విశాఖలో కరోనా... బీచ్ సిటీ అలెర్ట్!
సరిగ్గా అయిదేళ్ళ తరువాత కరోనా మళ్ళీ వీర విహారం చేస్తోంది. అది ఆసియా దేశాలలో ఎక్కువగా తన ప్రతాపాన్ని చూపిస్తోంది.
By: Tupaki Desk | 23 May 2025 12:04 AM ISTసరిగ్గా అయిదేళ్ళ తరువాత కరోనా మళ్ళీ వీర విహారం చేస్తోంది. అది ఆసియా దేశాలలో ఎక్కువగా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఇప్పటికే సింగపూర్ వంటి దేశాలలో వేలలలో కేసులు నమోదు అవుతున్నాయి. భారతదేశంలో మహారాష్ట్రలో అధికంగా ఉన్నాయి. అలాగే కేరళలోని పాటు ఇతర రాష్ట్రాలలో బాగానే నమోదు అవుతున్నాయి.
ఈ నేపధ్యంలో తెలుగు రాష్ట్రాలలో కరోనా ఎంట్రీ ఇచ్చింది. అది కూడా సాగర తీర నగరం అయిన విశాఖలో తొలి కేసు నమోదు కావడంతో వైజాగ్ వాసులు కలవరపడుతున్నారు. పిఠాపురం కాలనీలో కరోనా కేసు ఒకటి వెలుగు చూసింది అని అధికారులు నిర్ధారించారు. పిఠాపురం కాలనీకి చెందిన మహిళకు కొవిడ్ నిర్ధారణ అయిందని డీఎంహెచ్‌వో అధికారులు వెల్లడించారు. అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు కానీ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కరోనా కేసులు పెరిగినా ప్రాణ భయాలు లేవని అంటున్నారు. అయితే కరోనా సూచనలు ఉంటే కనుక పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నారు. రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్ళడాన్ని తగ్గించాలని బస్సు స్టేషన్లు, రైల్వే స్టేషన్లు కీలక ప్రాంతాలలో గుమిగూడడాలు తగ్గించాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు.
అలాగే జ్వరం తలనొప్పి అలసట, జలుపు, ఒళ్ళు నొప్పులు గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉంటే అశ్రద్ధ చేయకుండా వైద్యులకు చూపించుకోవాలని కోరారు. ఇదిలా ఉంటే కరోనా పైన అవగాహన ఉంటే చాలు ఆందోళన అవసరం లేదని వైద్యులు అంటున్నాఉర్.
కానీ కరోనా అన్న మూడు అక్షరాల పదవి వినిపిస్తేనే జనాలు హడలిపోతున్నారు. మళ్ళీ వచ్చేసిందా అన్న భయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడో కరోనా ఉందని అనుకుంటే విశాఖలోనే కేసు తేలిందంటే రానున్న రోజులలో ఇబ్బందులు తప్పవా అన్న చర్చ కూడా చేస్తున్నారు. అయితే వైద్యులు చెప్పేది నియంత్రణ ముఖ్యమని. అలాగే ఎవరికి వారుగా అవగాహనతో ఉండమని. భయాలు కలవరాలు పెట్టుకుంటే దాని వల్ల ఇబ్బందులే తప్ప మరేమీ ఒనకూడేది ఉండదని కూడా అంటున్నారు.
