Begin typing your search above and press return to search.

ఫ‌స్ట్ టైమ్‌: మోడీ స‌ర్కారుకు 7 రోజుల అల్టిమేటం!

కానీ, తాజాగా కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) వ్య‌వ‌స్థాప‌కుడు అభిజిత్ దీప్కే ప్ర‌ధాని మోడీ స‌ర్కారుకు అల్టిమే టం జారీ చేశారు.

By:  Garuda Media   |   7 Jun 2026 11:40 AM IST
ఫ‌స్ట్ టైమ్‌:  మోడీ స‌ర్కారుకు 7 రోజుల అల్టిమేటం!
X

కేంద్రంలో 2014లో ఏర్ప‌డిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం.. ఒక ద‌శ‌లో అవి శ్వాస తీర్మానం ఎదుర్కొంది. దీనిని విజ‌య‌వంతంగా నెగ్గారు. ఇక ఆ త‌ర్వాత‌.. ఇప్ప‌టి వ‌ర‌కు గ‌డిచిన 12 ఏళ్ల కాలంలో మూడు సార్లు అధికారంలోకి వ‌చ్చినా.. మోడీకి తిరుగులేద‌న్న విష‌యం తెలిసిందే. పైగా ఎవ‌రూ మోడీకి, ఆయ‌న ప్ర‌భుత్వానికి కూడా అల్టిమేటం జారీ చేసింది కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మే అయినా.. ఇలా అల్టిమేటం అయితే జారీ చేయ‌లేదు.

కానీ, తాజాగా కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) వ్య‌వ‌స్థాప‌కుడు అభిజిత్ దీప్కే ప్ర‌ధాని మోడీ స‌ర్కారుకు అల్టిమే టం జారీ చేశారు. ఏడు రోజుల స‌మ‌యం ఇస్తున్నామ‌న్నారు.ఈలోగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్రదాన్‌తో రాజీనామా చేయించాల‌ని డిమాండ్ చేశారు. లేక‌పోతే.. ప్ర‌ధానే స్వ‌యంగా ఆయ‌న‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. శ‌నివారం ఉద‌యం 11 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నిర‌స‌న వ్య‌క్తం చేసిన సీజేపీ.. ఆరు గంట‌ల‌కు ముగించింది.

ఈ సంద‌ర్భంగా దీప్కే స‌హా.. కాక్రోచ్ పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ మీడియాతో మాట్లాడారు. ఇప్పు డు జ‌రిగింది ట్ర‌య‌ల్ మాత్ర‌మేన‌ని .. అసలు మూవీ ముందుంద‌ని వ్యాఖ్యానించారు. మోడీ హ‌యాంలో విద్యావ్య‌వ‌స్థ‌పై అనేక ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయ‌న్నారు. త్రిభాషా సూత్రాన్ని బ‌ల‌వంతంగా రుద్దుతున్నా ర‌ని.. నీట్ ప‌రీక్ష పేప‌ర్ లీకై.. ల‌క్ష‌లాది మంది విద్యార్థుల భ‌విత అగమ్య గోచ‌రంగా మారింద‌ని అన్నారు. అయినా.. మంత్రిని తొల‌గించ‌లేద‌న్నారు. ఏడు రోజుల్లో నిర్ణ‌యం తీసుకోక‌పోతే.. త‌మ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తున్నామ‌న్నారు.

బొద్దింక‌ల‌కు భ‌య‌ప‌డ‌తారా?

అయితే.. కాక్రోచ్ జ‌న‌తా పార్టీకి ల‌భించిన ఆద‌ర‌ణ‌.. చేప‌ట్టిన నిర‌స‌న‌పై బీజేపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ క్ర‌మంలో వారు సీజేపీని ఎద్దేవా చేశారు. ``బొద్దింక‌ల‌కు ఎవ‌రైనా భ‌య‌ప‌డ‌తారా?.. అవి క‌నిపిస్తే.. త‌రిమి త‌రిమి కొడ‌తారు.`` అని బీజేపీ ఎంపీ ఒక‌రు వ్యాఖ్యానించారు. బొద్దింక‌ల చ‌ప్పుడును ఎవ‌రూ ప‌ట్టించుకోర‌ని.. విసుగు చెందుతార‌ని వ్యాఖ్యానించారు. ``కాక్రోచ్‌ల గొడ‌వ‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోరు. వాటి గోల‌ను ఎవ‌రూ విన‌రు. ఇదంతా ప్ర‌చారం కోస‌మే`` అని బీజేపీ ఎంపీ ఒక‌రు వ్యాఖ్యానించారు.