Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కి హ్యాపీ డేస్ కంటిన్యూ...రీజనిదే ?

తెలంగాణా రాజకీయాల్లో కాంగ్రెస్ దూకుడుగా ముందుకు సాగుతోంది. మొన్న పంచాయతీలలో అత్యధిక సీట్లు సాధించింది.

By:  Satya P   |   16 Feb 2026 9:00 AM IST
కాంగ్రెస్ కి హ్యాపీ డేస్ కంటిన్యూ...రీజనిదే ?
X

తెలంగాణా రాజకీయాల్లో కాంగ్రెస్ దూకుడుగా ముందుకు సాగుతోంది. మొన్న పంచాయతీలలో అత్యధిక సీట్లు సాధించింది. నిన్నటికి నిన్న మునిసిపల్ ఎన్నిలల పోరులో మెజారిటీ సీట్లను సొంతం చేసుకుంది. ఇక ఇదే ఉత్సాహంతో మండల జిల్లా పరిషత్ ఎన్నికలకు కూడా పచ్చ జెండా ఊపేస్తోంది. కాంగ్రెస్ తెలంగాణాలో అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పై దాటింది. ఈ మధ్యలో వచ్చిన ప్రతీ ఎన్నికలోనూ కాంగ్రెస్ గెలుస్తూ ఉంటే విపక్షాలు చతికిలపడుతున్నాయి. దానికి వారు చెప్పే రీజన్ అధికార దుర్వినియోగం అని ఇతరత్రా అని చెబుతున్నారు. కానీ వాస్తవంగా చెప్పాలీ అంటే తెలంగాణాలో నెలకొన్న రాజకీయమే కాంగ్రెస్ కి శ్రీరామ రక్షగా ఉంది అని అంటున్నారు. అదేలా అంటే వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి.

త్రిముఖ పోరుతో :

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రతిపక్షంలో బీఆర్ఎస్ బీజేపీ ఉన్నాయి. ఈ మూడు పార్టీల నడుమే ఫైట్ ఎపుడూ సాగుతూ ఉంటుంది. కాంగ్రెస్ మీద ప్రజలలో వ్యతిరేకత ఉండడం సహజం. అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి. మరి ఆ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడానికి అవతల వైపు చూస్తే విపక్షం చీలి ఉంది. బీఆర్ఎస్ బీజేపీ మేమే ఆల్టర్నేషన్ అని జబ్బలు చరుస్తూ జనంలోకి వస్తున్నాయి. దాంతో ఈ వ్యతిరేకత ఆ పార్టీల మధ్య ఓట్లుగా విభజించబడుతోంది. దీంతో కాంగ్రెస్ పని సులువు అవుతోంది అని అంటున్నారు.

కలిసే సీన్ లేదు :

ఇక బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే మాత్రం కాంగ్రెస్ కి ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఈ రెండు పార్టీల ఐక్యతతో కాంగ్రెస్ బండికి బ్రేకులు పడతాయి. లెక్కలు కూడా అలాగే ఉన్నాయి. మునిసిపల్ ఎన్నికల్లో ఆయా పార్టీలకు వచ్చిన ఓటు షేర్ శాతాలను చూసినా ఆదే ఉంది. కానీ ఈ పార్టీలు కలిసేది లేదు. అది అసాధ్యం అని చెప్పాలి. ఎలాగంటే బీఆర్ఎస్ ని ఎంత తగ్గిస్తే తాము అంత ముందుకు పోగలం అన్నది బీజేపీ ఎత్తుగడ. పైగా తెలంగాణాలో ఏకైన ప్రాంతీయ పార్టీగా బీఆర్ ఎస్ ఉంది. ఆ పార్టీ బలం తగ్గిస్తే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తో నేరుగా ఢీ కొడితే తమకు ఉత్తరాది రాష్ట్రాల మాదిరిగా ఫలితాలు వస్తాయని అధికారం దక్కుతుందని బీజేపీ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ లో ఉంది. ఇక బీఆర్ ఎస్ విషయం తీసుకుంటే ముస్లిం మైనారిటీలు ఇతర వర్గాల మీద ఆధారపడిన పార్టీ. ఆ పార్టీ ఓటు బ్యాంక్ కూడా అక్కడే ఉంది. అదే బీఆర్ఎస్ బీజేపీతో జత కడితే ఆ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ కి షిఫ్ట్ అవుతుందని తమకు మరింతగా ఇబ్బంది అవుతుందని గులాబీ పార్టీ లెక్కలేస్తోంది.

గతంలో అలా :

ఇక బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు బీజేపీ బాగా సీట్లూ ఓట్లూ సంపాదించింది అంటే దానికి కారణం విపక్షంలో కాంగ్రెస్ ఉంది. ఆ పార్టీలో వర్గ పోరు అనాసక్తి ఉదాశీనత వంటి కారణాల వల్ల బీజేపీ దూకుడు రాజకీయం చేసింది. పైగా బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ ని తగ్గించాలని చేసిన వ్యూహాలు బీజేపీ ఎదుగుదలకు ఉపయోగపడ్డాయి. కానీ ఇపుడు మొత్తం సినారియో రివర్స్ లో ఉంది. అందుకే బీజేపీ గతం మాదిరిగా పుంజుకోలేకపోతోంది అని అంటున్నారు.

బే ఫికర్ గా ఉండొచ్చా :

తెలంగాణాలో ఈ త్రిముఖ పోరు సాగినంత కాలం కాంగ్రెస్ కి ఎదురు ఉండదనే అంటున్నారు. ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వచ్చి బీఆర్ఎస్ బీజేపీలలో ఏదో ఒక పార్టీ ని స్ట్రాంగ్ గా సపోర్టు చేస్తూ ఏకమొత్తంగా ఓట్లు అన్నీ ఆ పార్టీకే వేసేంతవరకు కాంగ్రెస్ కి అన్నీ హ్యాపీ డేస్ నే అని అంటున్నారు కాంగ్రెస్ సైతం ఈ లెక్కలను గమనించుకుంటూనే తమదైన రాజకీయం చేస్తూ విజయ తీరాలలో విహరిస్తోంది అన్నది విశ్లేషకుల మాట.