Begin typing your search above and press return to search.

కల్నల్ ఖురేషీ పుణ్యమే.. ఆర్మీలో మహిళలకు శాశ్వత కమిషన్

ఇదిలా ఉంటే..తాజాగా కల్నల్ సోఫియా ఖురేషీకి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం తాజాగా బయటకు వచ్చింది.

By:  Tupaki Desk   |   9 May 2025 9:43 AM IST
కల్నల్ ఖురేషీ పుణ్యమే.. ఆర్మీలో మహిళలకు శాశ్వత కమిషన్
X

‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం దానికి సంబంధించిన వివరాల్ని వెల్లడించేందుకు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఇద్దరు మహిళలు బాహ్య ప్రపంచానికి తెలియటమే కాదు.. ఓవర్ నైట్ లో ఫేమస్ అయ్యారు. వీరికి సంబంధించి వివరాల్ని తెలుసుకునేందుకు యావత్ దేశంతో పాటు.. పలు దేశాలు ఆసక్తిని ప్రదర్శించాయి. అలా ప్రెస్ మీట్ లో మెరిసిన ఇద్దరు మహిళల విషయానికి వస్తే ఒకరు కల్నల్ సోఫియా ఖురేషీ కాగా మరొకరు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. వీరి నేపథ్యానికి సంబంధించిన వివరాలు ఇప్పటికే బయటకు వచ్చాయి.

ఇదిలా ఉంటే..తాజాగా కల్నల్ సోఫియా ఖురేషీకి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం తాజాగా బయటకు వచ్చింది. అదేమంటే.. ఆమె ప్రతిభకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రత్యేకంగా ప్రశంసించింది. ఎందుకంటే.. ఆమె కారణంగా ఇప్పటివరకు ఆర్మీలో మహిళలకు శశ్విత కమిషన్ లేదు. ఆమె కారణంగా అది వచ్చింది.ఆర్మీలో మహిళలకు శాశ్వత కమిషన్ కు అర్హులేనంటూ సుప్రీం కోర్టు 2020 ఫిబ్రవరి 17న తీర్పును ఇచ్చింది. దీనికి కారణం ఖురేషీ ప్రతిభనే.

ఈ తీర్పు ముందు వరకు ఆర్మీలో మహిళా అధికారుల సేవలను షార్ట్ సర్వీస్ కమిషన్ కే పరిమితం చేసే వారు. వారి శారీరక స్వభావాన్ని.. సామాజిక జీవన వాతావరణాన్ని సాకుగా చూపేవారు. అయితే.. ఈ వాదనల్ని సవాలు చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు. ఈ క్రమంలో మహిళలకు వ్యతిరేకంగా వినిపించిన వావనల్ని సుప్రీం తోసిపుచ్చింది. ఈ క్రమంలో కల్నల్ ఖురేషీ విజయాలు సుప్రీం వరకు వచ్చాయి. దీంతో.. ఆర్మీలో మహిళలకు శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయాలని తీర్పును ఇచ్చింది.

2016లో ఫుణెలో ఎక్సర్ సైజ్ ఫోర్స్ 18 పేరుతో నిర్వహించిన మల్టీ నేషన్ మిలిటరీ ఎక్సర్ సైజ్ లో భారత సైనిక దళానికి అప్పి లెఫ్టినెంట్ కర్నల్ గా సోఫియా ఖురేషీ నాయకత్వం వహించారు. ఈ బాధ్యతను చేపట్టిన తొలి భారతీయ మహిళ ఆమే. అంతేకాదు.. ఐక్యరాజ్యసమితి పీస్ మిషన్ లో భాగంగా 2006లో కాంగోలో విధులునిర్వహించిన ట్రాక్ రికార్డు ఆమె సొంతం. ఇలా సోఫియా ఖురేషీ సాధించిన విజయాల్ని ఉదాహరణలుగా చూపుతూ.. ఆర్మీలో మహిళలకు శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయాలని సుప్రీం పేర్కొనటం.. అందుకు తగ్గట్లే దాన్ని ఏర్పాటు చేయటం జరిగింది.