Begin typing your search above and press return to search.

ఈ జంటకు విధి పెట్టిన పరీక్ష తెలిస్తే వణుకు పుడుతుంది

ఇదిలా ఉంటే ఇటలీలోని సావోనా సిటీలో ఉన్న తమ కామన్ ఫ్రెండ్ ఇంట్లో జరుగుతున్న క్రిస్మస్ వేడుకకు హాజరయ్యేందుకు ఈ ఇద్దరు ప్రేమికులు వేర్వేరుగా బయలుదేరారు.

By:  Tupaki Desk   |   23 Dec 2023 7:30 AM GMT
ఈ జంటకు విధి పెట్టిన పరీక్ష తెలిస్తే వణుకు పుడుతుంది
X

దేవుడికి మించిన అద్భుతమైన స్క్రిప్టు రైటర్ ఎవరు ఉంటారు చెప్పండి? దేవుడు ఉన్నాడన్న నమ్మకం ఉన్నా లేకున్నా.. ఈ ప్రపంచాన్ని నడిపించే అద్భుత శక్తి ఏదో ఉన్న విషయాన్ని మాత్రం చాలామంది నమ్ముతారు. అంతేనా.. టైం మేజిక్ ను సైతం చాలామంది పరిగణలోకి తీసుకుంటారు. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఆ కోవలోకే చెందుతుంది. ఈ ఉదంతం గురించి విన్నంతనే ఇదేమైనా సినిమా స్క్రిప్టా? అని అడుగుతారు కానీ.. ఇది రీల్ కాదు రియల్ ఘటన. ఒకే టైం ఇద్దరు ప్రేమికులు ఒకేలాంటి ప్రమాదానికి గురి కావటం ఒక ఎత్తు అయితే.. లక్కీగా వారిద్దరు క్షేమంగా బయటపడటం మాత్రం ఈ కథనాన్ని చదివే వారందరికి రిలీఫ్ గా అనిపించకమానదు.


కలిసి జీవితాన్ని పంచుకోవాలని భావిస్తున్న ఇటలీలోని ఒక జంటకు ఒక భయంకరమైన అనుభవం ఎదురైంది. షాకింగ్ అంశం ఏమంటే.. ఒకే టైంలో ఈ ఇద్దరు ప్రేమికులు ఒకేలాంటి ప్రమాదం బారిన పడటం. ఇటలీకి చెందిన 30 ఏళ్ల స్టెఫానో.. 22 ఏళ్ల ఆంటోనియోట్టా డెమాసి ఇద్దరు ప్రేమికులు. వారిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. త్వరలో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు.

ఇదిలా ఉంటే ఇటలీలోని సావోనా సిటీలో ఉన్న తమ కామన్ ఫ్రెండ్ ఇంట్లో జరుగుతున్న క్రిస్మస్ వేడుకకు హాజరయ్యేందుకు ఈ ఇద్దరు ప్రేమికులు వేర్వేరుగా బయలుదేరారు. ఈ పార్టీకి వచ్చేందుకు వీరిద్దరు మైక్రో జెట్లు (బుల్లి విమానాలు) ఎంచుకొని అందులో ప్రయాణం పెట్టుకున్నారు. వీరిద్దరు వేర్వేరు ప్రాంతాల నుంచి ఒకే టైంలో బయలుదేరారు. అంటే.. ఎయిర్ పోర్టులో ఒకే టైంలో చేరుకునేలా ప్లాన్ చేసుకున్నారు.

అయితే.. వీరిద్దరు ప్రయాణిస్తున్న బుల్లి విమానాలు దాదాపు ఒకే టైంలో ఒకేసారి ప్రమాదానికి గురయ్యాయి. షాకింగ్ గా మారిన ఈ ఉదంతంలో రిలీఫ్ ఏమంటే.. ఈ ఇద్దరు ప్రేమికులు సేఫ్ గా బయటపడ్డారు. వారిద్దరి ఎయిర్ క్రాఫ్టులు క్రాష్ ల్యాండింగ్ వేళ.. ప్రాణాలతో బయటపడటాన్ని అద్భుతంగా చెప్పాలి. స్టెఫానో ఎలాంటి గాయాలు లేకుండా ఈ ప్రమాదం నుంచి బయటపడితే.. ఆంటోనియోట్టా మాత్రం కొద్దిపాటి గాయాలతో క్షేమంగా బయటపడ్డారు. వారి ప్రమాదానికి గురైన ఎయిర్ క్రాఫ్టుల విషయాన్ని తెలుసుకున్న రెస్క్యు టీం యుద్ధ ప్రాతిపదికన ఘటనాస్థలానికి చేరుకొని వారిని సేవల్ చేశారు. ఈ ఇద్దరు ప్రేమికులతో పాటు.. వారు ప్రయాణిస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ పైలెట్ లను కూడా ఆపుపత్రిలో చేర్చారు. విధి ఆడే వింత నాటకంగా ఈ ఉదంతం అనిపించట్లేదు?