Begin typing your search above and press return to search.

సముద్ర గర్భంలో సంగీత కచేరి... కారణం అద్భుతః!

నీటి అడుగును ప్రేక్షకుల ను అలరించేలా మ్యూజిక్‌ షో నిర్వహిస్తోన్నారు. ఇది ప్రతీ ఏటా జరుగుతుండటం గమనార్హం.

By:  Tupaki Desk   |   5 Aug 2023 6:14 AM GMT
సముద్ర గర్భంలో సంగీత కచేరి... కారణం అద్భుతః!
X

సంగీతానికి గోవులు సైతం నాట్యం చేస్తాయి అని అంటుంటారు.. సంగీతానికి రాళ్లు కూడా కరుగుతాయని చెబుతుంటారు. అయితే ఇంతకాలం ఆ సంగీతం భూమిపైనా, విమానం గాల్లో ఉన్నప్పుడో విని ఉంటారు. అయితే తాజాగా వెరైటీగా సముద్రగర్భంలో సంగీత కచేరీ తెరపైకి వచ్చింది.

అవును... నీటి అడుగున, సముద్ర గర్భం లో స.రి.గ.మ.ప.ద.ని.స. లు వినిపిస్తున్నారు. నీటి అడుగును ప్రేక్షకుల ను అలరించేలా మ్యూజిక్‌ షో నిర్వహిస్తోన్నారు. ఇది ప్రతీ ఏటా జరుగుతుండటం గమనార్హం. ఇదే సమయంలో ఈ ఏడాది కూడా ఆగస్టు నెల లోనే జరగనుంది. ఆ వెరైటీ సంగీత కచేరి ప్రత్యేకతఏమిటో చూద్దాం!

అమెరికా లోని ఫ్లోరిడాలో అభయారణ్యానికి సుమారు 201 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్లోరిడా కీస్‌ నేషనల్‌ మైరైన్‌ శాంక్చురీ ప్రాంతం ఉంది. అక్కడ లూకీ రీఫ్‌ లో ఈ మ్యూజిక్‌ షో జరుగుతుంది. దీన్ని "లోయర్‌ కీస్‌ అండర్వాటర్‌ మ్యూజిక్‌ ఫెస్టివల్‌" అంటారు. ప్రతి ఏడాది ఆగస్టులో నిర్వహిస్తుంటారు.

ఈ సముద్రంలోని సంగీత కచేరి కోసం ఎంతోమంది డైవింగ్‌ చేసుకుంటూ వెళ్లి మరీ ఆ మ్యూజిక్‌ షాలో పాల్గొంటారు. అయితే పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఈ మ్యూజిక్ ఫెస్టివల్‌ ని నిర్వహిస్తుండటం గమనార్హం. ఆ సంగీతాన్ని వినేందుకు ఔత్సాహికులు ఈదుకుంటూ వచ్చి మరీ పాల్గొనడం విశేషం.

ఆ సంగీత కచేరి లో సింగర్స్‌ "వాటర్‌" నేపథ్య సంగీతాన్ని అలపిస్తారు. వాటర్‌ ప్రూఫ్‌ స్పీకర్ల ద్వారా సంగీతం సముద్రంలోకి పైప్‌ చేస్తారు. చూసేందుకు అవకాశం లేని ప్రజల కోసం ఈ మ్యూజిక్‌ ని స్థానిక ఎఫ్‌.ఎం. రేడియో స్టేషన్లో కూడా ప్రసారం చేయడం విశేషం. ఈ కార్యక్రమం నాలుగు గంటల పాటు ఆహ్లాదభరితంగా జరుగుతుంది.

కాగా... పగడపు దిబ్బల పై పర్యావరణ ప్రభావాలను తగ్గించేలా అవగాహన కల్పించడమే ముఖ్యోద్దేశంగా ఇలా వినూత్న రీతిలో మ్యూజిక్‌ ఫెస్టివల్‌ ని నిర్వహిస్తున్నారు ఫ్లోరిడా అధికారులు. ఈ పగడపు దిబ్బలను వారంతా సముద్రపు వర్షారణ్యాలు అని పిలుస్తారు.