Begin typing your search above and press return to search.

బైరాన్ – కాబోట్ పబ్లిక్ రొమాన్స్... 'ది సింప్సన్' ముందే ఊహించిందా?

ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఒక ఫోటో... బైరాన్, కాబోట్ కి దగ్గరగా పోలి ఉండే క్షణాల్లోని ఇద్దరు పాత్రలను చూపించింది.

By:  Tupaki Desk   |   20 July 2025 1:00 AM IST
బైరాన్ – కాబోట్  పబ్లిక్  రొమాన్స్... ది సింప్సన్ ముందే ఊహించిందా?
X

అమెరికాలోని ఆస్ట్రానమర్ సంస్థ సీఈఓ ఆండీ బైరన్‌, ఆ కంపెనీ చీఫ్ హెచ్ఆర్ మేనేజర్‌ క్రిస్టిన్ కాబోట్‌.. జులై 16వ తేదీన బోస్టన్‌ లోని జిల్లెట్ స్టేడియంలో జరిగిన కోల్డ్‌ ప్లే కన్సర్ట్‌ లో సన్నిహితంగా కనిపించిన విషయం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో దీన్ని ‘ది సింప్సన్’ ముందే ఊహించిందా అనే విషయం తాజాగా హాట్ టాపిక్ గా మారింది.

అవును... ఆండీ బైరాన్ – క్రిస్టిన్ కాబోట్‌ ల మధ్య జరిగిన కోల్డ్‌ ప్లే 'కిస్ క్యామ్' వ్యవహారం తాజాగా వింత మలుపు తిరిగింది. ఇందులో భాగంగా... 'ది సింప్సన్స్' పాత ఎపిసోడ్ లలో ఈ క్షణాన్ని ముందే ఊహించారంటూ ఓ ప్రచారం సోషల్ మీడియా వేదికగా మొదలైంది. ఈ మేరకు సోషల్ మీడియా యూజర్లు భారీ పుకార్లకు తెరలేపారు.

ఈ సమయంలో వారి ముద్దు సన్నివేశాల క్షణాన్ని 'ది సింప్సన్స్' నుండి ఒక సన్నివేశంతో నెటిజన్లు అనుసంధానించారు. ఇందులో భాగంగా.. 2017 ఎపిసోడ్‌ లో ఈ సన్నివేశం ఉందని చెబుతూ పలు ఫోటోలు షేర్ చేస్తున్నారు. అయితే.. నిశితంగా పరిశీలిస్తే వైరల్ అవుతున్న కొత్త పిక్ ఏఐ సృష్టించబడిందని మరికొందరు అంటున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఒక ఫోటో... బైరాన్, కాబోట్ కి దగ్గరగా పోలి ఉండే క్షణాల్లోని ఇద్దరు పాత్రలను చూపించింది. సీజన్ 28, "కిస్ కిస్, బ్యాంగ్ బెంగళూరు" అనే శీర్షికతో ఉన్న ఎపిసోడ్ - 8లో ఇది ఉందని అంటున్నారు. అయితే దీనిపై షో రన్నర్ అల్ జీన్ స్పందిస్తూ... ఈ వాదనను తోసిపుచ్చారు.

తాము జోస్యం చెప్పమని.. వ్యంగ్యంగా రాయడం మాత్రమే చేస్తామని.. ఏదైనా సారూప్యత ఉంటే అది అదృష్టమే అని అన్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటో ఏ వాస్తవ ఎపిసోడ్ నుండి తీసుకోబడలేదని.. ఏఐ సృష్టించినట్లు కనిపిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా మరికొన్ని రోజులు నెట్టింట ఇదే హాట్ టాపిక్!

మరోవైపు ఈ వ్యవహారంపై ఆస్ట్రోనోమర్ కంపెనీ స్పందించింది. అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా.. ఈ విషయంపై డైరెక్టర్ల బోర్డు అధికారిక దర్యాప్తును ప్రారంభించిందని పేర్కొంది. ఇదే సమయంలో... దర్యాప్తు సమయంలో బైరాన్ తన విధుల నుంచి తప్పుకోవడంతో.. సంస్థ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ పీట్ డిజాయ్ ను తాత్కాలిక సీఈవోగా నియమించారు.