Begin typing your search above and press return to search.

డిసెంబర్ సెంటిమెంట్ : కాంగ్రెస్ బీయారెస్ లలో ఎవరికి లక్ ?

మరి ఈసారి అలా జరుగుతుందా అన్నది ఒక చర్చగా ఉంది. నవంబర్ 30న ఎన్నికలు ఉన్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   9 Oct 2023 10:53 PM IST
డిసెంబర్ సెంటిమెంట్ : కాంగ్రెస్ బీయారెస్ లలో ఎవరికి లక్ ?
X

తెలంగాణాలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం డేట్ ఫిక్స్ చేసింది. ఇప్పటికి చూస్తే సరిగ్గా 50 రోజులు మత్రమే గడువు ఉంది. ఈ యాభై రోజులూ తెలంగాణాలోని అన్ని రాజకీయ పార్టీలకూ అగ్ని పరీక్షగానే ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు.

తెలంగాణాలో రెండు సార్లు బీయారెస్ అధికారంలో ఉంది. మూడవసారి గెలుస్తామని అంటోంది. సెంటిమెంట్లు అన్నీ తమకు అనుకూలం అని బీయారెస్ చెబుతోంది. 2018లో డిసెంబర్ 7న ఎన్నికలు జరిగాయి. 11న కౌంటింగ్ జరిగింది. దాదాపుగా తొంబై సీట్లకు చేరువలో బీయారెస్ గెలుచుకుని రెండవసారి అధికారం సొంతం చేసుకుంది.

మరి ఈసారి అలా జరుగుతుందా అన్నది ఒక చర్చగా ఉంది. నవంబర్ 30న ఎన్నికలు ఉన్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వస్తున్నాయి. అంటే డిసెంబర్ సెంటిమెంట్ తమదే అని బీయారెస్ అంటోంది. మరి కాంగ్రెస్ వైపు నుంచి చూస్తే తమకే డిసెంబర్ సెంటిమెంట్ అనుకూలం అంటోంది. తాము తప్పక గెలిచి తీరుతామని అంటోంది.

ఇంతకీ కాంగ్రెస్ డిసెంబర్ సెంటిమెంట్ ఎలా అంటే 1989లో ఉమ్మడి ఏపీకి ఎన్నికలు డిసెంబర్ 2న జరిగాయి. అప్పట్లో అప్రతిహతంగా వెలుగుతున్న తెలుగుదేశం పార్టీని ఎన్టీయార్ ని కాంగ్రెస్ ఓడించి మొత్తం 294 సీట్లకు గానూ 181 సీట్లను గెలుచుకుని అధికారం హస్తగతం చేసుకుంది. తిరిగి 1994 డిసెంబర్ లో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఓడింది.

1999లో చూసుకుంటే నవంబర్ లో ఉమ్మడి ఏపీకి ఎన్నికలు జరిగాయి. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ గెలిచింది. ఇక 2004, 2009లలో మే నెలలోనే ఉమ్మడి ఏపీలో ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ గెలిచింది. దీనికంటే ముందు 1983 జనవరిలో, 1985 మార్చిలో ఎన్నికలు ఉమ్మడి ఏపీలో జరిగితే కాంగ్రెస్ ఓడింది. టీడీపీ గెలిచింది.

అలా చూసుకుంటే డిసెంబర్ లో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఒక్కసారి మాత్రమే గెలిచింది అని చరిత్ర చెబుతోంది. 1983కి ముందు కాంగ్రెస్ ఒక్కటే ఉమ్మడి ఏపీని ఏలింది కాబట్టి ఓటమి కూడా ఎదురుకాలేదు మరి బీయారెస్ విషయం తీసుకుంటే 2014లో మేలో ఎన్నికలు జరిగితే తొలిసారి గెలిచింది.

2018 డిసెంబర్ లో రెండవసారి గెలిచింది. అలా రెండు పార్టీలకు డిసెంబర్ సెంటిమెంట్ ఉందంటే ఉంది. మరి ఈ సెంటిమెంట్ లో ఎవరు ఈసారి విజేత అవుతారు అన్నదే చూడాలి. ఇక బీజేపీ అయితే ఈ సెంటిమెంట్లు కంటే మాకు ప్రజల మద్దతు చాలా ఉంది కాబట్టి గెలిచేస్తామని అంటోంది. సో డిసెంబర్ 3న వచ్చే ఫలితాలు ఎవరికి లక్ అన్నది అత్యంత ఆసక్తికరంగా ఉన్నాయనే భావించాల్సి ఉంది.