Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ బుకింగ్ కౌంటర్ ఫుల్ ఖాళీ...!

పదేళ్లుగా కనిపించని కాంగ్రెస్ ని బయటకు తెచ్చే ప్రయత్నం ఎవరు చేసినా అద్భుతాలు అయితే జరగవు.

By:  Tupaki Desk   |   27 Jan 2024 8:30 AM IST
కాంగ్రెస్ బుకింగ్ కౌంటర్ ఫుల్ ఖాళీ...!
X

ఏపీ కాంగ్రెస్ ఎక్కడ ఉంది అంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. కాంగ్రెస్ ఉనికి పోరాటం చేస్తోంది. పాతాళం అంచులకు తాకిన పార్టీ అది. పదేళ్లుగా కనిపించని కాంగ్రెస్ ని బయటకు తెచ్చే ప్రయత్నం ఎవరు చేసినా అద్భుతాలు అయితే జరగవు. కానీ అలా చేసిన వారిని మాత్రం జనాలు కన్నార్పకుండా విస్మయంగా చూస్తారు.

ఏపీలో కాంగ్రెస్ కి గడ్డు కాలం అలా కంటిన్యూ అవుతోంది. కాంగ్రెస్ కి కొత్త కామందు గా వైఎస్ షర్మిల వచ్చారు. ఆమె ఎవరు అంటే కేరాఫ్ వైఎస్సార్ అని చెప్పాలి. అంతే కాదు ఏపీ సీఎం జగన్ సిస్టర్ అని మరో మాట చెప్పాలి. ఆమెకంటూ సొంతంగా ఇమేజ్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేసినా తెలంగాణాలో అది బెడిసికొట్టింది.

ఆమెను పాల్ కంటే కూడా తక్కువ చేసి పోల్చుతున్న విశ్లేషకులు ఉన్నారు. ఎందుకంటే పాల్ పార్టీ సొంతంగా పెట్టి పోటీ చేశారు. పార్టీ పెట్టి పోటీ చేయకుండా చాప చుట్టేసిన చరిత్ర షర్మిలకే సొంతం అని అంటున్నారు. షర్మిల ఏపీ కాంగ్రెస్ కి నాయకత్వం వహిస్తున్నారు అంటే ఆ పార్టీ వైఎస్సార్ ఫోటో కోసం ఆయన ఇమేజ్ కోసమే అన్నది అర్ధం అవుతోంది.

అయితే వైఎసార్ ఇమేజ్ ని పూర్తి స్థాయిలో వైసీపీ వాడుకుంటోంది. ఆ ఓటర్లు అలా టర్న్ అయిపోయారు. దాంతో షర్మిల చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయి అంటే చెప్పలేని స్థితి ఉంది. ఇదిలా ఉంటే ఈ నెల 24 నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల కోసం బుకింగ్ ని ఓపెన్ చేసి పెట్టింది. అయితే అభ్యర్ధులు మాత్రం పెద్దగా కనిపించడం లేదు. బుకింగ్ అంతా ఖాళీగానే ఉంది అని అంటున్నారు.

అదీ ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అని అంటున్నారు. షర్మిల జిల్లాల టూర్లు వేశారు. శ్రీకాకుళం నుంచి గోదావరి జిలలల దాకా పర్యటించారు. అయితే ఆమె పార్టీలో చేరిన వారు అయితే ఎవరూ లేరు. పాత కాపులు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తిని చూపించకపోవడం విడ్డూరం. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అయితే తాను జనసేనలోకే అని షర్మిల భేటీ తరువాత ఆమె ఉండగానే మీడియాతో చెప్పేశారు.

మరో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అయితే నో పాలిటిక్స్ అని స్పష్టంగా చెప్పారు. ఇక కొత్త వారు బిగ్ షాట్స్ చేరితే కాంగ్రెస్ కి ఊపు వస్తుంది అనుకుంటే వారు ఎవరూ పార్టీ వైపు చూడడంలేదు. ఏపీలో వైసీపీ టీడీపీ జనసేనల చుట్టూనే పాలిటిక్స్ అంతా తిరుగుతోంది. పొత్తులు ఉంటాయని బీజేపీ వైపు చూసే వారు కూడా ఉన్నారు.

దాంతో కాంగ్రెస్ కి అభ్యర్ధులు అంటే పెద్దగా దొరకడంలేదు. మొత్తం 175 నియోజకవర్గలలో అభ్యర్ధులను పెట్టించి పోటీ చేయించడమే షర్మిల ముందు ఉన్న బిగ్ టాస్క్ అని అంటున్నారు. ఇక షర్మిల ఏపీలో పోటీ చేస్తారా చేస్తే ఆమె అయినా గెలుస్తారా అన్నది మరో పెద్ద ప్రశ్న. ఎందుకంటే వైసీపీ టీడీపీ కూటమి మధ్య హోరా హోరీ పోరు సాగుతోంది. దాంతో మూడవ పార్టీ వైపు ఓటరు చూడరు అన్నది ఒక కఠిన విశ్లేషణ.

దాంతో షర్మిల అయినా గెలిచి అసెంబ్లీకి వెళ్తే కాంగ్రెస్ కి ఎంతో కొంత ఊపు వస్తుంది కానీ రెండు లక్షల మంది ఓటర్లు ఉన్న నియోజకవర్గంలో కాంగ్రెస్ కి పది వేల ఓట్లు కూడా పడే నియోజకవర్గం ఒక్కటి కూడా లేకపోవడమే ప్రస్తుతం కనిపిస్తున్న చిత్రం. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్ రామక్రిష్ణారెడ్డి మాత్రమే కాంగ్రెస్ లో చేరిన బిగ్ షాట్ గా చెప్పుకోవాలి. అయితే రానున్న రోజులలో ప్రధాన పార్టీలలో సీటు రాదని తెలిసిన వారు పోటీ చేయాలని చూస్తే మాత్రం కాంగ్రెస్ బెస్ట్ ఆప్షన్ కింద కనిపించవచ్చు.

అప్పటిదాకా కాంగ్రెస్ బుకింగ్ అలా ఓపెన్ చేసి ఉంచాల్సిందే అంటున్నారు. సో కాంగ్రెస్ కి ఊపు వచ్చించి హుషార్ వచ్చింది అని భావిస్తే అది తప్పు అని బాక్సాఫీసు కళ్ళకు కట్టినట్లుగా రుజువు చేస్తోంది. ఇదే నిజం మరి. కాంగ్రెస్ ఏపీని అడ్డగోలుగా విభజించించింది అన్న బాధ ఆవేదన మాత్రం జనాల్లో ఈ రోజుకూ ఉంది అన్నది నిఖార్సు అయిన మాట.