Begin typing your search above and press return to search.

మజ్లీస్ కోటలో కాంగ్రెస్ పాగా...?

అలా మజ్లీస్ కోటలలో కాంగ్రెస్ ఈసారి ధీటుగా నిలబడి కొన్ని సీట్లను అయినా గెలుచుకుంటుందని అంటున్నారు. కాంగ్రెస్ వారు కూడా మజ్లీస్ బీయారెస్ బంధాన్ని అలాగే బీయారెస్ బీజేపీ బంధాన్ని కూడా వివరించి చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   1 Nov 2023 12:30 AM GMT
మజ్లీస్ కోటలో కాంగ్రెస్ పాగా...?
X

కాంగ్రెస్ హవా అనాలా లేక మజ్లీస్ ఎత్తులు చిత్తు అవుతున్నాయని భావించాలో ఏమో కానీ మజ్లీస్ కోటలో ఈసారి కాంగ్రెస్ కొన్ని కీలక స్థానాలలో జెండా ఎగరేస్తుందని అంచనాలు అయితే గట్టిగా ఉన్నాయి. మజ్లీస్ కి ఎపుడూ పాత బస్తీ కంచుకోట. అక్కడ ఆ పార్టీకి అరడజన్ కి పైగా సీట్లు కచ్చితంగా వస్తాయి. ఆరు నూరు అయినా అదే ఎపుడూ జరుగుతూ ఉంటుంది.

మజ్లీస్ పార్టీని ఢీ కొట్టాలని ఇతర పార్టీలు చేసే ప్రయత్నాలు పోటీ వరకూ మాత్రమే పరిమితం అవుతూంటాయి. అంతలా ఏకపక్షంగా మజ్లీస్ పాతబస్తీని చేసుకుంది. అయితే ముస్లిం సమాజం ఎప్పటికపుడు చైతన్యం అవుతూ వస్తోంది. తమకంటూ ఒక స్ట్రాంగ్ పార్టీ ఉండాలని మజ్లీస్ కి సపోర్ట్ గా ఉంటూ వస్తున్న ముస్లిం లలో ఇపుడు కొత్త ఆలోచనలు వస్తున్నాయని అంటున్నారు.

దేశంలో మజ్లీస్ పోటీ చేయడమే దానికి కారణం అంటున్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మజ్లీస్ పార్టీ పోటీకి దిగుతోంది. అదే సమయంలో అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్ కి హోరాహోరీ పోటీ సాగుతున్న వేళ ముస్లిం ఓట్లలో చీలిక తీసుకుని రావడం ద్వారా పరోక్షంగా బీజేపీకి మేలు చేస్తోంది అన్న భావన ఉంది.

అలా బీజేపీ చాలా రాష్ట్రాలలో గెలిచింది. ఇదిలా ఉంటే మజ్లీస్ తాను ఎదగాలి అనుకుంటూ పోటీ చేస్తున్నాను తప్ప మరేమీ కాదని చెబుతోంది. తాము పోటీలో లేనపుడు కూడా కాంగ్రెస్ బీజేపీ చేతిలో ఓడిపోలేదా అని ప్రశ్నిస్తోంది. అయితే గతం వేరు బీజేపీకి స్ట్రాంగ్ అపోజిషన్ గా ఇండియా కూటమి ఏర్పాటు అయితే అందులో మజ్లీస్ చేరలేదు. పైగా కాంగ్రెస్ కి యాంటీగా వ్యవహరిస్తోంది.

ఇక తెలంగాణాలో బీయారెస్ కి మద్దతుగా ఉంటోంది. బీయారెస్ కి బీజేపీకి లోపాయికారీగా ఏదో ఉందన్న డౌట్లూ ముస్లిం సమాజంలో ఉన్నాయట. ఈసారి కాంగ్రెస్ తెలంగాణాలో అధికారంలోకి రావాలని ముస్లిమ్స్ కోరుకుంటున్నారుట. పోటా పోటీగా సాగుతున్న ఈ ఎన్నికల్లో మజ్లీస్ ని గెలిపిస్తే ఆ సీట్లు అన్నీ బీయారెస్ కే మద్దతుగా వెళ్తాయని భావిస్తున్న ముస్లిమ్స్ ఈసారి కాంగ్రెస్ కి మద్దతుగా నిలవాలని భావిస్తున్నారుట.

అలా మజ్లీస్ కోటలలో కాంగ్రెస్ ఈసారి ధీటుగా నిలబడి కొన్ని సీట్లను అయినా గెలుచుకుంటుందని అంటున్నారు. కాంగ్రెస్ వారు కూడా మజ్లీస్ బీయారెస్ బంధాన్ని అలాగే బీయారెస్ బీజేపీ బంధాన్ని కూడా వివరించి చెబుతున్నారు. దాంతో మార్పు కనిపిస్తుంది అని అంటున్నారు.

ఇక మజ్లీస్ కి గట్టి సీట్లుగా పేరు పొందిన చార్మినార్, యాకుత్‌పుర, బహుదూర్‌పుర, నాంపల్లి, మలక్‌పేట్, కార్వాన్, చాంద్రాయణగుట్టలలో కాంగ్రెస్ ఢీ కొడుతోంది. ఇందులో కొన్ని సీట్లు అయినా కాంగ్రెస్ పరం అయితే మజ్లీస్ కి మరీ మూడు నాలుగు సీట్లు వస్తాయని కూడా అంచనా కడుతున్నారు.

నిజంగా ఈసారి ఎన్నికలు మజ్లీస్ కి కూడా పెను సవాల్ గా మారుతున్నాయని అంటున్నారు. దీనికి విరుగుడు మంత్రంగా మజ్లీస్ ఈసారి గెలిస్తే తెలంగాణాలో అధికారంలో మజ్లీస్ కి వాటా దక్కుతుందని చెబుతోంది. కానీ ఇది ఎంతవరకూ వర్కౌట్ అవుతుంది అన్నది చూడాల్సి ఉంది. ఒక్కసారి కనుక కాంగ్రెస్ మజ్లీస్ కోటలలో పాగా వేస్తే ఇక మజ్లీస్ కి ఉక్కిరిబిక్కిరి తప్పదని అంటున్నారు.