తాజాగా విజ‌య‌వాడ‌లో సీపీఐ నాయ‌కులు భేటీ అయ్యారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సీపీఐ, సీపీఎంలు పొత్తు పెట్టుకుని ముందుకు సాగాల‌ని నిర్న‌యించుకున్న విష‌యం తెలిసిందే.

ఇప్ప‌టికే ప్రాథ‌మికంగా కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ ష‌ర్మిల‌, ఇత‌ర నేత‌లు.. గిడుగు రుద్ర‌రాజు, ప‌ల్లం రాజు, జేడీ శీలం, ర‌ఘువీరారెడ్డి వంటివారితో క‌మ్యూనిస్టులు చ‌ర్చ‌లు జ‌రిపారు. ఇక‌, ఇప్పుడు సీట్ల పంప‌కాల‌పై రేపో మాపో మ‌రోసారి భేటీ అయి చ‌ర్చించుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా విజ‌య‌వాడ లో సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి కె. రామ‌కృష్ణ నేతృత్వంలో నాయ‌కులు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్బంగా అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ్య‌వ‌హారంపై వారు చ‌ర్చించుకున్నారు.

చంద్ర‌బాబు శైలి న‌చ్చ‌లేద‌ని కామ్రెడ్స్ వ్యాఖ్యానించారు. అయితే.. దీనికి కార‌ణాల‌ను మాత్రం వారు వెల్లిడించ‌లేదు. తాము మౌనంగానే ఉన్నామ‌ని.. ఎన్నిక‌లు అయిపోయిన త‌ర్వాత‌.. త‌మ అభిప్రాయాలు చెబుతామ‌ని ఒక నాయ‌కుడు మీడియాతో వ్యాఖ్యానించారు. అయితే.. క‌మ్యూనిస్టుల్లో ముఖ్యంగా సీపీఐలో ఇంత అసంతృప్తి రావ‌డానికి కార‌ణం చూస్తే.. పొత్తులేన‌ని తెలుస్తోంది. 2022లో సీపీఐ నేత రామ‌కృష్ణ‌తో చంద్ర‌బాబు బేటీ అయ్యారు. క‌లిసి ప‌నిచేద్దామ‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా ఎన్నిక‌ల‌కు క‌లిసే వెళ్తామ‌ని హామీ ఇచ్చారు.

అయితే.. ఇప్పుడు టీడీపీ బీజేపీతో జ‌ట్టుక‌ట్టేందుకు రెడీ అయింది. దీనిని క‌మ్యూనిస్టులు జీర్ణించుకోలేక పోతున్నారు. గత రెండేళ్ల‌లో టీడీపీ ఏ కార్య‌క్ర‌మానికి పిలుపునిచ్చినా.. క‌మ్యూనిస్టులు క‌లిసి వ‌చ్చారు. ఎక్క‌డ ఉద్య‌మం చేసినా.. మేమున్నామంటూ.. ఎర్ర జెండాలు ఎగ‌రేశారు. అయితే.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో బీజేపీని వీడి పోటీ చేసినా ఫ‌లితం ద‌క్క‌ద‌ని భావించిన చంద్ర‌బాబు ఆదిశ‌గా అడుగులు వేశారు. ఇది సిద్ధాంత ప‌రంగా చూస్తే.. క‌మ్యూనిస్టుకు మింగుడు ప‌డ‌దు. అందుకే.. చంద్ర‌బాబుపై ఒకింత ఆవేద‌న వ్య‌క్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.