Begin typing your search above and press return to search.

ఘోరం..ఎంతో అన్యోన్యంగా జంట..ఇంతలో ఏమైంది?

ఒకరి తర్వాత ఒకరు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. దీంతో రెండు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది.

By:  Tupaki Desk   |   9 Aug 2023 7:19 AM GMT
ఘోరం..ఎంతో  అన్యోన్యంగా జంట..ఇంతలో ఏమైంది?
X

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చిన్నపొలమడ గ్రామానికి చెందిన అమ్మాయి, అబ్బాయి ఒకరిపై ఒకరు మనసుపడ్డారు. కలిసి బ్రతకాలని కలలుగన్నారు. ఇరువురి ఇళ్లల్లో తల్లితండ్రులను పట్టుబట్టిమరీ ఒప్పించారు. పెళ్లి ఘనంగా చేసుకున్నారు. ఆరునెలలు హ్యాపీగా కాపురం చేశారు! ఇంతలో ఏమైందో తెలియదు... ఘోరం జరిగిపోయింది.

అవును... ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతులు పెళ్లిన ఆరు నెలలు హ్యాపీగా కాపురం చేసుకున్నారు. ఇంతలోనే ఏం జరిగిందో తెలియదు.. ఏ కష్టం వచ్చిందో తెలియదు.. ఒకరి తర్వాత ఒకరు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. దీంతో రెండు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది.

బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంజునాథ్‌ (27), రమాదేవి (24) ఒకరినొకరు ఘాడంగా ప్రేమించుకున్నారు. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోయినా పట్టుబట్టి ఓప్పించారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది.

ఈ సమయంలో ఏమి జరిగిందో తెలియదు కానీ... ఆగస్టు 7 సోమవారం సాయంత్రం అనంతపురం పట్టణంలోని చల్లవారిపల్లి గ్రామ సమీపంలో రైలు కిందపడి రమాదేవి మృతి చెందింది. ఆత్మహత్యకు ముందు భర్తతో ప్రేమగా మట్లాడి ఈ దారుణానికి పాల్పడిందని తెలుస్తోంది. ఈ సమాచారం అనంతరం... అల్లుడిపై ఫిర్యాదు చేశారు రమాదేవి తల్లితండ్రులు.

అల్లుడు మంజునాథ్‌ కుటుంబం వరకట్న వేధింపులతోనే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని చెబుతున్నారు. భార్య రమాదేవి మరణించిందన్న వార్త విన్న మంజునాథ్‌ మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో అందరూ నిద్రలో ఉండగా ఇంటి నుంచి బయటికి వచ్చాడు. ఆ తర్వాత తాడిపత్రి రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

లవ్ మ్యారేజ్ చేసుకుని ఆరు నెలలు అయిన అనంతరం ఇలా దంపతులు ఇద్దరూ ఒకరి తరువాత ఒకరు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడటంతో ఇరువురి కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి. మరోపక్క జంట ఆత్మహత్యలకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.