Begin typing your search above and press return to search.

వైరల్ ఇష్యూ: సారీ సర్... బ్లెస్ యూ గైస్!

ఈ విషయాలను ట్విట్టర్ వేదికగా కమిషనర్ పంచుకున్నారు. పెళ్లైన తర్వాత తనను కలిసిన పోలీస్ జంటకు పూలబొకే ఇచ్చి కమిషనర్ సీవీ ఆనంద్ శుభాకాంక్షలు తెలిపారు.

By:  Tupaki Desk   |   23 Sep 2023 7:18 AM GMT
వైరల్ ఇష్యూ: సారీ సర్... బ్లెస్  యూ గైస్!
X

ఇటీవల యూనీఫాంలో ప్రీ వెడ్డింగ్ షూట్ చేసిన పోలీస్ జంట వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వీడియోపై విభిన్నంగా కామెంట్స్ వచ్చాయి. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ కూడా రియాక్ట్ అయ్యారు. తప్పుగా చేయలేదంటూనే సున్నితంగా మందలించారు కూడా. అయితే ఆ కొత్త జంట తాజాగా హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ ని కలిశారు.

అవును... కొత్తగా పెళ్లైన పోలీస్ జంటక తాజాగా సీవీ ఆనంద్ ని కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్, వారికి శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో వెడ్డింగ్ షూట్ తో డిపార్ట్మెంట్ ని వార్తల్లో నిలిపినందుకు వారిద్దరూ కమిషనర్ కు క్షమాపణలు చెప్పారు. ఇంకెప్పుడూ డిపార్ట్మెంట్ విషయంలో అలాంటి నిర్ణయాలు తీసుకోబోమని తెలిపారు!

ఈ విషయాలను ట్విట్టర్ వేదికగా కమిషనర్ పంచుకున్నారు. పెళ్లైన తర్వాత తనను కలిసిన పోలీస్ జంటకు పూలబొకే ఇచ్చి కమిషనర్ సీవీ ఆనంద్ శుభాకాంక్షలు తెలిపారు. వారి వైవాహిక జీవితం ప్రేమానురాగాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆశీర్వదించారు.

ఇదే సమయంలో... వ్యక్తిగత ఫంక్షన్లలో కూడా పోలీస్ యూనిఫాం గౌరవాన్ని కాపాడాలని సున్నితంగా సూచించారు. ఈ సందర్భంగా కొత్త జంట తాము చేసిన వెడ్డింగ్ షూట్ విషయంలో కమిషనర్ కు సారీ చెప్పారు. ఇంకెప్పుడూ ఆ విధంగా తమ వ్యక్తిగత అవసరాల కోసం పోలీస్ యూనిఫాం ని ఉపయోగించబోమని తెలిపారు.

కాగా... ఏఆర్ ఎస్సై రావూరి కిషోర్, పంజాగుట్ట ఎస్సై భావన ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లికి ముహూర్తం పెట్టించుకున్నారు. ఈ సమయంలో యూనిఫాం లో డ్యూటీ చేస్తున్నట్టు, పోలీస్ జీపు దిగుతున్నట్టుగా ప్రీవెడ్డింగ్ షూట్ ఒకటి చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

దీనిపై పలువురు విమర్శలు చేశారు. పోలీస్ యూనిఫాం తో వెడ్డింగ్ ఫొటోషూట్ ఏమిటంటూ కామెంట్లు పెట్టారు. దీనిపై డిపార్ట్ మెంట్ తరపున కమిషనర్ సీవీ ఆనంద్ వివరణ ఇచ్చారు. వారు పోలీస్ డిపార్ట్ మెంట్ ప్రాపర్టీస్ ని తప్పుగా ఉపయోగించలేదని వారికి మద్దతుగా నిలిచారు. అదే సమయంలో ముందుగా ఉన్నతాధికారుల అనుమతి తీసుకుని ఉంటే బాగుండేదని స్మూత్ గా సూచించారు!