Begin typing your search above and press return to search.

భార్య, పిల్లలను తుపాకీతో కాల్చి చంపిన కానిస్టేబుల్‌... కారణం దారుణం!

ఆన్ లైన్ మోసాల గురించి దాదాపు అందరికీ తెలిసిందే! ఈ ఆన్ లైన్ మోసాలకు ఎన్నో జీవితాలు బలైపోయిన సంఘటలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.

By:  Tupaki Desk   |   16 Dec 2023 8:17 AM GMT
భార్య, పిల్లలను తుపాకీతో కాల్చి చంపిన కానిస్టేబుల్‌... కారణం దారుణం!
X

ఆన్ లైన్ మోసాల గురించి దాదాపు అందరికీ తెలిసిందే! ఈ ఆన్ లైన్ మోసాలకు ఎన్నో జీవితాలు బలైపోయిన సంఘటలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఈ సమయంలో ఆన్ లైన్ గేంస్ ఆడి ఒక వ్యక్తి ఆర్థికంగా చితికిపోయి, అనంతరం ఫ్యామిలీ ఫ్యామిలీ మృతి చెందిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో బాధితుడు ఒక పోలీస్ కానిస్టేబుల్ కావడం గమనార్హం.

అవును... ఆన్‌ లైన్‌ గేంల వల్ల ఒక కుటుంబం బలైపోయింది! ఆన్ లైన్ లో గేం ఆడి లక్షల రూపాయలు పోగొట్టుకొని, చేసిన అప్పులు తిరిగి చెల్లించే మార్గం లేక ఒక ఏఆర్‌ కానిస్టేబుల్‌.. తన భార్య, ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తీశాడు. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తలకు పిస్తోల్‌ గురిపెట్టి ఒకరి తర్వాత ఒకరి ప్రాణాలు తీశాడు. అనంతరం తనను తాను కాల్చుకుని మృతిచెందాడు. ఈ ఘోరం సిద్దిపేట జిల్లాలో జరిగింది.

వివరాళ్లోకి వెళ్తే... సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామానికి చెందిన ఆకుల నరేశ్‌ (35) ఏఆర్‌ కానిస్టేబుల్‌ గా ప్రస్తుతం జిల్లా కలెక్టర్‌ వద్ద గన్‌ మేన్‌ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడికి చైతన్య(30)తో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కుమారుడు రేవంత్‌ (7), కుమార్తె హితశ్రీ(5) ఉన్నారు. భార్య చైతన్య సిద్దిపేటలోని ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్ గా పనిచేస్తుండగా... అక్కడే పిల్లలూ చదువుతున్నారు.

ఈ క్రమంలో శుక్రవారం ఎప్పటిలాగే విధుల్లోకి వెళ్లిన నరేశ్‌.. కలెక్టర్‌ సెలవులో ఉండటంతో ఇంటికి వచ్చాడు. వస్తూ వస్తూ సర్వీసు రివాల్వర్ కూడా తనతో తెచ్చుకున్నాడు. ఈ సమయంలో స్కూల్ కి వెళ్లేందుకు సిద్ధమైన భార్య, పిల్లలను ఆపాడు. అనంతరం తొలుత భార్యను, ఆ తర్వాత పిల్లలను రివాల్వర్ తో కాల్చిచంపాడు. చివరిగా తనను తానూ కాల్చుకొని కుప్పకూలాడు.

ఈ సమయంలో ఇంట్లోఓ నుంచి తుపాకీ శబ్దం రావడంతో గమనించిన ఇరుగుపొరుగు వారు ఆయన సోదరుడు సురేష్ కు సమాచారమిచ్చారు. విషయం తెలియగానే సురేష్ అక్కడికి వెళ్లే సరికి నలుగురూ రక్తపుమడుగులో పడిఉన్నారు.

అనంతరం పోలీసు కమిషనర్‌ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు. ఆ ఆర్థిక ఇబ్బందులకు ఆన్ లైన్ గేం లే కారణమని తెలుస్తుంది. అది కూడా సుమారు రూ.50 లక్షలు పైనే అని సమాచారం!