దీప్కేపై దాడి: కాక్రోచ్ ఉద్యమంపై కుట్ర: విశ్లేషకుల అంచనా!
కాక్రోచ్ జనతా పార్టీ కేవలం నీట్ పరీక్ష, కేంద్ర మంత్రి రాజీనామా, విద్యార్థులకు న్యాయం వంటి అంశాలకే పరిమితం కాలేదు.
By: Garuda Media | 18 July 2026 8:59 PM ISTవైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన నీట్ పరీక్షలో అవకతవకలు జరగడంతోపాటు.. నీట్ రాసిన పలువురు విద్యా ర్థులు ఆత్మ హత్యకు పాల్పడడం వంటి ఘటనలకు వ్యతిరేకంగా గళం విప్పిన కాక్రోచ్ జనతా పార్టీపై కుట్రలు పన్నుతున్నారా? ఉద్యమాన్ని అణిచేయాలన్న వ్యూహాన్ని కొందరు అమలు చేస్తున్నారా? అంటే.. తాజాగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. ఔననే అంటున్నారు విశ్లేషకులు. ఈ పరిణామాలు ఎలాంటి దారినైనా పట్టే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితి అలానే ఉందని అంటున్నారు.
కాక్రోచ్ జనతా పార్టీ కేవలం నీట్ పరీక్ష, కేంద్ర మంత్రి రాజీనామా, విద్యార్థులకు న్యాయం వంటి అంశాలకే పరిమితం కాలేదు. విద్యా వ్యవస్థలో జవాబుదారీ తనం తీసుకురావాలని పట్టుబడుతోంది. ఇంత జరిగినా.. కేంద్రం మౌనంగా ఉండడాన్ని ప్రశ్నిస్తోం ది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఉద్యమించింది. ఆ తర్వాత.. గత 21 రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆమరణ దీక్షకు ప్రముఖ విద్యావేత్త, సామాజిక వేత్త కూర్చున్న విషయం తెలిసిందే. అయితే.. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆయనను అరెస్టు చేసి ఆసుపత్రికి తరలించారు.
ఆవెంటనే కాక్రోచ్ జనతాపార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే.. శనివారం ఉదయం దీక్షకు కూర్చున్నారు. ఇప్పుడు ఈ ఉద్యమానికి మరిం త దన్ను ఏర్పడుతోంది. దేశవ్యాప్తంగా అనేక మంది నుంచి దీప్కేకు మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిణామం.. అనంతరం పోలీసులు వ్యవహరించిన తీరు వంటివి కాక్రోచ్ పార్టీని ఇరకాటంలోకి నెట్టగా.. దీని వెనుక భారీ కుట్ర ఉందని విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. దీక్షలో కూర్చున్న దీప్కేను చూసేందుకు సమీపంలోకి వచ్చిన ఓ 40-45 ఏళ్ల వయసు న్న మహిళ.. అకస్మాత్తుగా ఆయన మొహంపై రసాయనం వంటి ద్రావణాన్ని చిలకరించింది. దీంతో దీప్కే ఉలిక్కిపడ్డారు.
ఇక, ఇది ఇంకేనని ఒక వర్గం ఆరోపిస్తుండగా.. దీప్కే అనుచరులు సహా.. కాక్రోచ్ పార్టీ కార్యకర్తలు మాత్రం.. ఇది ప్రమాదకర ద్రావణమని.. దీప్కేను చంపేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ద్రావణం పడిన ముఖ భాగంలో మంట, దద్దుర్లు వచ్చినట్టు చెబుతున్నా.. మీడియాను సమీపంలోకి రాకుండా పోలీసులు నిలువరించారు. అదేసమయంలో దీక్షావేదికపై ఉన్న వారిని కూడా దాదాపు ఖాళీ చేయించారు. ఈ పరిణామాలతో కాక్రోచ్ పార్టీపై కుట్ర జరుగుతోందన్న వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. సోమవారంనుంచి పార్లమెంటు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలు మరింత వేడెక్కే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
