Begin typing your search above and press return to search.

మహిళలకు ఏడాదికి రూ. లక్ష... కాంగ్రెస్ పార్టీ కొత్త పథకం!

వరుసగా కర్ణాటక, తెలంగాణల్లో గెలిచిన ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ "గ్యారెంటీ"ల పేరున సరికొత్త పథకాలు తెరపైకి తెస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   13 March 2024 10:10 AM GMT
మహిళలకు ఏడాదికి రూ. లక్ష... కాంగ్రెస్  పార్టీ కొత్త పథకం!
X

వరుసగా కర్ణాటక, తెలంగాణల్లో గెలిచిన ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ "గ్యారెంటీ"ల పేరున సరికొత్త పథకాలు తెరపైకి తెస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో లోక్ సభ ఎన్నికలు వస్తుండటంతో.. మరికొన్ని కొత్త పథకాలను తెరపైకి తెచ్చింది. ప్రధానంగా మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు వారే లక్ష్యంగా సరికొత్త పథకాలు ప్రకటిస్తుంది.

అవును... లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తాజాగా మహిళలకు ప్రత్యేకంగా ఐదు గ్యారెంటీలను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే "నారీ న్యాయ్" అనే సరికొత్త హామీని ప్రకటించారు. అటు మహారాష్ట్రలో "భారత్ న్యాయ్ జూడో యాత్ర"లో ఉన్న రాహుల్ గాంధీ కూడా ఈ వివరాలను సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

నారీ న్యాయ్ అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఈ కొత్త హామీలో మొత్తం ఐదు గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అవి... మహాలక్ష్మి, ఆదీ ఆబాదీ - పూరా హక్‌, శక్తి కా సమ్మాన్, అధికార్ మైత్రీ, సావితీబాయి పూలే హాస్టల్స్ అనే ఐదు గ్యారెంటీలు గా ఉన్నాయి. ఆ హామీల వివరాలు ఇప్పుడు చూద్దాం...!

మహాలక్ష్మీ: ఈ పథకం కింద ప్రతీ పేద కుటుంబంలోని ఒక మహిళకు ప్రతీ ఏడాది లక్ష రూపాయల నగదును నేరుగా వారి ఖాతాల్లోకి బదిలీ చేస్తారు.

ఆదీ ఆబాదీ - పూరా హక్: ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం కొత్తగా చేపట్టే నియామకాల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పిస్తారు.

శక్తి కా సమ్మాన్: ఆశా, అంగన్వాడీ, మధాహ్నం భోజన పథకంలో విధులు నిర్వర్తించే మహిళలకు నెలవారీ జీతంలో కేంద్రం ఇచ్చే వాటా రెట్టింపు చేస్తారు.

అధికార్ మైత్రీ: మహిళలను విద్యావంతులను చేసి, వారికి సాధికారత కల్పించేందుకు వీలుగా ప్రతీ పంచాయతీలోనూ ఒక అధికార మైత్రీ నియామకం చేపడతారు.

సావిత్రీబాయి పూలే హాస్టళ్లు: ఉద్యోగం చేసే మహిళల కోసం ఇప్పటికే ఉన్న హాస్టళ్లు రెట్టింపు చేయడంతోపాటు.. ప్రతీ జిల్లాలోనూ కనీసం ఒక హాస్టల్ ఉండేలా ఏర్పాటు చేస్తారు.