Begin typing your search above and press return to search.

హాట్ టాపిక్... అలీ మౌనం దేనికి సంకేతం?

తాజాగా ఆయనకు టిక్కెట్ దక్కకపొవడం, ఇప్పుడు అలీ మౌనంగా ఉన్నట్లు కనిపిస్తుండటం చర్చనీయాంశం అవుతుంది.

By:  Tupaki Desk   |   31 March 2024 4:26 AM GMT
హాట్  టాపిక్... అలీ మౌనం దేనికి సంకేతం?
X

సినిమా ఇండస్ట్రీకి చెందినవారిలో.. వైసీపీ సానుభూతిపరులుగా ఉండటంతో పాటు, పార్టీకి ఎంతో సేవ చేసిన పోసాని కృష్ణమురళి, అలీ లకు ఏపీ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించిన సంగతి తెలిసిందే! ఇందులో ఒకరు ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ చైర్మన్ కాగా... మరొకరు ఎలక్ట్రానిక్ మీడియా వ్యవహారాలపై ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నారు! అయితే అలీకి ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి ఉందని కథనాలొచ్చిన వేళ.. తాజాగా ఆయనకు టిక్కెట్ దక్కకపొవడం, ఇప్పుడు అలీ మౌనంగా ఉన్నట్లు కనిపిస్తుండటం చర్చనీయాంశం అవుతుంది.

అవును... సినీనటుడు అలీకి ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆశ ఎక్కువగా ఉంటుందని చెబుతుంటారు! దీంతో... రానున్న ఎన్నికల్లో ఏపీలోని ఏదో ఒక చోట ఆయనకు టిక్కెట్ దక్కే అవకాశం ఉందనే చర్చ కూడా బలంగా నడిచింది. ఇందులో భాగంగా... నంద్యాల, కర్నూలు లోక్ సభ స్థానానికి లేదా... మరేదైనా అసెంబ్లీ స్థానానికీ అలీని పంపిస్తారనే చర్చ కూడా ఒక దశలో బలంగా జరిగింది. అయితే పలు సమీకరణల్లో భాగంగా అలీకి టిక్కెట్ దక్కలేదు! దీంతో ఆయన అలిగారా అనే చర్చ తెరపైకి వచ్చింది.

అయితే... రాష్ట్రంలోని కొన్ని కీలక నియోజకవర్గాల్లోనూ, ప్రధానంగా మైనారిటీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లోనూ పార్టీ ప్రచారానికి అలీ నాయకత్వం వహించాలని వైసీపీ నాయకత్వం కోరుతోందని తెలుస్తుంది. అయితే... ఆ మేరకు పార్టీ నుంచి అధికారికంగా ఇప్పటివరకూ ఎలాంటి అభ్యర్థన లేకపోవడంతో.. ఆయన స్వచ్ఛందగా ముందుకు కదిలేందుకు అనాసక్తి ప్రదర్శిస్తున్నారని తెలుస్తుంది. అయితే ఈ అనాసక్తికి కారణం... టిక్కెట్ దక్కకపోవడమే అన్నే చర్చా తెరపైకి వచ్చింది.

ఇలా తనకు లోక్ సభ కానీ, అసెంబ్లీ టిక్కెట్ కానీ దక్కకపోవడంతో అలీ మనస్తాపానికి గురయ్యారని.. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉండలాని భావిస్తున్నారని.. ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఆయన పొలిటికల్ గా ఇలా లో ప్రొఫైల్ లోనే ఉంటారని తెలుస్తుంది! ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లోనూ గెలిచి తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తే అప్పుడు ఆలికి కచ్చితంగా ఒక పదవిని జగన్ ఇచ్చే అవకాశం లేకపోలేదని అంటున్నారు.

ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి అందుతున్న సమాచారాలు, వస్తున్న కథనాలను బట్టి పరిశీలిస్తే... ఆలీ ఇప్పట్లో పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారా.. లేక, ఇలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూనే ఉంటార అన్నది వేచి చూడాలి! ఏది ఏమైనా... ప్రస్తుతం వైసీపీలో అలీకి సంబంధించిన ఈ చర్చ బలంగా వినిపిస్తోంది!