Begin typing your search above and press return to search.

ఫండింగ్ కోసం కాంగ్రెస్ ప్రత్యేక కమిటి ?

నిధుల కోసం పార్టీలో ఈమధ్యే చేరిన ఒక పెద్ద నేత ఆధ్వర్యోం ఫండ్ రైజింగ్ కమిటిని కూడా వేసుకున్నారట.

By:  Tupaki Desk   |   22 July 2023 6:08 AM GMT
ఫండింగ్ కోసం కాంగ్రెస్ ప్రత్యేక కమిటి ?
X

రాబోయే ఎన్నికల్లో గెలుపు టార్గెట్ గా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఇది కూడా నాలుగు రకాలుగా ఉంది. మొదటిదేమో అన్నీ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్ధులను రంగంలోకి దింపటం. రెండేదేమిటంటే ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని సీనియర్లందరూ ఏకతాటిపైకి సక్సెస్ చేయటం. మూడోది గ్రామీణస్ధాయి నుండి నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ దాకా పార్టీలోని అందరు నేతలను యాక్టివేట్ చేయటంతో పాటు అనుబంధ సంఘాలను కూడా కలుపుకుని వెళ్ళటం. ఇక చివరిది, కీలకమైనది ఏమిటంటే ఆర్ధక వనరులను సమకూర్చుకోవటం.

పై నాలుగు అంశాలు ఎంతగా ఉన్న విటమిన్ ఎం(మనీ) లేనిదే పని జరగదు. అభ్యర్ధులు ఎంత గట్టి వాళ్ళైనా, ఎంతమంచి పేరున్నా ఓట్లడిగితే వేసే రోజులు పోయాయి. ఓటుకు నాలుగువేలు ఇవ్వాల్సిందే అని ఓటర్లు డిమాండ్ చేసి మరీ తీసుకుంటున్నారు.

అఫ్ కోర్స్ ఇందులో తప్పంతా పార్టీలు, అభ్యర్దుల్లోనే ఉందనుకోండి. ఏదేమైనా డబ్బులేనిదే ఎన్నికల్లో కాలుకూడా ఇంట్లోనుండి బయటపెట్టలేని పరిస్ధితి. అందుకనే ఇప్పటినుండి ఈ విషయమై కాంగ్రెస్ నేతలు గట్టిగా దృష్టిపెట్టారని సమాచారం.

అవసరమైన పండ్ రైజింగ్ కోసం కార్పొరేట్లను, వ్యాపారస్తులు, పెద్ద కాంట్రాక్టర్లతో పాటు ఫార్మారంగంలోని అధిపతులను హస్తంపార్టీ నేతలు కలుస్తున్నారట. నిధుల కోసం రిక్వెస్టులు చేస్తున్నట్లు పార్టీలో టాక్ వినిపిస్తోంది.

రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీన కాబట్టి కాస్త ఉదారంగా సాయం చేయమని రిక్వెస్టు చేస్తున్నారట. నిధుల కోసం పార్టీలో ఈమధ్యే చేరిన ఒక పెద్ద నేత ఆధ్వర్యోం ఫండ్ రైజింగ్ కమిటిని కూడా వేసుకున్నారట.

పార్టీ నేతల ప్రకారం మొత్తం 119 సీట్లలో పార్టీ తరపున డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం సుమారు 60 నియోజకవర్గాల్లో ఉందని గుర్తించారట. ఇందులో కూడా ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్నట్లు తేలిందట.

అందుకనే పై రిజర్వుడు నియోజకవర్గాల్లో వీలైనంతలో ఆర్ధిక, అంగ బలాలు పుష్కలంగా ఉన్న నేతలనే అభ్యర్ధులుగా దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈమధ్య పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఇందులో భాగమే అనే చర్చ పార్టీలో బాగా జరుగుతోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.