Begin typing your search above and press return to search.

ఈయన జీతం రోజుకు రూ.50 లక్షలు... ఇండియాలో సీఈవోల శాలరీలు తెలుసా?

సాధారణంగా ఐటీ రంగం అంటేనే భారీ వేతనాలకు అవకాశాలున్న రంగం అని చెబుతుంటారు

By:  Tupaki Desk   |   24 April 2024 2:45 AM GMT
ఈయన జీతం రోజుకు రూ.50 లక్షలు... ఇండియాలో సీఈవోల శాలరీలు తెలుసా?
X

సాధారణంగా ఐటీ రంగం అంటేనే భారీ వేతనాలకు అవకాశాలున్న రంగం అని చెబుతుంటారు. సివిల్ సర్వెంట్స్ కి కూడా రాని వేతనాలు.. వీరికి అంతకు మించి అధికంగా వస్తాయని చెబుతుంటారు! ఈ సమయంలో... కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ సింగిశెట్టితో పాటు.. ఇండియాలోని టాప్ ఐటీ కంపెనీల సీఈవోల శాలరీలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

అవును... ఐటీ రంగంలో అత్యధిక వేతనం పొందుతున్న భారతీయ ఎగ్జిక్యూటివ్‌ ల జాబితాలో కాగ్నిజెంట్ సీఈవో అగ్రస్థానంలో ఉన్నారు. ఇందులో భాగంగా... ఈయన గత ఏడాది వార్షిక వేతనంగా 22.56 మిలియన్ డాలర్లు (సుమారు రూ.186 కోట్లు) పొందారు. మాజీ సీఈవో బ్రియాన్ హంఫ్రీస్‌ ను బోర్డు తొలగించిన తర్వాత జనవరి 12, 2023న సింగిశెట్టి నాస్‌ డాక్ లిస్టెడ్ సంస్థకు నాయకత్వం వహించారు.

కంపెనీ దాఖలు చేసిన వివరాల ప్రకారం సింగిశెట్టి వార్షిక వేతనంలో ఎక్కువ భాగం $20.25 మిలియన్లు (సుమారు రూ.169.1 కోట్లు) విలువైన షేర్ల రూపంలో రాగా.. ఈ షేర్లు ఏప్రిల్ 12, 2023న మంజూరు చేయబడ్డాయని తెలుస్తుంది. ఇలా పీఎస్యూలు $30,00,000 లక్ష్య విలువను ఉండగా... అదనంగా ఈక్విటీ అవార్డు $50,00,000 గ్రాంట్ తేదీ విలువ కలిగిన ఆర్.ఎస్.యూలను కలిగి ఉంటుంది.

ఇక ఆర్థిక సంవత్సరంలో కాగ్నిజెంట్ యొక్క $19.35 బిలియన్ల ఆదాయంలో సింగిశెట్టి మొత్తం వేతనం 0.11%గా ఉండటం గమనార్హం. ఈ క్రమంలో భారత్ లోని టాప్ టెన్ సీఈవోల జీతాల వివరాలు, కంపెనీ ఆదాయంలో వాటి శాతాలు ఇప్పుడు చూద్దాం...!

ఇండియాలో టాప్ సీఈవోల జీతాలు:

హెచ్.సీ.ఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ సీఈవో విజయకుమార్ $10.65 మిలియన్లు (సుమారు రూ.88 కోట్లు) సంపాదించారు. ఇది కంపెనీ $12.58 బిలియన్ల ఆదాయంలో 0.085%గా ఉంది.

విప్రో లిమిటెడ్ మాజీ సీఈవో థియరీ డెలాపోర్టే $10.1 మిలియన్ (సుమారు రూ.83 కోట్లు) అందుకున్నారు. ఇది కంపెనీ $11.16 బిలియన్ల ఆదాయంలో 0.089%.

అక్సెంచర్ సీఈఓ జూలీ స్వీట్ వేతనం $31.55 మిలియన్లుగా ఉంది. ఇది కంపెనీ $64.1 బిలియన్ల ఆదాయంలో 0.049% వాటాగా ఉంది.

ఇన్ఫోసిస్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ సలీల్ పరేఖ్ $6.8 మిలియన్లు (సుమారు రూ.56.4 కోట్లు) అందుకున్నారు. ఇది కంపెనీ $18.1 బిలియన్ల ఆదాయంలో 0.037%కి సమానం.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మాజీ సీసీవో రాజేష్ గోపీనాథన్ $3.5 మిలియన్లు (సుమారు రూ.29.16 కోట్లు) సంపాదించారు. ఇది కంపెనీ $27.9 బిలియన్ల ఆదాయంలో 0.012% గా ఉంది.