Begin typing your search above and press return to search.

తాజా సర్వే: లోక్ సభ ఎన్నికల్లోనూ తెలంగాణలో కాంగ్రెస్ గాలి

అయితే.. బీఆర్ఎస్ అధినాయకత్వం అనుకున్నట్లుగా కాంగ్రెస్ సర్కారు ఎక్కువ కాలం పాలన చేయలేదన్న అంచనాల్లో నిజం లేదన్న విషయం తాజాగా విడుదలైన ఒకసర్వే రిపోర్టు స్పష్టం చేస్తోంది.

By:  Tupaki Desk   |   14 Dec 2023 9:47 AM IST
తాజా సర్వే: లోక్ సభ ఎన్నికల్లోనూ తెలంగాణలో కాంగ్రెస్ గాలి
X

పది రోజుల క్రితం వెల్లడైన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో అధికారం కాంగ్రెస్ చేతికి రావటం తెలిసిందే. ఈ ఫలితాలపై బీఆర్ఎస్ మాత్రం రానున్న కొద్ది నెలల్లో తమ చేతికి మళ్లీ అధికారం వస్తుందన్న నమ్మకంతో ఉంది. ఇందుకు తగ్గట్లే.. గులాబీనేతలు పలువురు చేస్తున్న కామెంట్లను చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. బీఆర్ఎస్ అధినాయకత్వం అనుకున్నట్లుగా కాంగ్రెస్ సర్కారు ఎక్కువ కాలం పాలన చేయలేదన్న అంచనాల్లో నిజం లేదన్న విషయం తాజాగా విడుదలైన ఒకసర్వే రిపోర్టు స్పష్టం చేస్తోంది.

మరో నాలుగు నెలల వ్యవధిలో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీయటం ఖాయమని.. అత్యధిక సీట్లను కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంటుందన్న అభిప్రాయాన్ని వెల్లడించింది. టైమ్స్ నౌ ఈటీజీ సర్వే రిపోర్టుప్రకారం లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలోని మొత్తం 17 స్థానాలకు కాంగ్రెస్ కు కనిష్ఠంగా 8 గరిష్ఠంగా 10 వరకు సీట్లు వస్తాయన్న అంచనా వేసింది. గత ఎన్నికల్లో అత్యధికంగా సీట్లు సాధించిన బీఆర్ఎస్ కు ఈసారి లోక్ సభ ఎన్నికల్లో షాక్ తప్పదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

తెలంగాణలో ప్రస్తుతం ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ కు 3-5 స్థానాల్ని మాత్రమే సొంతం చేసుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో బీజేపీ 3-5 స్థానాల్లో తన సత్తా చాటుతుందని చెబుతున్నారు. కాంగ్రెస్ మాత్రం గత ఎన్నికలతో పోలిస్తే పుంజుకొని తమ బలాన్ని పెంచుకోవటం ఖాయమని పేర్కొంది. రానున్న రోజుల్లో అధికారం తమదేనన్నధీమాతో ఉన్న బీఆర్ఎస్ వర్గాలకు తాజా సర్వే బ్యాడ్ న్యూస్ గా మారుతుందని మాత్రం చెప్పక తప్పదు.