Begin typing your search above and press return to search.

సభలో తొలిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బలం చూపారా?

తాజాగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలు అంశాల్ని వెతికి వెతికి మరీ పట్టుకోవటం కనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   15 Feb 2024 4:05 AM GMT
సభలో తొలిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బలం చూపారా?
X

ముఖ్యమంత్రి ఎవరైనా కావొచ్చు.. ఆయన అసెంబ్లీలో ఉన్నప్పుడు.. ఏదైనా విషయం మీద మాట్లాడాలని డిసైడ్ అయినప్పుడు సభలో ఆయనకు కోరినంత సమయాన్ని ఇవ్వటం ఆనవాయితీగా వస్తున్నదే. ఇక.. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారు తమ రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడే వేళలో.. విపక్షాలు మౌనంగా ఉండకుండా.. సీఎంకు కౌంటర్లు వేస్తుండటం మామూలే. ఈ సందర్భంలో అధికార.. విపక్షాల మధ్య మాటల పంచాయితీ సాగుతుంటుంది.

తాజాగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలు అంశాల్ని వెతికి వెతికి మరీ పట్టుకోవటం కనిపిస్తోంది. ఇందుకోసం భారీ ఎత్తున కసరత్తు చేసినట్లుగా చెబుతుంటారు. ఇంతకూ విషయం ఏమంటే.. తెలంగాణలో రేవంత్ సర్కారు కొలువు తీరిన తర్వాత నుంచి ఇప్పటివరకు విపక్ష నేతపై విమర్శలు చేసే అవకాశం వచ్చినంతనే విడిచిపెట్టకుండా పంచ్ ల మీద పంచ్ లు వేసే విషయంలో సీఎం రేవంత్ అస్సలు మొహమాటానికి పోలేదు.

నోటికి వచ్చినట్లుగా కాకుండా కాస్తంత గౌరవ మర్యాదలతోవ్యవహకరించటం కనిపిస్తుంటుంది. ఇలాంటివేళలో.. సీఎం రేవంత్ మాట్లాడుతున్నప్పుడు ఆయనకు తోడుగా కాంగ్రెస్ నేతలు కలిసి రావటం కనిపించదు. కాస్తంత గతానికి వెళితే.. దివంగత వైఎస్ బతికి ఉన్నప్పుడు అసెంబ్లీలో ఎప్పుడైనా తన ప్రత్యర్థుల్ని టార్గెట్ చేస్తూ విరుచుకుపడితే.. వైఎస్ కు తోడుగా అప్పటి కాంగ్రెస్ మంత్రులు.. ఎమ్మెల్యేలంతా కలిసి వైఎస్ మీద ఈగ వాలకుండా జాగ్రత్తలు తీసుకునేవారు,.

ఆ తర్వత వచ్చిన రోశయ్యకు ఆ కిటుకు పెద్దగా వర్కువుట్ కాలేదు కానీ.. కిరణ్ కుమార్ రెడ్డి సైతం ఇదే ప్లాన్ ను వర్కువుట్ చేశారు.అయితే.. ఆయన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కు స్వతహాగానే ఏదో జరిగిపోతుందన్నట్లుగా వ్యవహరించేవారు. రేవంత్ సీఎం అయ్యాక అసెంబ్లీలో అలాంటి సీన్లు పెద్దగా కనిపించింది లేదు. ఏదైనా ఇష్యూలో నాటి ప్రభుత్వం చేసినస పనుల్ని ఉతికి ఆరేసే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ అండ్ కో. ఇదంతా ఒక ఎత్తు అయితే.. రేవంత్ సీఎం హోదాలో సభలో మాట్లాడిన వేళలో.. ఆయనకు దన్నుగా నిలిచేవారు కాదు.

అందుకు భిన్నంగా ఈ రోజు (బుధవారం) చోటు చేసుకుంది. నల్గొండ సభలో సీఎం రేవంత్ ను ఉద్దేశించి గులాబీ బాస్ కేసీఆర్ అంత పరుషంగా ఎలా మాట్లాడతారాన్న ప్రశ్న తలెత్తింది. ఇదిలా ఉంటే ఈ రోజున సభకు రాని కేసీఆర్ ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న తనపై దారుణ వ్యాఖ్యలు చేయటాన్ని తప్పు పట్టారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు గులాబీ నేతలు. దీనిపై ప్రతిగా.. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని రీతిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కూడా సీఎం రేవంత్ వెనుక నిలబడి ఆయన కమాండ్ కు తగ్గట్లు రియాక్టు అవుతున్నారు. ఏమైనా ఇంతకాలానికి కాంగ్రెస్ నేతలకు ఇప్పుడిప్పుడే సోయిలోకి వస్తున్నట్లుగా చెప్పక తప్పదు. ఈ తీరు పెరిగే కొద్దీ గులాబీ నేతలకు కొత్తకష్టం తెరమీదకు వచ్చినట్లుగా చెప్పక తప్పదు.