Begin typing your search above and press return to search.

తెలంగాణలో కాంగ్రెస్ కర్ణాటక స్ట్రాటజీ... 350 మంది రెడీ!

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆ పార్టీ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు కీ రోల్ పోషించారని అంటుంటారు.

By:  Tupaki Desk   |   14 Nov 2023 10:30 AM GMT
తెలంగాణలో కాంగ్రెస్  కర్ణాటక స్ట్రాటజీ... 350 మంది రెడీ!
X

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆ పార్టీ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు కీ రోల్ పోషించారని అంటుంటారు. ఆయన చేపట్టిన ప్రచార కార్యక్రమాలతోపాటు అభ్యర్థుల ఎంపికలోనూ అతని సర్వేలు కీలకంగా పని చేస్తాయని చెబుతుంటారు. దీంతో తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికలోనూ సునీల్ కనుగోలు టీం ఒక సర్వే నిర్వహించిందని అంటారు.

ఇలా ఆయన పంపిన టాప్ 3 లిస్ట్ లో అభ్యర్థులనే ఢిల్లీలోని ఏఐసీసీ పెద్దలు ఫిల్టర్ చేసి ఫైనల్ చేశారని చెబుతారు. ఇప్పుడు ప్రచార కార్యక్రమాలు హోరెత్తించడానికి, వ్యూహాత్మకంగా సోషల్ మీడియాలో ప్రచార కార్యక్రమాల వర్క్ స్టార్ట్ అయ్యిందని తెలుస్తుంది. దీనికోసం ప్రత్యేకంగా 350 మందితో భారీ టీం గాంధీ భవన్ లో అడుగుపెట్టిందని చెబుతున్నారు.

అవును... కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అవ్వడానికి అక్కడి వార్‌ రూం కీలక పాత్ర పోషించిందని చెబుతారు. ఈ క్రమంలోనే అక్కడ అమలు చేసిన స్ట్రాటజీనే తెలంగాణలోనూ అప్లై చేయడానికి సునీల్ కనుగోలు నేతృత్వంలో 350 మంది సభ్యులతో బెంగుళూరు వార్ రూం టీం హైదరాబాద్ కి వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఇందులో భాగంగా... గాంధీ భవన్‌ లోని ఇందిరభవన్ వార్ రూం ని సునీల్ కనుగోలు నేతృత్వంలోని బెంగుళూరు టీం సందర్శించింది! దీంతో తెలంగాణ ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రచారాన్ని మరింత వేగవంతం చేయనున్నారు! దీనికోసం మొత్తం 30 గ్రూపులతో సరికొత్త యాక్షన్ ప్లాన్ ను సునీల్ కనుగోలు సిద్ధం చేసారని తెలుస్తుంది.

ఈ 30 గ్రూపులలో ఒక్కో టీంలో 10 మంది సభ్యుల చొప్పున మొత్తం 300 మంది ఉండనుండగా.. మరో 50 మందిని వార్ రూంకి అటాచ్ చేసాడట సునీల్ కనుగోలు. ఈ 30 టీం లు తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలో పనిచేయనున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల స్పీచ్ లు ప్రిపేర్ చేయడం దగ్గరనుంచి కేసీఆర్ సర్కార్ వైఫల్యాలలను ఎండగట్టేవరకూ ఏ టీం కి ఆ టీం ప్రత్యేకంగా పనిచేయనున్నాయని చెబుతున్నారు.

ఇదే క్రమంలో ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు అనుసరించాల్సిన వ్యూహాలు, స్థానిక సమస్యలను అధ్యయనం చేయడం వంటివి ఈ టీం ల ఆధ్వర్యంలోనే కొనసాగనున్నాయట. ఇలా సునీల్ కనుగోలు వార్ రూం టీం తెలంగాణ ఎన్నికలపై ఫోకస్ చేసిందట. మరి ఈ స్ట్రాటజీతో కర్ణాటక ఫలితాలు తెలంగాణలోనూ రిపీట్ అవుతాయా లేదా అన్నది వేచి చూడాలి.