Begin typing your search above and press return to search.

గట్టి చిక్కుముడి ఎంపీ సీటులో మంత్రి ప్లాన్ అదుర్స్

కాంగ్రెస్ పార్టీలో వర్గాలు అత్యంత సహజం. ఒకటికి నాలుగు గ్రూపులు అన్నట్లుగా పరిస్థితి ఉంటుంది.

By:  Tupaki Desk   |   11 April 2024 8:48 AM GMT
గట్టి చిక్కుముడి ఎంపీ సీటులో మంత్రి ప్లాన్ అదుర్స్
X

తెలంగాణలోని 16 ఎంపీ సీట్లు ఒక ఎత్తు.. ఆ ఒక్క సీటు ఒక ఎత్తు.. ఎన్నికలు ఉన్నా.. లేకున్నా.. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అక్కడ కాంగ్రెస్ పార్టీలో వర్గాలు అత్యంత సహజం. ఒకటికి నాలుగు గ్రూపులు అన్నట్లుగా పరిస్థితి ఉంటుంది. ఇక ఎన్నికల్లో టికెట్ కు వచ్చేసరికి అందరూ పోటీపడుతుంటారు. ఎవరికి ఇవ్వాలో తేల్చుకోలేక అధిష్ఠానమే గమ్మున ఉండే పరిస్థితి.

ఈయనకు ఆమె కాదు తెలంగాణలోని ఖమ్మం ఎంపీ సీటుకు చాలా ప్రత్యేకత ఉంది. స్థానికేతరులైన ఎప్పటికీ పీవీ రంగయ్యనాయుడు, నాదెండ్ల భాస్కరరావు, రేణుకాచౌదరిలను ఇక్కడినుంచి పార్లమెంటుకు పంపారు. అలాంటి చోట 2004 తర్వాత కాంగ్రెస్ విజయం సాధించలేదు. 2009లో టీడీపీ, 2014లో వైసీపీ, 2019లో బీఆర్ఎస్ ఖమ్మంను తమ ఖాతాలో వేసుకున్నాయి. 20 ఏళ్ల తర్వతా ఖమ్మం ఖిల్లాపై మరోసారి కాంగ్రెస్ జెండా ఎగురవేసే అవకాశం దక్కింది. ఎందుకంటే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం లోక్ సభ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలనూ (సీపీఐతో కలుపుకొని) కాంగ్రెస్ గెలుచుకుంది. సహజంగానే కాంగ్రెస్ కు గట్టి పట్టున్న జిల్లా కావడం, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉండడంతో ఈసారి టికెట్ కు పోటాపోటీ నెలకొంది. తుమ్మల కుమారుడు యుగంధర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి, భట్టి భార్య నందిని కూడా టికెట్ కోసం గట్టిగా పట్టుబడుతున్నారు. సీనియర్ నాయకుడు వీహెచ్ సైతం ఖమ్మం టికెట్ కోసం అప్లయ్ చేయడం గమనార్హం. అయితే, వీరి మధ్య అనూహ్యంగా తెరపైకి మరో పేరు వచ్చింది.

నిజామాబాద్ నాయకుడికి.. మంత్రుల ఇంటి వారికి కాకుండా ఖమ్మం కాంగ్రెస్ టికెట్ రేసులో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పేరు వినిపిస్తోంది. ఈయన టీడీపీ హయంలో ఉమ్మడి ఏపీలో మంత్రిగా పేరుతెచ్చుకున్నారు. ఆపై 2014 రాష్ట్ర విభజన తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. 2019లో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా మండవ ఇంటికెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. అప్పటినుంచి కారు పార్టీలోనే కొనసాగిన మండవ అసెంబ్లీ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు ఆయన పేరు ఖమ్మం టికెట్ రేసులో వినిపిస్తోంది.

తెరవెనుక మంత్రాంగం 'మండవకు కాంగ్రెస్ టికెట్' వెనుక చక్రం తప్పింది మంత్రి తుమ్మల నాగేశ్వరరావును అని తెలుస్తోంది. టీడీపీలో ఉండగా సహచరుడైన మండవను ఈ విధంగా తెరపైకి తెచ్చింది ఆయనేనని అంటన్నారు. వాస్తవానికి టీడీపీలో మండవ, కేసీఆర్, తుమ్మల తదితరులు ఒకటే బ్యాచ్. ఆ తర్వాత దారులు వేరయ్యాయి. ఇక ఇప్పటి విషయానికి వస్తే మండవను ఖమ్మంలో నిలపడం ద్వారా అక్కడ గణనీయంగా ఉన్న కమ్మ ఓట్లు రాబట్టే చాన్సుంది. అంతేకాక తెలంగాణలో కమ్మ నాయకులకు ఎక్కడా ఎంపీ టికెట్ ఇవ్వలేదు. ఖమ్మం టికెట్ కు గట్టి పోటీదారైన కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరిని అనూహ్యంగా రాజ్యసభకు పంపారు. మండవకు ఎంపీ టికెట్ ద్వారా ప్రధాన సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు అవుతుందనేది ఓ వాదన. మొత్తానికి తన కుమారుడికి టికెట్ దక్కకున్నా.. మండవను ముందుకుతెచ్చి తుమ్మల తన పంతం నెగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నారు.