Begin typing your search above and press return to search.

"జ్ఞానవాపి"పై కోర్టు తీర్పు... ఒవైసీ సంచలన వ్యాఖ్యలు!

దీనికి అనుగుణంగా వారం రోజుల్లోగా ఏర్పాట్లు చేయాలని స్థానిక యంత్రాంగాన్ని కోర్టు ఆదేశించింది.

By:  Tupaki Desk   |   1 Feb 2024 6:04 AM GMT
జ్ఞానవాపిపై కోర్టు తీర్పు... ఒవైసీ సంచలన వ్యాఖ్యలు!
X

"జ్ఞానవాపి" కేసు కీలక మలుపు తిరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రార్థనా మందిరంలో సీల్‌ చేసి ఉన్న ప్రాంతంలో పూజలు చేసుకునేందుకు హిందువులకు వారణాసి కోర్టు అనుమతినిచ్చింది. దీనికి అనుగుణంగా వారం రోజుల్లోగా ఏర్పాట్లు చేయాలని స్థానిక యంత్రాంగాన్ని కోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో... కాశీ విశ్వనాథ ఆలయానికి చెందిన అర్చకులతో పూజలు చేయించాలని కోర్టు సూచించినట్లు చెబుతున్నారు. దీంతో... ఈ వ్యవహారంపై ఒవైసీ స్పందించారు.

అవును... జ్ఞానవాపి మసీదులోని బేస్ మెంట్ లో హిందువులు ప్రార్ధనలు చేసుకోవచ్చంటూ వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఇందులో భాగంగా... కోర్టు తీర్పును తప్పుపట్టారు. ఇదే క్రమంలో... ఇది ప్రార్థనా స్థలాల చట్టాన్ని ఉల్లంఘించడమేనని అన్నారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇంతేజామియా మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టులో అప్పీల్ చేయనుందని ఆయన చెప్పారు.

ఇదే సమయంలో ఇచ్చిన తీర్పును అనుసరించే అంటూ.. కొన్ని ప్రశ్నలు అడిగారు! ఇందులో భాగంగా... జడ్జి ఇచ్చిన తీర్పు ఆయన పదవీ విరమణకు చివరి రోజని చెప్పిన ఒవైసీ... 30ఏళ్లుగా ఇక్కడ ప్రార్ధనలు లేవని ఆయనే చెప్పారని అన్నారు. మరి ఇప్పుడు ఇక్కడ విగ్రహం ఉందని ఎలా గుర్తించారని అడిగారు. ఇదే సమయంలో... అక్కడ పూజలకు ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. జ్ఞానవాపి మసీదు నేలమాళిగలో పూజలకు అనుమతించడం తప్పని అనారు.

కాగా గతంలో కూడా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎసై) పైనా, జ్ఞానవాపి ఇష్యూపైనా అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏ.ఎస్.ఐ) జ్ఞానవాపి కాంప్లెక్స్‌ లో చేసిన సర్వేను విమర్శిస్తూ, "ఏ.ఎస్.ఐ హిందుత్వ దాసీ" అని ఒక పోస్ట్‌ లో పేర్కొన్నారు. మసీదులో హిందూ విగ్రహాలు ఉన్నాయనే విషయం... ఏదైనా ప్రొఫెషనల్ ఆర్కియాలజిస్టులు లేదా చరిత్రకారుల ముందు పరిశీలనకు నిలబడదని చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో... గతంలోనూ ఈ విషయాలపై స్పందించిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ వ్యాఖ్యలపైనా అసదుద్దీన్ ఒవైసీ ఫైరయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... "జ్ఞానవాపిలో దేవుడి విగ్రహాలు ఉన్నాయి.. త్రిశూలం ఉంది.. చారిత్రక తప్పిదం జరిగింది అని ముస్లిం పెద్దలు ఒప్పుకుని దాన్ని తిరిగి అప్పగించాలి" అని యోగి వ్యాఖ్యానించారు.

దీంతో... ఈ విషయంపై స్పందించిన ఒవైసీ... ముఖ్యమంత్రి పదవిలో ఉండి యోగి ఆదిత్యానాథ్ చట్టాన్ని ఉల్లంగిస్తున్నాడు అంటూ ఆరోపించారు. ఇదే సమయంలో సీఎంగా ఉంటూ బెదిరింపు దోరణిలో మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. జ్ఞానవాపిలో 400 ఏళ్ల నుండే మసీదు ఉందని అన్నారు. ఈ క్రమంలోనే తాజాగా జ్ఞానవాపి విషయంలో వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబడుతున్నారు.