Begin typing your search above and press return to search.

రెండు వర్గాలపైనే కాంగ్రెస్ ఆశలా ?

ఇంతకీ ఆ రెండువర్గాలు ఏవంటే ఒకటి నిరుద్యోగులు, రెండో వర్గం కౌలు రైతులు. వివిధ కారణాల వల్ల బీఆర్ఎస్ రెండు వర్గాలను బాగా దూరంచేసుకున్నది.

By:  Tupaki Desk   |   28 Nov 2023 12:30 PM GMT
రెండు వర్గాలపైనే కాంగ్రెస్ ఆశలా ?
X

తెలంగాణాలో ఎన్నికల తేది దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ నేతల్లో మంచి ఊపు కనబడుతోంది. వివిధ వర్గాల నుండి కాంగ్రెస్ కు మద్దతు దొరుకుతుండటమే ప్రధాన కారణం. అయితే ఇందులో కూడా రెండు వర్గాల పైన పార్టీ బాగా ఆశలు పెట్టుకున్నట్లు కనబడుతోంది. ఇంతకీ ఆ రెండువర్గాలు ఏవంటే ఒకటి నిరుద్యోగులు, రెండో వర్గం కౌలు రైతులు. వివిధ కారణాల వల్ల బీఆర్ఎస్ రెండు వర్గాలను బాగా దూరంచేసుకున్నది. ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి కేసీయార్ ప్రభుత్వం ఫెయిలైంది.

అలాగే రైతుబంధని రైతు రుణమాఫీ అని రైతులకోసం ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, లబ్ది ఏవీ కౌలురైతులకు అందటంలేదు. ఇపుడు వివాదాస్పదమైన రైతుబంధు లేదా రైతు రుణమాఫీ ఏవీ కౌలు రైతులకు వర్తించటంలేదు. నిజానికి 5 లేదా 10 ఎకరాలున్న ఆసాములు తమ భూములన కౌలుకు ఇచ్చేస్తున్నారు. వివిధ పథకాల్లో ప్రభుత్వం నుండి అందుతున్న లబ్ది మొత్తం భూస్వాములకు అందుతోంది కాని నిజంగా వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులకు మాత్రం ఏమీ అందటంలేదు.

క్షేత్రస్ధాయిలో వ్యవసాయం చేస్తున్న తమకే ప్రభుత్వం నుండి లబ్ది అందాలని కౌలు రైతులు ఎంతగా మొత్తకుంటున్నా ప్రభుత్వం వీళ్ళని పట్టించుకోవటంలేదు. ప్రభుత్వం దృష్టిలో కౌలురైతులు అసలు రైతులే కాదన్నట్లుగా ఉంది. అందుకనే వీళ్ళంతా కేసీయార్ ప్రభుత్వంపై మండిపోతుంన్నారు. ఈ విధంగా ఉద్యోగాల భర్తీ చేయక నిరుద్యోగుల్లోను, ఎలాంటి లబ్ది అందకపోవటంతో కౌలురైతుల్లోను ప్రభుత్వం అంటే బాగా వ్యతిరేకత పెరిగిపోతోంది.

ప్రభుత్వం లెక్కల ప్రకారమే నిరుద్యోగుల సంఖ్య సుమారు 35 లక్షలుంది. అలాగే కౌలు రైతులు సుమారు 40 లక్షలున్నారు. అంటే రెండు వర్గాలు కలిపి 75 లక్షల మంది ఉన్నట్లు లెక్క. 75 లక్షలంటే మాటలు కాదు. వీళ్ళ ఇళ్ళల్లో తక్కువలో తక్కువ మూడు ఓట్లేసుకున్నా సుమారు 2 కోట్ల ఓట్లుంటాయి. అందుకనే వీళ్ళపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. నిరుద్యోగులకు, కౌలు రైతులకు ప్రత్యేకించి హామీలనిచ్చింది. మరి ఈ రెండువర్గాలు కాంగ్రెస్ ను ఎంతవరకు నమ్ముతారు ? ఎన్ని ఓట్లు పడతాయన్నది అసలు పాయింట్. మరి ఏమవుతుందో చూడాలి.