Begin typing your search above and press return to search.

గ్రామ గ్రామానికి చేరేలా కాంగ్రెస్ వ్యూహం

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జోరుమీదుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి సానుకూల ఫలితాలు వస్తాయనే ప్రచారం, ఊహాగానాలు కాంగ్రెస్ లో జోష్ నింపుతున్నాయి.

By:  Tupaki Desk   |   13 Sep 2023 5:30 PM GMT
గ్రామ గ్రామానికి చేరేలా కాంగ్రెస్ వ్యూహం
X

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జోరుమీదుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి సానుకూల ఫలితాలు వస్తాయనే ప్రచారం, ఊహాగానాలు కాంగ్రెస్ లో జోష్ నింపుతున్నాయి. అధికార బీఆర్ఎస్ ను గద్దె దించడం కాంగ్రెస్ వల్లే అవుతుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పుడుతున్న సానుకూల పరిస్థితులను మరింత అనుకూలంగా మార్చుకోవడం కోసం కాంగ్రెస్ కష్టపడుతోంది. ఈ నెల 17న హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. దీనికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ సభను విజయవంతం చేసి ఎన్నికలకు ముందు ప్రయోజనం పొందాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చూస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 17న జరిగే బహిరంగ సభ గురించి గ్రామ గ్రామానికి చేర్చేందుకు టీపీసీసీ సిద్ధమైంది. ఈ సభ కోసం రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి జనాలను రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభలో జాతీయ నేతలంతా పాల్గొనే అవకాశం ఉండటంతో టీపీపీసీ దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దీని గురించి గ్రామాల్లో తెలిసేలా ప్రత్యేక కార్యచరణ రూపొందించింది. తెలంగాణ కాంగ్రెస్లోని కీలక నాయకులు మూడు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని మండలాలకు వెళ్లి స్థానిక నేతలతో సమావేశమవుతున్నారు. ఇందుకోసం సీనియర్ నేతలకు ఒక్కొక్కరికి అయిదు నియోజకవర్గాల చొప్పున బాధ్యతలు అప్పగించారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కొడంగల్, నారాయణపేట, దేవరకద్ర, కల్వకుర్తి, జడ్చర్ల. భట్టి విక్రమార్కకు మధిర, ఇల్లెందు, వైరా, పినపాక, కొత్తగూడెం, ఉత్తమ్కు కోదాడ, హుజూర్ నగర్, మిర్యాల గూడ, దేవరకొండ, సూర్యపేట.. ఇలా సీనియర్లకు నియోజకవర్గాలు అప్పగించారు. ఆయా నేతలు ఈ నియోజకవర్గాల్లోని మండలాలకు వెళ్లి స్థానిక నేతలతో సమావేశమవుతున్నారు. ఆ తర్వాత అక్కడి నాయకులు సభ విషయాన్ని ప్రతి గ్రామానాని తీసుకెళ్తున్నట్లు తెలిసింది. మొత్తానికి ఈ సభను విజయవంతం చేయడానికి కాంగ్రెస్ పక్కా కసరత్తులు చేస్తుందన్నది మాత్రం స్పష్టమవుతోంది.