Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో విడుదల... ఆసక్తికర హామీలివే!

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తాజాగా మేనిఫెస్టోను విడుదల చేసింది.

By:  Tupaki Desk   |   5 April 2024 7:45 AM GMT
కాంగ్రెస్‌  పార్టీ మేనిఫెస్టో విడుదల... ఆసక్తికర హామీలివే!
X

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తాజాగా మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ మేరకు జాతీయ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ముఖ్యనేతలు.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులు "న్యాయ్ పత్ర" పేరుతో ఢిల్లీలో ఈ మేనిఫెస్టోను ప్రకటించారు. ఇందులో ప్రధానంగా ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి, సంక్షేమ సూత్రాలపైనే దీనిని రూపొందించినట్లు మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ చిదంబరం వివరించారు.

అవును... "పాం న్యాయ్ – పచ్చీస్ గ్యారెంటీస్" పేరుతో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. 48 పేజీలతో ఉన్న ఈ మేనిఫెస్టో ఐదు కీలక గ్యారెంటీలు ఉన్నాయి. అందులో... హిస్సేదారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, యువ న్యాయ్, నారీ న్యాయ్ అనే ఐదు గ్యారెంటీలు ఉండగా.. ఒక్కో గ్యారెంటీలోనూ ఐదేసి హామీలు ఉన్నాయి.

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన ఐదు గ్యారంటీలు ఈ విధంగా ఉన్నాయి!

యువతకు జాబ్ గ్యారెంటీ, ఏడాదికి లక్ష జీతం

ప్రతీ మహిళకు ఏడాదికి లక్ష రూపాయల సాయం

కులగణన

గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద దినసరి వేతనం నాలుగు వందలకు పెంపు

స్వామినాథన్ సిఫారసుల మేరకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత

హిస్సేదారి న్యాయ్:

సామాజిక, ఆర్థిక కుల గణన

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ల కల్పనపై 50శాతం సీలింగ్ తొలగింపు

ఎస్సి, ఎస్టీ, సబ్ ప్లాన్ కోసం స్పెషల్ బడ్జెట్

జల్ జంగల్ జమీంపై చట్టబద్ధ హక్కులు

గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గిరిజన ఏరియాలో గుర్తింపు

కిసాన్ న్యాన్:

రుణమాఫీ కమిషన్

స్వామినాథన్ కమిషన్ మేరకు పంటలకు గిట్టుబాటు ధర చట్టబద్దత

పంట నష్టపోయిన 30 రోజుల్లో ఇన్సూరెన్స్ అమౌంట్ చెల్లింపు గ్యారెంటీ

రైతులకు లబ్ది పొందేలా ఎగుమతి దుమతి విధానం

వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ మినహాయింపు

శ్రామిక్ న్యాయ్:

ఉపాధి హామీ పథకంలో రోజుకు 400 రూపాయల కనీస వేతనం

రైట్ టు హెల్త్ చట్టం

పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీ పథకం అమలు

అసంఘటిత రంగ కార్మికులకు లైఫ్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్

ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాలు నిలుపుదల

యువ న్యాయ్:

కేంద్రాన్ని ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాల భర్తీ

యువతకు అప్రెంటిస్ట్ షిప్ కింద నెలకు రూ.8500 చెల్లింపు

ప్రశ్నాపత్రాల లీకులను అరికట్టేందుకు కఠినమైన చట్టం

గిగ్ వర్కర్ల సామాజిక భద్రతకు చర్యలు

యువత స్టార్టప్ కోసం ప్రత్యేకంగా ఐదు వేల కోట్ల నిధి ఏర్పాటు

నారీ న్యాయ్‌:

ప్రతీ పేద కుటుంబంలోని ఒక మహిళకు ఏడాదికి రూ. 1 లక్ష

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు

ఆశ, అంగన్వాడీ మిడ్ డే మీల్ వర్కర్స్కు శాలరీ కాంట్రిబ్యూషన్ డబుల్

మహిళల హక్కుల రక్షణ కోసం అధికారి మైత్రి

వర్కింగ్ విమెన్ కోసం సావిత్రిబాయి పూలే పేరుతో హాస్టల్స్ రెట్టింపు

వీటితోపాటు పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు.. రైల్వేల ప్రైవేటీకరణ నిలుపుదల.. బీజేపీ ప్రభుత్వం తెచ్చిన అగ్నివీర్ రద్దు.. ఎలక్టోరల్ బాండ్లు, ఫెగాసస్, రాఫెల్ పై విచారణతో పాటు మరికొన్ని కీలక హామీలకు కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో పొందుపరిచింది.