Begin typing your search above and press return to search.

ఎన్డీయేలో రిజిష్టర్ పార్టీలు ఎన్ని...గాలి తీసేశారుగా...?

ఒక వైపు బెంగళూరులో విపక్షాల భేటీ మరో వైపు దేశ రాజధానిలో అధికార పక్షం భేటీ.

By:  Tupaki Desk   |   18 July 2023 3:17 PM GMT
ఎన్డీయేలో రిజిష్టర్ పార్టీలు ఎన్ని...గాలి తీసేశారుగా...?
X

ఒక వైపు బెంగళూరులో విపక్షాల భేటీ మరో వైపు దేశ రాజధానిలో అధికార పక్షం భేటీ. ఇలా రెండు వైపులా హోరా హోరీగా అన్నట్లుగా యుద్ధ సన్నాహాలు వచ్చే ఎన్నికల కోసం వ్యూహాలు ప్రతివ్యూహాలతో జాతీయ రాజకీయం వేడెక్కిపోతోంది. విపక్ష కూటమి భేటీకి 26 పార్టీలు అటెండ్ అయితే మాకు 38 పార్టీల మద్దతు ఉదని ఎన్డీయే తరఫున బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆర్భాటంగా ప్రకటించారు.

ఈ నేపధ్యంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్డీయే భేటీ మీద అసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అసలుఎన్డీయే భేటీలో పాలుపంచుకునే పార్టీలలో రిజిషర్డ్ పార్టీలు ఎన్నో అంటూ వెటకారం ప్రదర్శించారు. అంటే చిన్న పార్టీలు బుల్లి పార్టీలు, అసలు ఎన్నికలలో గెలవని పార్టీలు ఇలా చాలా లిస్ట్ ఉందని విపక్ష నేతలు విమర్శలు మొదలెట్టారు.

అలాంటి పార్టీలు అన్నీ కూడా కూడగట్టి మాదే పెద్ద కూటమి మెగా కూటమి అంటూ ఎన్డీయే పెద్దలు చెప్పుకుంటున్నారు అని విపక్షాలు సెటైర్లు పేల్చుతున్నారు. తమ కూటమిలో యోధానుయోధులైన పార్టీలు ఉన్నాయని అంటున్నారు. నిజానికి చూస్తే విపక్ష కూటమిలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్ ఉభయ వామ పక్షాలు, తృణమూల్ కాంగ్రెస్ తో పాటు కొత్తగా జాతీయ పార్టీ హోదాను దక్కించుకున్న అరవింద్ కేజ్రీవాల్ ఆప్ పార్టీ ఉన్నాయి. అలాగే ఆయా రాష్ట్రాలలో గట్టిగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు చెందిన కీలక నేతలు లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ పవార్, మొహబూబా ముఫ్తీ, డీఎంకే అధినేత స్టాలిన్ తదితరులు అటెండ్ అయ్యారు.

దాంతో సంఖ్యాపరంగా చూసుకున్నా బలాల రిత్యా చూసుకున్నా తమకే ఎక్కువ మద్దతు ఉందని విపక్ష కూటమి చెప్పుకుంటోంది. అదే టైంలో తమలో ఉన్న ఐక్యత కూడా గట్టిదని వచ్చేది తమ కూటమే అంటోంది. ఇక ఎన్డీయేలో ఉన్న పార్టీలలో రిజిష్టర్డ్ పార్టీలు ఎన్నో చెప్పాలంటూ మల్లికార్జున ఖర్గే వేసిన ప్రశ్న కానీ చేసిన సవాల్ కానీ చాలా కీలకమైనదే అని చెప్పాలి.

ఎన్డీయేలో కీలకమైన పార్టీలు అన్నీ జారుకున్నాయని, చిన్నా చితకా పార్టీలతో షో చేస్తోంది అని విపక్ష కూటమి పెద్దలు ఎద్దేవా చేస్తున్నారు. మరి ఇది తప్పు అని తమ కూటమిలో ఉన్న పార్టీలకు ఆయా రాష్ట్రాల్లో ఉన్న బలం ఎంతో వివరంగా చెప్పి ఎన్డీయే పెద్దలు ఈ తరహా విమర్శలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు మరి ఎన్డీయే పెద్దలు ఆ పని చేస్తారా చూడాల్సి ఉంది. ఏది ఏమైనా అటు బలం ఉంటే ఇటు బలగం మాది అంటూ రెండూ వైపులా శిబిరాలు జబ్బలు చరుస్తున్నాయి. అసలు ఎవరికి బలం ఉందో జనాలు తేల్చనున్నారు.