Begin typing your search above and press return to search.

కేసీఆర్ సానుభూతి ప‌రులెవ‌రు.. జ‌ల్లెడ ప‌డుతున్న టీ-కాంగ్రెస్‌

దీంతో తెర‌వెనుక బీఆర్ ఎస్ ఏదో వ్యూహం సిద్ధం చేస్తోంద‌ని.. కాంగ్రెస్ నాయ‌కులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   2 Dec 2023 10:23 AM GMT
కేసీఆర్ సానుభూతి ప‌రులెవ‌రు.. జ‌ల్లెడ ప‌డుతున్న టీ-కాంగ్రెస్‌
X

``కేసీఆర్ సానుభూతి ప‌రులు ఎవ‌రు? ఆయ‌న‌కు అనుకూలంగా క్షేత్ర‌స్థాయిలో చ‌క్రం తిప్పుతున్న‌దెవ‌రు? పార్టీ నీళ్లు తాగుతూ.. పొరుగు పార్టీకి సేవ చేయాల‌ని భావిస్తున్న వారు ఎంత‌మంది? తేల్చేయండి.. వారిని క‌ట్ట‌డి చేయ‌డం.. మ‌న దారికి తీసుకురండి. మీరు ఏం చేస్తారో తెలియ‌దు. ఒక్కక్క‌రినీ బుజ్జ‌గించండి.. ఏదైనా చేయండి మీఇష్టం. కానీ.. ఏ ఒక్క‌రూ.. దారిత‌ప్ప‌కూడ‌దు. చేజార‌కూడ‌దు``- ఇదీ.. తెలంగాణ కాంగ్రెస్ విష‌యంలో ఆ పార్టీ నిర్దేశించిన ల‌క్ష్మ‌ణ రేఖ‌.

ఈ బాధ్య‌త‌ల‌ను క‌ర్ణాట‌క రాష్ట్రానికి చెందిన సీనియ‌ర్ నాయ‌కుల‌తో పాటు.. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, జానా రెడ్డి, ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, జ‌గ్గారెడ్డి స‌హా అనేక మంది నాయ‌కుల‌ను ఉద్దేశించి.. పార్టీ అధిష్టానం.. శ‌నివారం తెల్ల‌వారుజాము నుంచే అలెర్ట్ చేసింది. ``మీ మీ స్థాయిలో అంద‌రినీ దారితీసుకురండి. ఎవ‌రైనా విన‌క‌పోతే.. మేం చూసుకుంటాం`` అని కాంగ్రెస్ చెప్ప‌డంతో నాయ‌కులు ఇప్పుడు బిజీగా ఉన్నారు.

ఇంత‌కీ.. కాంగ్రెస్ వ్యూహం ఏంట‌నేది ఆస‌క్తిగా మారింది. త‌మ పార్టీ గెలుపు ప‌క్కా అని తెలంగాణ‌లో తొలిసారి అధికారం ద‌క్క‌నుంద‌ని , ప‌దేళ్ల త‌ర్వాత‌.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ వైపు తెలంగాణ స‌మాజం చూస్తోంద‌ని ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాలు వ‌చ్చాయి. అయితే.. ఈ ఫలితాను.. అధికార బీఆర్ ఎస్ ఏమాత్రం ప‌ట్టించుకోకుండా.. వ‌చ్చేది తామేన‌ని.. సీఎంగా మూడోసారి కేసీఆర్ ప్ర‌మాణ స్వీకారం ఖాయ‌మ‌ని మంత్రి కేటీఆర్ స‌హా కీల‌క నాయ‌కులు చెప్పుకొచ్చారు.

దీంతో తెర‌వెనుక బీఆర్ ఎస్ ఏదో వ్యూహం సిద్ధం చేస్తోంద‌ని.. కాంగ్రెస్ నాయ‌కులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. పైగా.. బీఆర్ ఎస్‌కు ఎంఐఎం.. వంటి కీల‌క పార్టీ కూడా మ‌ద్ద‌తుగా ఉండ‌డం, అధికారం కోల్పోయినా.. మేజిక్ ఫిగ‌ర్‌కు అటు ఇటుగా.. సీట్లు ద‌క్కించుకునే అవ‌కాశం ఉండ‌డంతో రేపు ఏదైనా జ‌ర‌గొచ్చు.. అనే భావ‌న‌లో కాంగ్రెస్ నేత‌లు.. త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే జారి పోయే నాయ‌కుల‌ను ముందుగానే గుర్తి.. ఆక‌ర్ష్ మంత్రానికి ప్ర‌లోభ ప‌డ‌కుండా... అలెర్ట్ చేస్తున్నారు. మ‌రి ఎంత వ‌ర‌కు ఇది స‌క్సెస్ అవుతుందో చూడాలి.