Begin typing your search above and press return to search.

కేసీఆర్ చేసిన తప్పు చేయకుండా కాంగ్రెస్ జాగ్రత్త !

బహుశా కేసీఆర్ ముందే జాబితా విడుదల చేయడం వల్ల పడుతున్న ఇబ్బంది చూసి కాంగ్రెస్ ఆగినట్టు కనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   4 Oct 2023 5:30 PM GMT
కేసీఆర్ చేసిన తప్పు చేయకుండా కాంగ్రెస్ జాగ్రత్త !
X

ఈరోజు మొదటి లిస్ట్, రెండు రోజుల్లో మొదటి జాబితా అంటు కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ నుంచి లీకులు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. నిజానికి మొదటి లిస్ట్ ప్రకటించేందుకు రెడీగానే ఉంది. అయినా ఎందుకనో జాబితా ప్రకటించకుండా అధిష్టానం తాత్సారం చేస్తోంది. బహుశా కేసీఆర్ ముందే జాబితా విడుదల చేయడం వల్ల పడుతున్న ఇబ్బంది చూసి కాంగ్రెస్ ఆగినట్టు కనిపిస్తోంది. పార్టీలో 119 నియోజకవర్గాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తే సుమారు 1206 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 34 నియోజకవర్గాలకు కేవలం ఒక్కో దరఖాస్తు మాత్రమే వచ్చింది. అంటే ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల దాదాపు ఖాయమైపోయినట్లే.

మిగిలిన నియోజకవర్గాల్లోనే అభ్యర్ధుల ఎంపిక పెద్ద సమస్యగా మారింది. పార్టీవర్గాల తాజా సమాచారం ఏమిటంటే ఎన్నికల షెడ్యూల్ తర్వాత మొదటి జాబితా రిలీజ్ అవుతుందట. షెడ్యూల్ ఈనెల 7 లేదా 8 వ తేదీన ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

ఈ రోజు కేంద్ర ఎన్నికల కమీషనర్లు తెలంగాణాలోని పార్టీలతో సమావేశం పెట్టుకుంది. ఇప్పటికే గ్రౌండ్ లెవల్లో రకరకాల సమీక్షలు నిర్వహించేసింది. కాబట్టి ఫైనల్ గా రాజకీయ పార్టీలతో భేటీ అయి అవసరమైన ఫీడ్ బ్యాక్ తీసుకోబోతోంది.

అవసరమైన ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాత ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు రెడీ అవుతుందని అనుకుంటున్నారు. దీంతో షెడ్యూల్ ప్రకటించిన తర్వాత వెంటన మొదటిజాబితా రిలీజ్ చేయాలని ఢిల్లీ నేతలు అనుకుంటున్నారట.

మొదటిజాబితా రిలీజ్ అయ్యిందంటే రెండు, మూడు జాబితాలను కూడా ప్రకటించేందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే అన్నది పార్టీవర్గాల సమాచారం. షెడ్యూల్ ప్రకటించేస్తే ఎన్నికల ఫీవర్ ఒక్కసారిగా పెరిగిపోతోంది.

షెడ్యూల్ ప్రకారం నామినేషన్లు వేయటానికి అభ్యర్ధులందరు రెడీ అయిపోతారు. ఈ నేపధ్యంలో ఇక తిరుగుబాట్లు, అసంతృప్తులను తేలిగ్గానే కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చని అధిష్టానం ఆలోచించిందట. ఎందుకంటే షెడ్యూల్ ప్రకటించేస్తే నామినేషన్ల దాఖలు, ఉపసంహరణకు ఎక్కువ గడువుండదు. కాబట్టి అసంతృప్తుల ఒత్తిడికి లొంగి అభ్యర్దులను మార్చటం అన్నది అంత తేలికగా జరగదు.

అన్నీ పార్టీల్లోను ఇదే సమస్య ఉంటుంది కాబట్టి ఇక అసంతృప్తులైనా, తిరుగుబాటు అభ్యర్ధులైనా చేసేది ఏమీ ఉండదు. మహాయితే పార్టీలోనే ఉండి అభ్యర్ధిని దెబ్బకొట్టడమో లేకపోతే ఎదుటిపార్టీలో చేరటమో చేస్తారంతే. టికెట్లయితే బీఆర్ఎస్ లో రాదు. అందుకనే అధిష్టానం ఈ వ్యూహాన్ని ఎంచుకున్నట్లు సమాచారం.