Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ తొలి జాబితా కౌంట్ డౌన్.. వారి పేర్లు ఖాయమా..?

ఎట్టకేలకు కాంగ్రెస్ తెలంగాణా ఎన్నికల కోసం తొలి జాబితాను విడుదల చేయనుంది.

By:  Tupaki Desk   |   15 Oct 2023 7:45 AM IST
కాంగ్రెస్ తొలి జాబితా కౌంట్ డౌన్.. వారి పేర్లు ఖాయమా..?
X

ఎట్టకేలకు కాంగ్రెస్ తెలంగాణా ఎన్నికల కోసం తొలి జాబితాను విడుదల చేయనుంది. ఆదివారం అందరికీ ఆనందకరం అవుతుందో లేదో అన్న టెన్షన్ అయితే ఖద్దర్ పార్టీ నేతలను పట్టి పీడిస్తోంది. తొలి జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయో అన్నది కూడా అతి పెద్ద సస్పెన్స్ గా ఉంది.

ఇక సగానికి సగం మంది అభ్యర్ధులను తొలి జాబితాలో కాంగ్రెస్ ప్రకటించనుంది. అంటే యాభై మంది అభ్యర్ధులతో భారీ జాబితానే రిలీజ్ చేస్తుంది అన్న మాట. తొలి జాబితలో సీనియర్లతో పాటు గెలుపు గుర్రాలు పార్టీ పట్ల విధేయతతో ఉండేవారినే ఏర్చి కూర్చి రిలీజ్ చేస్తున్నారు అని అంటున్నారు.

అలాగే వివాదాలు లేని చోట వర్గ పోరుకు అవకాశం ఉండని చోట చూసి జాబితాను రెడీ చేసారు అని అంటున్నారు. కాంగ్రెస్ లో ఎన్నో కసరత్తులు మరెన్నో మీటింగ్స్ సిట్టింగ్స్ అయిన మీదట అందరి ఆమోదం తీసుకుని మరీ జాబితాను విడుదలా చేస్తునారు. అలా తొలి జాబితా రిలీజ్ చేసి కాంగ్రెస్ తెలంగాణా ఎన్నికలకు సమరభేరీ మోగించనుంది అని అంటున్నారు.

ఆశావహులకు తొలి జాబితాలో పేరు ఉందో లేదో తెలియక యమ టెన్షన్ గా ఉంది అని అంటున్నారు. అయితే అభ్యర్ధుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ అధినాయకత్వం చాలా లెక్కలు వేసుకుంది. అనేక రకాల కొలమానాలను కూడా తీసుకుంది. దాంతో పాటు ఆయా నియోజకవర్గాలలో సర్వేలు కూడా చెసి గెలుపు అవకాశాలు ఉన్న వారికే టికెట్ ని ప్రకటించనుంది.

ఇక ఆర్ధికంగా బలంగా ఉన్న వారు, విధేయులుగా పార్టీకి ఉన్న వారు, వారు పార్టీలో ఎంత కాలం నుంచి పనిచేస్తున్నారు ఇవన్నీ క్రెడిటేరియాగా తీసుకుంటున్నారు అని తెలుస్తోంది. ఇలా కాంగ్రెస్ అధినాయకత్వం నియమించిన సీఈసీ అభ్యర్ధులను అన్నీ ఆచీ తూచీ మరీ ఎంపిక చేసింది. స్ర్కీనింగ్ కమిటీ పలు దఫాలుగా జరిపిన కసరత్తుకు తుది ఫలితంగా తొలి జాబితా ఉండనుంది. దాంతో కాంగ్రెస్ అభ్యర్ధుల ప్రకటనకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.