Begin typing your search above and press return to search.

కరోనా టీకాలు వేసుకున్న వారిని వదలని సైబర్ నేరగాళ్లు

కరోనా వైరస్ అందరిని భయపెట్టింది. రెండేళ్లు మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుకుంది.

By:  Tupaki Desk   |   16 May 2024 1:30 PM GMT
కరోనా టీకాలు వేసుకున్న వారిని వదలని సైబర్ నేరగాళ్లు
X

కరోనా వైరస్ అందరిని భయపెట్టింది. రెండేళ్లు మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుకుంది. ప్రపంచమే అతలాకుతలం అయింది. టీకాలు రావడంతో వ్యాధి తీవ్రత తగ్గింది. ఈ నేపథ్యంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ వంటి టీకాలు తీసుకోవడం వల్ల వ్యాధిని నియంత్రణలోకి తీసుకురావడం జరిగింది. కానీ ఇప్పుడు అవే టీకాలు మనుషుల ప్రాణాలకు ముప్పుగా పరిణమించాయని అంటున్నారు.

కరోనా టీకాలు తీసుకున్న వారి వ్యక్తి గత సమాచారం చోరీ చేస్తున్నారు. గుర్తు తెలియని నంబర్ల ద్వారా పలకరిస్తూ మాటల్లో పెట్టి మన సమాచారం సేకరిస్తున్నారు. ఇటీవల కోల్ కతాలో వెలుగు చూసిన ఓ ఘటన ఇదే విషయాన్ని రుజువు చేస్తోంది. కొంత మందికి ఐవీఆర్ఎస్ కాల్స్ చేసి వారితో ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ సాయంతో మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.

కోల్ కతాకు చెందిన సైబర్ సెల్ అధికారి చెబుతూ ఒక వ్యక్తి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారా లేదా అని రికార్డు చేసిన వాయిస్ తో అడుగుతాడు. తరువాత కోవిషీల్డ్ అయితే 1 నొక్కండి. కోవాక్సిన్ అయితే 2 నొక్కండి అంటూ అడుగుతున్నాడు. దీంతో కొన్ని గంటల పాటు మన ఫోన్ నెట్ వర్క్ ఆగిపోతుంది. ఆ సమయంలో వారు మన వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తున్నారు.

దీంతో మన వ్యక్తిగత సమాచారం చోరీకి గురి కావడంతో మన బ్యాంకు ఖాతాలో ఉండే నగదును తీసుకోవడం జరుగుతుంది. అకౌంట్లలో భారీగా నగదు నిల్వలు ఉంచుకుంటే అంతే సంగతి. మన డబ్బు దొంగతనానికి గురవుతుంది. దీనిపై అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎవరు అడిగినా మన వ్యక్తిగత సమాచారం గురించి ఎలాంటి క్లూ ఇవ్వొద్దని చెబుతున్నారు.

దేశంలో ఆన్ లైన్ మోసాలకు కొదవేలేదు. కొత్త కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేసేందుకు మోసగాళ్లు రెడీగానే ఉంటారు. ఈ క్రమంలో మనమే కాస్త జాగ్రత్తలు పాటించాలి. అపరిచిత వ్యక్తుల నుంచి ఎలాంటి కాల్స్ వచ్చినా సమాధానం ఇవ్వరాదు. అనుమానం వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి.